ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే వైసీపీ ఒంటరి పోరుకు సై అంది. ఇక, బీజేపీ, టీడీపీ. జనసేన కలిసి ఒకే యూనిట్‌గా పోటీకి దిగుతున్నాయి. ఇక, కమ్యూనిస్టులు-కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు సాగు తున్నాయి. ఇవి ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి. అయితే.. ఇవి కాకుండా.. మరో నాలుగు కీలక పార్టీలు బరిలో ఉన్నాయి. వీటికి ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు లేవు. అవే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ …
Read More »ఏపి కోసం పెద్ద స్కెట్చ్ వేశారు
రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పార్టీ గెలుపుపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాను పోటీచేయబోతున్న సీట్లలో మ్యాగ్జిమమ్ గెలుచుకోవటంతో పాటు మిత్రపక్షాల పార్టీల అభ్యర్ధులను గెలిపిచుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నరేంద్రమోడి వారంలో రెండుసార్లు ఏపీలో పర్యటించబోతున్నారు. ఈనెల 17వ తేదీన చిలకలూరిపేటలో కూటమి ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభకు నరేంద్రమోడి హాజరవుతున్నారు. అలాగే 15వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే రోడ్డుషోలో పాల్గొనే అవకాశముందని …
Read More »గాజువాక సీటుకు మంత్రి గుడివాడ
ఏపీ అధికార పార్టీ వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోరన్న వార్తల నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గానికి మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఇంచార్జ్‌గా నియమించింది. ఈయనకే దాదాపు టికెట్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిల నియామకంలో భాగంగా కొత్త జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను గాజువాక ఇంఛార్జిగా నియమించారు. ఈయనకు …
Read More »‘టికెట్ ఇప్పిస్తానని రజనీ 6.5 కోట్లు వసూలు చేశారు’
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ అధికార పార్టీ వైసీపీలో తీవ్ర కలకలం రేగింది. సీఎం జగన్ కేబినెట్‌లోని మంత్రి విడదల రజనీపై సొంత వైసీపీ నాయకుడు, ఎన్నారై నేత మల్లెల రాజేశ్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఇప్పిస్తానని మంత్రి రజనీ 6.5 కోట్లు వసూలు చేశారు అని బహిరంగ వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దీంతో మంత్రి విడదల రజనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం సీటు విషయం …
Read More »మల్కాజిగిరి నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ నేత ఈయనే
తెలంగాణలో అత్యంత కీలకమైన పార్లమెంటు స్థానంగా ఉన్న మల్కాజిగిరి నుంచి బీఆర్ ఎస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి ఖరారయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శంభీపూర్ రాజు ఇక్కడ పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోటీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి తప్పుకోవడంతో శంభీపూర్ రాజుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. శంభీపూర్ రాజు.. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి …
Read More »రాష్ట్రం కోసమే వెనక్కి తగ్గాం: పవన్
మిత్రపక్షాల సీట్ల పంపకంలో జనసేనకు మరో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని పేర్కొ న్నారు. “పోటీ చేస్తామా.. చేయమా? అనే స్థాయి నుంచి ఇప్పుడు పోటీ చేసేందుకు రెడీ అయ్యాం. సీట్ల సంఖ్య.. హెచ్చు తగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు …
Read More »ఏయే రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి.. తాజా సర్వే!
త్వరలోనే జరగనున్న పార్లమెంటు ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీలూ చమటోడుస్తున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ నిర్ణయించుకుని దూసుకుపో తున్నారు. కనీసం ఇప్పుడైనా గెలవకపోతే.. పార్టీనే పుట్టిమునుగుతుందన్న ఆందోళనలో కాంగ్రెస్ అహర్నిశలూ కష్టపడుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ప్రజల మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీకి …
Read More »కేసీఆర్‌కు గుత్తా గుడ్ బై.. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరిక!
కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత బీఆర్ ఎస్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పడం దాదాపు ఖరారైపోయింది. త్వరలోనే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి గుత్తా తనయుడు అమిత్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు కేటాయించే అవకాశం ఉంది. …
Read More »పొత్తుల ఎఫెక్ట్.. సీఎం రిజైన్
హరియాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న ఈ రాష్ట్ర రాజకీయాలు.. పార్లమెంటు ఎన్నికల వేళ గాడి తప్పాయి. అది కూడా.. కేవలం ఒకే ఒక్క పార్లమెంటు సీటు విషయంలో పొత్తు పార్టీల మధ్య నెలకొన్న వివాదం.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపి.. ఏకంగా ముఖ్యమంత్రి తనపదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం కుప్పకూలింది. ఏం జరిగింది? దేశరాజధాని ఢిల్లీకి చేరువలో ఉన్న …
Read More »ఆమె ట్రోల్స్‌కు భయపడే చనిపోయిందా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండగా.. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు తార స్థాయికి చేరుతున్నాయి. ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టట్లేదు పార్టీలు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రోజుకో వివాదం ముసురుకుంటోంది. ప్రస్తుతం గీతాంజలి అనే గుంటూరు మహిళ మరణానికి చెందిన వివాదం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల కిందట ఈ మహిళ వీడియో …
Read More »ఆ ఇద్దరు ఔట్.. ఏపీలో కీలక నిర్ణయం!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడి వేడిగా మారుతున్నాయి. ప్రత్యర్థుల ను చిత్తు చేసే ఉద్దేశంలో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అధికార పార్టీ ఆ దిశగా మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ ఇప్పుడు ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ వేటు వేశారు. వైసీపీ తరఫున ఎన్నికైన వారు.. వేరే పార్టీల్లో చేరిన నేపథ్యంలో వారిపై మండలి చర్యలు …
Read More »ఫ్యామిలి ప్యాక్ గోల పెరిగిపోతోందా ?
రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ లో టికెట్ల కోసం బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోతోంది. ఇందులో కూడా ఫ్యామిలీ మెంటర్లకు టికెట్లు కావాలంటు సీనియర్ల నుండి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలకనేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికివారుగా తమ కుటుంబసభ్యలకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ …
Read More »