విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపును పునరుద్ధరించడంలో ఏపీలోని కూటమి సర్కారు వేగంగా చర్యలు చేపట్టిందని చెప్పక తప్పదు. బ్లూఫాగ్ సర్టిఫికెట్ అంటేనే… అదో ప్రత్యేక గుర్తింపు కిందే లెక్క. ఈ గుర్తింపు ఉన్న బీచ్ లకు విదేశీ పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. ఫలితంగా ఆదాయం కూడా అదే …
Read More »కూటమి మంత్రి వర్గ ప్రక్షాళన.. ఇప్పుడు సాధ్యమేనా?
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తుందా? లేక.. మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం అవుతుందా? అంటే.. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. కూర్పు వరకు మాత్రమే పరిమితం అవుతుందన్నవాదన ఓ వైపు వినిపిస్తోంది. కానీ, నాణేనికి మరో కోణం అన్నట్టుగా.. ప్రక్షాళన చేయొచ్చన్న సమాచారం కూడా వస్తోంది. దీంతో మంత్రి పదువులు ఆశించే సీనియర్ నాయకులు.. జూనియర్ ఎమ్మెల్యేలు కూడా.. క్యూ కట్టేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ …
Read More »ట్రంప్ టార్గెట్10 లక్షలు!…ఒక్కరోజులో 1,000 విక్రయం!
అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే… గోల్డ్ కార్డ్ పేరిట అమెరికా పౌరసత్వం ఇట్టే దక్కిపోతుంది. ఎంచక్కా అమెరికాలో ఆ దేశ పౌరులుగా చెలామణి అయిపోవచ్చు. ఆ దేశ పౌరులు పొందుతున్న అన్ని రకాల సేవలనూ దర్జాగా పొందవచ్చు. ఈ కొత్త పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు జనం ఎగబడే అవకాశాలున్నాయన్న వాదనలు నిజమేనన్నట్లుగా… గోల్డ్ కార్డుల అమ్మకం మొదలైన …
Read More »షర్మిలమ్మా.. రాజకీయం ఎక్కడమ్మా?!
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే.. ఇంటి పట్టునే ఉంటున్నారని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇంకేముంది.. భూకంపం పుట్టిస్తాను.. కాంగ్రెస్ పార్టీని భూమార్గం పట్టిస్తాను.. అంటూ గత ఏడాది ఫిబ్రవరి లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల.. ఆదిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేసింది లేదు. పైగా.. తాను నమ్ముకున్న సెంటిమెంటు.. తాను …
Read More »మా వోళ్లే పార్టీని సర్వనాశనం చేసిన్రు: ఎమ్మెల్యే
ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేతలపై కా మెంట్లు కుమ్మరించారు. “మా వోళ్లే గ్రూపులు కట్టి.. పార్టీని సర్వనాశనం చేసిన్రు. లేకుంటే అధికారంలోకి ఎప్పు డో వచ్చేటోళ్లం“ అని వ్యాఖ్యానించారు. గ్రూపులు కట్టే నాయకులను ప్రోత్సహించరాదని బీజేపీ అధిష్టానా నికి తాను ఎప్పుడో లేఖ రాసినట్టు చెప్పారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుందన్నా రు. అయితే.. …
Read More »సలహాదారులు కావలెను.. బోర్డు పెట్టిన జగన్?
వైసీపీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి పైలేవాలంటే.. ఖచ్చితంగా పార్టీని పూర్తిగా జీరో నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. 2012లో ఎక్కడ ఎలా పార్టీకి అంకురార్పణ జరిగిందో ఇప్పుడు అదే రేంజ్లో పార్టీని వ్యవస్థీకృత దశ నుంచి అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి 2019లో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న తర్వాత.. పార్టీ నిర్మాణంపై జగన్ పెద్దగా దృష్టి పెట్టలేదు. పైగా.. వలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను వదులుకున్నారు. ఇది …
Read More »వీడియో : జైలు నుండి పోసాని విడుదల
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల రోజులకు కాస్త అటుఇటుగా ఏపీలోని వివిధ జైళ్లలో కాలం వెళ్లదీయాల్సి వచ్చిన పోసాని… శనివారం సాయంత్రం బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానిని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ …
Read More »స్టాలిన్ సక్సెస్.. మోడీ వ్యతిరేక శిబిరానికి జీవం!
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన అఖిల పక్ష సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వచ్చారు. తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ అధినేతలు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. తద్వారా.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిర్వహించిన బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు నిర్వహించిన సమావేశం సక్సెస్ అయిందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రతిపక్షం …
Read More »బాబు సంకల్పాన్ని భుజానికెత్తుకున్న పవన్
ఇంకుడు గుంత, పంట కుంట… వీటి పేర్లు వేరైనా…వీటి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. వాన నీటిని ఒడిసి పట్టి వర్షపు చుక్కలను ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయేలా చేసి… ఆ ప్రాంతంలో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచడమే వీటి ఉద్దేశ్యం. తొలి దానిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రెండో దానిని ఇప్పుడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం …
Read More »జగన్ కు ముందు నుయ్యి… వెనుక గొయ్యి
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసమంటూ తమిళనాడు రాజధాని చెన్నైలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకే శనివారం ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. వాస్తవానికి ఈ సమావేశానికి రావాలంటూ అందరికంటే ముందుగా ఏపీలోని విపక్షం వైసీపీకి ఆహ్వానం అందింది. డీఎంకేకు చెందిన ఓ ఎంపీ, తమిళనాడు మంత్రి తాడేపల్లి వచ్చి మరీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించారు. అయితే జగన్ ఈ …
Read More »‘జంపింగ్’లపై మల్లారెడ్డి మాటలు విన్నారా?
చామకూర మల్లారెడ్డి… నిత్యం వార్తల్లో ఉండే రాజకీయ నాయకుడు. పూలమ్మాను, పాలమ్మాను అంటూనే విద్యావేత్తగా మారిపోయిన మల్లారెడ్డి… ఆ తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మల్కాజిగిరి ఎంపీగా వచ్చీరాగానే సత్తా చాటిన మల్లారెడ్డి… ఆ తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏకంగా తెలంగాణ మంత్రిగానూ ఆయన పదవి దక్కించుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా మరోమారు గెలిచిన మల్లారెడ్డి… తాజాగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. …
Read More »సిసలైన రాజకీయం మొదలెట్టిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ సిసలైన రాజకీయం ఎలా ఉంటుందన్న విషయాన్ని విడమరచి మరీ చెప్పేసింది. ”ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం… ఆ తర్వాత ప్రభుత్వం శాశ్వతం భావనతో సాగాలి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి జగన్”అంటూ లోకేశ్ కామెంట్ చేశారు. ఎంతో పరిణతి ఉంటే తప్పించి ఈ మాట రాదన్నది రాజకీయ విశ్లేషకుల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates