వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భవిష్యత్తు మార్గాలను చూపిస్తున్నాయా? ఆదిశగా ఆయన వేస్తున్న అడుగులు వచ్చే ఎన్నికలకు పునాదులను బలో పేతం చేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రెండు కీలక విషయాలపై చంద్రబాబు పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఈ రెండు కూడా.. గతంలో వైసీపీ అధినేత వదిలేసినవే కావడం గమనార్హం. వాటి వల్లే ఆయన తీవ్రంగా దెబ్బతిన్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సదరు రెండు విషయాలపై పెద్దగా దృష్టిపెట్టారు. 1) ప్రజల మధ్యే ఉండడం. 2) కార్యకర్తలను ప్రాధాన్య అంశంగా మార్చుకోవడం. ఈ రెండు అంశాలు.. ఎన్నికల సమయంలో పార్టీలకు , నాయకులకు కూడా ఎంతో ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు. అయితే.. ఈ చిన్న లాజిక్కును జగన్ మిస్సయ్యారు. దీనిని చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. అందుకే.. కార్యక్రమం ఏదైనా.. చంద్రబాబు ప్రజల మధ్య ఉంటున్నారు.
ప్రతి నెలా 1న పించన్ల పంపిణీ కార్యక్రమం కోసం.. ప్రజల మధ్యకువెళ్తున్నారు. ఇది కామన్‌గా మారిపో యింది. దీనికి తోడు.. గత నెల నుంచి నెల మధ్యలో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని.. పల్లెలకు వెళ్తున్నా రు. ఈ నెలలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లకు వెళ్లారు. పీ-4 కార్యక్రమం గురించి వివరించారు. వచ్చేవారంలో కర్నూలు జిల్లాలోని పల్లెకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అంటే నెల నెలా.. 1 వతేదీ.. సహా.. మరో రెండు సార్లు ప్రజల మధ్య ఉంటున్నారు. గత సీఎం జగన్.. మాత్రం ప్రజలను చివరి వరకు పట్టించుకోలేదన్న విమర్శలు వున్నాయి.
ఇక, మరో కీలకమైన విషయం.. ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఉన్నా.. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వ డం. ఈ విషయంలో చంద్రబాబు కొట్టిన పిండి. గత సీఎం జగన్ లాగా.. వలంటీర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. తా ను తాడేపల్లిలో ఉండకుండా.. చంద్రబాబు.. పార్టీ సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే.. నెలలో ఒకసారి ఏదో ఒక రూపంలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. వారిలో అసంతృప్తిపెల్లుబుకకుండా.. కూడా చూస్తున్నారు. పదవులు.. హోదాల మాట ఎలా ఉన్నా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రసంగాల ద్వారా.. కార్యకర్తలు కట్టుతప్పకుండా.. చూస్తున్నారు. ఈ రెండు విషయాలను పరిశీలిస్తే.. జగన్ కు పాఠం నేర్పిన ఈ విషయాల నుంచే చంద్రబాబు ఫ్యూచర్‌ను బలోపేతం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది.