టీడీపీ అధినేత చంద్రబాబు సినీ డైలాగులతో ఉర్రూతలూగించారు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన జన్మించిన గడ్డపై ‘రా.. కదలిరా!’ సభను నిర్వహించారు. ఈ సభ ఏర్పాట్ల నుంచి నిర్వహణకు వరకు ఆద్యంత ఉద్రిక్త వాతావరణంలోనే సాగింది. అయితే.. చివరి మూడు గంటలు మాత్రం.. పోలీసులు నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం శాంతించింది. దీంతో సభ సజావుగా సాగిపోయింది. ఈ సభలో తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో …
Read More »నాపై పోటీ చేసే అభ్యర్థిని వెతుక్కోండి: రఘురామ
వైసీపీ రెబల్ ఎంపీ, నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజు తాజాగా వైసీపీపై సటైర్లు వేశారు. తనకు టీడీపీ-జనసేన మిత్రపక్షం టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తోందని వైసీపీలో కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే.. వాస్తవానికి ఈ సీటు ఎప్పుడో తనకే రిజర్వ్ అయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మిత్రపక్షం తరఫున తాను నరసాపురం ఎంపీ సీటు నుంచే పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో రెండో మాటేలేదన్నారు. “అయితే.. …
Read More »కేసీఆర్ పథకానికి.. రేవంత్ సొమ్ము!
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేసిన.. కీలక పథకానికి ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం మహిళలను ఆకట్టుకునేందుకు.. ‘బతుకమ్మ చీరలు’ పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఇంటికో చీర చొప్పున పంపిణీ చేసింది. ఇది కూడా కొన్ని చోట్ల వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. …
Read More »పూర్ టు రిచ్ కాన్సెప్ట్ సీక్రెట్ చెప్పిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. గతంలో నిర్వహించిన సభల్లో ప్రకటించిన ‘పూర్ టు రిచ్’ కాన్సె ప్ట్ ను తాజాగా ఆవిష్కరించారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన జన్మభూమి.. నిమ్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తూ.. దీని లక్ష్యాలను కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి.. అధికారంలోకి వచ్చాక సమగ్రంగా అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం నిమ్మకూరు-నారా వారి …
Read More »రాయపాటి ఫ్యామిలీలో రాజకీయ రచ్చ.. టీడీపీకి పోయేదేంటి..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రాయపాటి ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. రాయపాటి సాంబశివరావు.. దాదాపు 40 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు. 2014 వరకు ఆయన కాంగ్రెస్ లో చక్రం తిప్పారు. అయితే.. టీడీపీకి కూడా ఆయన సానుకూలంగా ఉన్నారనే చర్చ ఉంది. విభేదించేవారు కాదు. అంతేకాదు.. అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన.. కన్నా లక్ష్మీనారాయణతోనే వైరం ఉండేది తప్ప.. టీడీపీ నాయకులతో ఆయన ఎక్కడా విభేదించిన సందర్భాలు …
Read More »కాంగ్రెస్ కి పెద్ద షాకే ఇది
తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై మొదటి షాక్ ఇచ్చారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయ్యింది. భర్తీ చేయాల్సిన రెండుపేర్లపై రేవంత్ పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇదే విషయమై పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. …
Read More »అది నిజమైతే.. నియోజకవర్గం వదిలేస్తా: కొడాలి నాని
గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని మరోసారి హీటెక్కించారు. తాజాగా ఆయన టీడీపీపై నిప్పులు చెరిగారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు గుడివాడలో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా టీడీపీఅధినేత చంద్రబాబు నాయుడు రా..కదలిరా! సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున గుడివాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. టీడీపీపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో …
Read More »చంద్రబాబు.. ‘రామన్న రాజ్యం’ పిలుపు!
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకున్న టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మరో రెండు మాసాల్లో రాష్ట్రంలో రామన్న రాజ్యం ఏర్పడుతుందని చెప్పారు. రామన్న రాజ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నాటి ఎన్టీఆర్.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని.. దీంతో రామన్న రాజ్యం ఏర్పడిందని అన్నారు. అయితే.. …
Read More »తారక్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య హుకుం!
విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి చంద్రబాబు బాలకృష్ణ తదితరులు అన్నగారికి నివాళులర్పించారు. అయితే, అంతకుముందు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. …
Read More »నెమ్మదినెమ్మదిగా అడుగులు వేస్తున్న కేసీఆర్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. చేతికర్ర సాయంతో ఆయన ఇంట్లోనే నడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కేసీఆర్ కుటుంబ సభ్యులు మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో మాజీ సీఎం కేసీఆర్.. చేతి కర్ర సాయంతో, వైద్యుని సూచనల మేరకు కొన్ని అడుగుల దూరాన్ని నడుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. కొన్నాళ్ల కిందట కేసీఆర్‌కు తుంటి మార్పిడి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో …
Read More »రేవంత్ దావోస్ ట్రిప్ లో భారీ ఒప్పందాలు
పెద్దగా అంచనాలు లేకపోవటం ఒక్కోసారి కలిసి వస్తుంది. హైప్ అధికంగా ఉన్నప్పుడు ఫెర్ ఫార్మారెన్స్ ఎంత ఉన్నప్పటికీ ఫలితం పెద్దగా ఉండదు. అందుకు భిన్నంగా లొప్రొఫైల్ తో ఉన్న వేళ.. కొద్దిపాటి ఫలితాలు సైతం భారీ పేరు ప్రఖ్యాతులకు కారణమవుతాయి. ఈ లెక్కన చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అదరగొట్టేశారని చెప్పాలి. గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణకు ముఖంగా మారిన కేటీఆర్.. ప్రతి ఏడాది దావోస్ …
Read More »రైతుబంధుపై కీలక నిర్ణయం
రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. గురువారం నుండి అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతున్నది. ఇప్పటికే 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతుబంధు పథకంలో అర్హతకు 2 ఎకరాలను అర్హతగా మొదటి విడతలో ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ముందు రెండు ఎకరాలను సాగుచేసుకుంటున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని …
Read More »