Political News

కేసీఆర్ మళ్లీ మొదలుపెట్టారు 

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లున్నారు.  ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు పార్టీలోని ముఖ్యనేతలతో భేటీలు జరిపేందుకు షెడ్యూల్ రెడీచేసినట్లు తెలుస్తోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. జనవరి 3వ తేదీన మొదలవ్వబోయే సమావేశాల షెడ్యూల్ 21వ తేదీతో ముగుస్తోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలోని నేతలకు కేసీయార్ ఒక్కో తేదీని కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్ననే …

Read More »

టికెట్ ఎఫెక్ట్‌.. మైల‌వ‌రంలో తొలి రాజీనామా!

వైసీపీలో టికెట్ల వేడి కొనసాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్‌ను ఆశిస్తున్న‌వా రు కూడా.. పొలిటిక‌ల్ సెగ పెంచుతున్నారు. టికెట్ ఇవ్వాల్సిందేన‌న్న ప‌ట్టుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మ‌రికొందరు వేచి చూస్తున్నారు. చాలా త‌క్కు వ సంఖ్య‌లో మాత్ర‌మే స‌ర్దుకు పోతున్నారు. తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో  టికెట్ ఆశిస్తున్న కీల‌క నాయ‌కుడు పార్టీకి రాజీనామా చేశారు. మైలవరం …

Read More »

పవన్ టార్గెట్ రీచవుతారా ?

జనసేన అధినేత రెండు టార్గెట్లను పెట్టుకున్నారు. మొదటిది పోటీ చేయబోయే సీట్ల సంఖ్య. రెండోది పోటీ చేయబోయే సీట్లలో గెలుపు సంఖ్య. రెండోది తేలాలంటే ముందు మొదటి దానిపై క్లారిటి రావాలి. అందుకనే సీట్ల సంఖ్యపై ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ సిటీలో మూడు రోజులు క్యాంపు వేశారు. ఈ మూడు రోజుల్లో కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలోని 14 నియోజకవర్గాలపై విస్తృతమైన సమీక్షలు …

Read More »

వైసీపీ ఓటు బ్యాంకుపై భారీ వ్యూహం..

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఒక ప్ర‌త్యేక మైన ఓటు బ్యాంకు ఉంది. అదే.. క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు. గ‌త 2014 ఎన్నిక‌ల్లోనూ, 2019 ఎన్నిక‌ల్లోనూ వీరు వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. 2014లో పార్టీ అధికారంలోకి రాక‌పోయినా.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా క్రిస్టియ‌న్‌లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, 2019లో అయితే..ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క కొండ‌పి మిన‌హా.. అన్నింటి లోనూ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే.. …

Read More »

 ప్లీజ్ ఒక్క ఛాన్స్‌.. జ‌గ‌న్‌ను క‌లుస్తా: మాజీ మంత్రి

“ఒక్క ఛాన్స్ ఇప్పించండి.. ప్లీజ్‌.. జ‌గ‌న్ ను క‌లుస్తా.. నా మ‌నసులో మాట చెబుతా. నాకు తీవ్ర అన్యాయం జ‌రిగింది“ అని వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ చేసిన బ‌హిరంగ వ్యాఖ్య‌లు గుంటూరు రాజ‌కీయాల‌ను వేడెక్కిం చాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి …

Read More »

మొదటిజాబితా రెడీ అయ్యిందా?

తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేయబోతున్న 90 మంది అభ్యర్ధులతో మొదటిజాబితా రెడీ అయినట్లు సమాచారం. ఈ జాబితాను సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఈ 90 మందిలో సిట్టింగులు 19 మంది ఉండగా అదనంగా 71 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఫైనల్ అయ్యారట. వీరందరిని తమ నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని చంద్రబాబు డైరెక్టుగా మాట్లాడి ఆదేశించారట. సిట్టింగుల్లో రాజమండ్రి సిటి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని స్ధానంలో ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ …

Read More »

