జనసేన ఆవిర్భావ వేడుకల సంరంభం జయకేతనం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సరిగ్గా11 ఏళ్ల క్రితం ఇదే రోజున జనసేనను ప్రారంభించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆ తర్వాత జనసేనానిగా మారిపోయారు. మొన్నటి ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేట్ తో ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అదే ఊపులో నిర్వహిస్తున్న పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుండగా… పార్టీ అధిష్ఠానం ఊహకు అందనంత మేర జనం జయకేతనం వేదికకు పోటెత్తారు. ఫలితంగా సభ పూర్తి కాకుండానే సక్సెస్ అయ్యిందన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
జనసేనకు ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. ఎంపీలను అలా పక్కనపెట్టినా… పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే హీనపక్షం ఓ 50 వేల మందిని సభకు తీసుకురాగలిగితే… దాదాపుగా 11 లక్షల మంది సభకు హాజరైనట్టు అవుతుంది. అయితే ఈ తరహా సంప్రదాయానికి పవన్ తెరదించారు. పార్టీ శ్రేణులు ఎవరికి వారే… ఆసక్తి ఉంటేనే సభకు రావాలని పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు కూడా జన సైనికులను ఓ రేంజిలో ఇంప్రెస్ చేసినట్టుంది. 10 లక్షల మందికి సరిపడ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తే… శుక్రవారం సభ ప్రారంభానికి ముందుగానే సభా ప్రాంగణం నిండిపోయింది. ఇంకా సభకు భారీ ఎత్తున జనం తరలివస్తూనే ఉన్నారు.
జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జన జన సైనికులు భారీ ఎత్తున చిత్రాడకు తరరివచ్చారు. వీరితో పాటుగా తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పిఠాపురం చేరారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా… పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ చెప్పుకోదగ్గ రీతిలో భారీ సంఖ్యలోనే ఈ సభకు హాజరయ్యారు. ఫలితంగా పార్టీ యంత్రాంగం ఊహించిన దాని కంటే కూడా అధికంగా… ఇంకా చెప్పాలంటే… దాదాపుగా రెండింతలుగా జనం తరలివచ్చినట్లుగా చెబుతున్నారు. వెరసి జనసేన జయకేతనం గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates