Political News

పార్టీ కోసం సాయిరెడ్డి ఇల్లు, ఆఫీస్ అమ్ముకున్నారా..?

వైసీపీకి బిగ్ షాక్… ఇతర పార్టీలకు ఆశ్యర్చాన్ని కలగజేస్తూ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి వ్యవహారంపై పెద్ద చర్చే నడుస్తోంది. రాజకీయాలకు ముందు చేయి తిరిగిన ఆడిటర్ గా వ్యాపారవేత్తలతో చేత ప్రశంసలు అందుకున్న సాయిరెడ్డి… వైఎస్ ఫ్యామిలీ ఆర్థిక లావాదేవీలన్నీ చక్కబెట్టారు. రాజారెడ్డితో మొదలుపెట్టుకుంటే… జగన్ దాకా… వైఎస్ ఫ్యామిలీలో మూడు తరాలకు ఆయన తన ఆడిటింగ్ సేవలను అందించారు. ఇదే విషయాన్ని నిన్నటి నిష్క్రమణ సందేశంలోనూ సాయిరెడ్డి …

Read More »

పబ్లిక్ గా లేడీ కలెక్టర్ పై పొంగులేటి చిందులు!

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ కనిపించింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… అంచనాలకు మించి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించి తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆయనకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున వెల్కమ్ చెప్పాయి. ఈ వీడియో అలా ట్రెండ్ అవుతున్న సమయంలోనే… అదే పార్టీకి చెందిన మరో వీడియో ఎంట్రీ ఇచ్చి… …

Read More »

రంగంలోకి ప‌వ‌న్‌.. ఆ ఎమ్మెల్యేల‌కు ‘క్లాసే’?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏదైనా చెబితే అది జ‌రిగేలా ప‌క్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయ‌న చెప్పిన వాటిలో కొన్ని మాత్ర‌మే జ‌రుగుతున్నాయి. వీటిలో కీల‌క‌మైంది.. కాకినాడ సీపోర్టులో అప్ప‌ట్లో నిలిపి ఉంచిన విదేశీ షిప్పు. ‘సీజ్ ది షిప్‌’ అని ప‌వ‌న్ ఆదేశించినా.. సీజ్ చేయ‌లేక‌పోయారు. ఇది ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌గానే ఉంది. ఇక‌, మ‌రో కీల‌క‌మైన ఆదేశం.. ర‌హ‌దారుల బాగుచేత‌. రాష్ట్ర …

Read More »

జగన్ రాయబారానికి సాయిరెడ్డి లొంగుతారా…?

వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే చర్చ సాగుతోంది. ఉరుము లేని పిడుగులా అలా సోషల్ మీడియాలోకి వచ్చేసి.. తన రాజకీయ నిష్క్రమణను ప్రకటించిన సాయిరెడ్డి అందరినీ షాక్ కు గురి చేశారు. శనివారం తన రాజ్యసభ సదవికి రాజీనామా చేస్తానని సాయిరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ రంగాన్ని …

Read More »

“ఏపీలో కాంగ్రెస్ ఉందా?.. ఉంటే ఉన్న‌ట్టు.. లేదంటే లేన‌ట్టు!”

“ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్న‌ట్టు.. లేదంటే లేన‌ట్టు!”- జాతీయ స్థాయి నాయ‌కుడు, మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ రెండు మూడు రోజుల కింద‌ట ఢిల్లీలో చేసిన వ్యాఖ్య‌లు ఇవి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న ఆయ‌న.. ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. దిగ్వి జ‌య్‌కు తెలుగు రాష్ట్రాల‌కు మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో ఆయ‌న ఇక్క‌డ ఇంచార్జ్‌గా ప‌నిచేశారు. సో.. ఆయ‌న‌కు …

Read More »

జ‌న‌సేన‌లోకి ఆమంచి.. చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మేనా..!

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన ప‌రిస్థితి డోలాయ‌మానంలో ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి బ‌రిలో నిలిచారు. వ్య‌క్తిగ‌త హ‌వాతో నెగ్గుకు రావాల‌ని భావించారు. నిజానికి 2014లో ఇలానే జరిగింది. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓట్లు రాబ‌ట్టుకునేందుకు వినియోగించుకున్నారు. విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత‌.. …

Read More »

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: విజయసాయిరెడ్డి

వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యత్వానికి శనవారం రాజీనామా చేయనున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగతమైనదని కూడా సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కరి ప్రమేయం గానీ, ప్రభావం గానీ లేదని కూడా ఆయన తెలిపారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని …

Read More »

బ‌డ్జెట్ స‌మావేశాలకూ జ‌గ‌న్ డుమ్మా.. ప‌క్కా స్కెచ్ రెడీ!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన విష‌యం తెలిసిందే. కేవ‌లం 11 స్థానాల‌కే ఆయ‌న ప‌రిమితం అయ్యారు. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. బాధ్య‌తాయుత ప్ర‌తిప‌క్షంగా ఆయ‌న శాస‌న స‌భ‌కురావాల్సి ఉంది. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నించాల్సి కూడా ఉంది. కానీ, ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు స‌మావేశాల‌కు డుమ్మా కొట్టారు. కేవ‌లం తొలిసారి ప్ర‌మాణ స్వీకారానికి …

Read More »

‘ప‌ర్య‌ట‌న’ ఫ‌లితం.. ఆరు మాసాల త‌ర్వాతే!

ఏపీ స‌ర్కారు త‌ర‌ఫున సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్‌లు దావోస్‌లో పెట్టుబ‌డులు దూసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంలో వారి శ్ర‌మ‌ను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేయ‌లేం. కానీ, కొన్ని అనివార్య కార‌ణాల‌తో అనుకున్న విధంగా త‌క్ష‌ణ ఫ‌లితం అయితే ద‌క్క‌లేద‌న్న‌ది వాస్త‌వం. దీనికి ప‌లు కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి. కానీ, ఈ చ‌ర్చ‌లు, ఒప్పందాల ఫ‌లితాలు, ఫ‌లాలు కూడా వ‌చ్చే ఆరు మాసాల్లో క‌నిపిస్తాయ‌ని అంటున్నారు …

Read More »

అందరికీ ఈ జిల్లా నేతలు ఆదర్శం… ఎందుకంటే?

నిజమే… తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు అందరికీ ఆదర్శమని చెప్పాలి. ఎందుకంటే.. పార్టీలు వేరైనా… తమ జిల్లా విషయానికి వచ్చేసరికి వారంతా ఏకతాటిపైకి వచ్చేస్తారు. అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతారు. ఫలితంగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారు జిల్లాకు కావాల్సిన మేర నిధులు సాధించుకుంటారు. పనులూ నిర్ణీత సమయంలోగానే పూర్తి చేసుకుంటారు. ఇక రాజకీయ వైరం అంటారా?…అది ఎన్నికల వరకేనట. ఆ …

Read More »

తాటిపర్తి వారు తగ్గేదే లే అంటున్నారే!

తాటిపర్తి చంద్రశేఖర్… వైసీపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. విద్యాధికుడు అయిన ఈయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. సివిల్ ఇంజినీరింగ్ చదివిని ఈయన… సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటారు. తన పార్టీ ఓడిపోయినా… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోర పరాజయం పాలైనా తాటిపర్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. …

Read More »

త‌ల‌సాని ప‌క్క‌ చూపులు.. కేసీఆర్ అలెర్ట్‌!

బీఆర్ఎస్ కీల‌క నేత‌, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ ప‌క్క చూపులు చూస్తున్నారా? పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీఆర్ఎస్ నాయ‌కులు. అంత‌ర్గ‌తంగా పార్టీలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. రాజ‌కీయాల్లో రంగులు మార్చ‌డం కామ‌న్ అయిపోయిన నేప‌థ్యంలో ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ ఉంటారో చెప్ప‌డం క‌ష్టం. సో.. త‌ల‌సాని కూడా దీనికి అతీతుడేమీ కాద‌న్న వాద‌న ఉంది. గ‌తంలో టీడీపీలో ఉన్న ఈయ‌న .. …

Read More »