భారత్, పాక్ యుద్ధానికి చెక్ పెట్టిన ట్రంప్

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,
మాపో అధికారికంగా కూడా మిలిటరీ చర్యలకు ఇరుదేశాలు దిగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తాజాగా ప్రకటించారు.

ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, ఒక రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు. సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఇరుదేశాలు తెలివైన నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. ఈ విషయాన్ని తాను తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని ట్రంప్ అన్నారు. తక్షణమే ఇరుదేశాల మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు.

అయితే ఈ వ్యవహారంపై భారత్, పాకిస్తాన్ రక్షణ శాఖ అధికారుల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.