షాకింగ్‌: ఎన్నిక‌ల‌పై `డీప్ ఫేక్` ఎఫెక్ట్‌

`డీప్ ఫేక్‌` టెక్నాల‌జీ.. ఇటీవ‌ల కాలంలో దేశంలో సంచ‌ల‌నంగా మారిన వ్య‌వ‌హారం గురించి తెలిసిందే. ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గార్భా నృత్యం చేస్తున్న‌ట్టుగా.. వివిధ సినీ తార‌ల చిత్రాల‌ను అస‌భ్యంగా చూపించిన ఘ‌ట‌న‌లు దేశంలో సంచ‌ల‌నం సృష్టించాయి. దీనిపై ప్ర‌ధాని సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇక ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వ్య‌వ‌హారం.. దేశ ఎన్నిక‌ల‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌నే ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రో మూడు మాసాల్లో దేశ‌వ్యాప్తంగా …

Read More »

బీజేపీ పొత్తు ఖాయమైనట్లేనా?

రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి నడవటానికి  బీజేపీ రెడీ అయ్యిందా ? అవుతోందా ? ఇపుడిదే చర్చ నడుస్తోంది. జనసేనతో తెలుగుదేశంపార్టీకి పొత్తు కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ లేకుండా కేవలం జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళటం  చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం ఈ విషయమై ఏమీతేల్చని బీజేపీ అగ్రనేతలు తాజాగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈమధ్యనే ఢిల్లీలో …

Read More »

అమెరికాలో వైసీపీ సోష‌ల్ విభాగం ఏర్పాటు.. ప్రాధాన్యం వీరికే!

ఏపీ అధికార పార్టీ వైసీపీ.. అమెరికాలో సోష‌ల్ విభాగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసింది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని.. సోష‌ల్ విభాగాన్ని ఏర్పాటు ఏస్తూ.. పార్టీ నిర్ణ‌యించింది. వీరిలో విద్యావంతులు, ఐటీ, వైద్య రంగాల్లోని యువ‌త‌కు ప్రాధాన్యం క‌ల్పించింది. సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌, కో క‌న్వీన‌ర్ స‌హా, స‌ల‌హాదారులు, సోష‌ల్ మీడియా మేనేజ్‌మెంట్ స‌భ్యులు, నెట్‌వ‌ర్క్ మేనేజ్‌మెంట్ స‌భ్యులు, డిస్ట్రిబ్యూష‌న్ మేనేజ్‌మెంట్, ప్ర‌భావ‌శీల‌క మేనేజ్‌మెంట్ పేర్ల‌తో క‌మిటీలను …

Read More »

జ‌గ్గంపేట జ‌గ‌డం.. నేత‌ల కుస్తీ!

తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట‌. కాపు సామాజిక వ‌ర్గానికి పెట్ట‌ని కోటగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రాజ‌కీయ ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధిం చి వైసీపీ ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని తేల్చి చెప్పింది. ఇదేస‌మ‌యంలో మాజీ ఎంపీ.. కాపు నాయ‌కుడు తోట న‌ర‌సింహానికి టికెట్ ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో చంటిబాబు ఆగ్ర‌హంతో ఉన్న …

Read More »

జ‌న‌సేన లెక్క‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పంచింది 1.28 కోట్లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో చేసిన ఆర్థిక సాయంపై ఆ పార్టీ లెక్క‌లు చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోటీ 28 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పంపిణీ చేసిన‌ట్టు తెలిపింది. వీటిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన‌ప్పుడు.. ఆయా కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున పంపిణీ చేశార‌ని తెలిపింది. ఇలా.. …

Read More »

బీజేపీ గేలం.. ఎంపీ టికెట్ మందకృష్ణకేనా?

వ‌చ్చే మూడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో 10 స్థానాల‌పై బీజేపీ క‌న్నేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ కు వ‌చ్చి మ‌రీ.. ఇక్క‌డి బీజేపీ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని స్థానాల‌పై కొంద‌రు అభ్య‌ర్థుల‌కు సంబంధించి ప్రొఫైల్స్ ను స్వీక‌రించిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. అమిత్‌షాతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  …

Read More »