వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారే అవకాశం ఉందా? ఇదే జరిగితే.. ఆయన కీలక నేతల పేర్లను బయటకు చెప్పే అవకాశం కనిపిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సాయిరెడ్డిని జగన్ మీడియా నిరంతరం.. ఏకేస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన సాయిరెడ్డి ఇప్పుడు కూటమి పంచన చేరుతున్నారని.. ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కూడా వ్యాఖ్యానిస్తోంది.
దీనిలో వాస్తవం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. బీజేపీలోకి వెళ్తున్నారన్నది నిజమే అయినా.. అది ఆయ న పూర్తిగా వ్యక్తిగత విషయం. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పైగా.. రాజకీయాల్లో ఉన్నవా రు వారి ఇష్ట ప్రకారం వ్యవహరిస్తారు. లేదా.. మానుకుంటారు. కానీ.. సాయిరెడ్డి వైసీపీని వీడిపోయారన్న ఏకైక కారణంగా.. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వైసీపీ మీడియా వ్యవహరిస్తోందన్నది వాస్తవం. ఆ విషయాన్నే సాయిరెడ్డి తాజాగా ప్రస్తావించారు.
ఈ పరిణామం.. సాయిరెడ్డిని తీవ్రంగా హర్ట్ చేస్తోంది. పైగా.. ఆయనే స్వయంగా చెప్పినట్టు.. తాను వైసీపీ లో ఉండి ఉంటే.. ఇలా వ్యాఖ్యలు చేసేవారా? అని ప్రశ్నించారు. సహజంగా అనుకూలంగా ఉన్నంత వర కు ఎవరూ ఏమీ అనరు. కానీ.. ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా మారారు. అలాగని మొత్తం విషయాలను బయటకు చెప్పడం లేదు. ఇక, ఇప్పుడు తన వరకు వచ్చే సరికి.. సాయిరెడ్డి యాంటీ అయితే.. అది వైసీపీకి ఆపార్టీ అధినేతకు కూడాఇబ్బంది కలిగించడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ విషయమే ఇప్పుడు తెరమీదికి వచ్చింది. తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని సాయిరెడ్డి చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డియూటర్న్ తీసుకుని.. అన్ని విషయాలు బయటకు చెబితే.. కీలకమైన ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న జగన్ కానీ.. ఇతర నాయకులు, వ్యాపార వేత్తలు కూడా.. ఇరుకున పడే అవకాశం ఉంది. తనను మోసం చేశారంటూ.. అంటున్న సాయిరెడ్డి.. ఇలా మారే వరకు వైసీపీ లాగితే.. అది మొత్తానికే ఇబ్బంది. మరి ఏం చేస్తారోచూడాలి.