టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో ఏపీకి మహార్దశ పట్టిందనే చెప్పాలి. ఇప్పటికే గడచిన 9 నెలల కూటమి పాలనలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని గ్రౌండ్ కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కంపెనీలు రాష్ట్రానికి వస్తుండగా… అప్పటికే వచ్చి…వైసీపీ దౌర్జన్య కాండ కారణంగా ఏపీకి వదిలి పారిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. …
Read More »రాజు తలచుకుంటే… పదవులకు కొదవా?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పెద్దల సామెత. ఇప్పుడు వైసీపీని చూస్తుంటే… ఆ సామెత కాస్తా… రాజు తలచుకుంటే పదవులకు కొదవా? అని చెప్పుకోవాల్సిందే. అసలే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. పార్టీ ఘోర పరాజయాన్ని ముందే ఊహించిన కొందరు ఎన్నికలకు ముందే పార్టీని వీడితే…ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చాలా మంది …
Read More »వైరల్ గా హోం మినిస్టర్ వీడియో… ఏముందంటే?
ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేనా దానిని చూసిన వారంతా ఏపీ పోలీసు శాఖ తీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులోకి తీసుకువచ్చిన డ్రోన్ టెక్నాలజీని పోలీసు శాఖ ఇంత బాగా వినియోగించుకుంటుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా …
Read More »సీతక్కకు ఉర్దూ రాదు… నాకు తెలుగు రాదు: అక్బరుద్దీన్ ఓవైసీ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వాదనలకు విపక్షాల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. ఆ కౌంటర్లకు అధికార పక్షం నుంచి కూడా రీ కౌంటర్లు పడిపోతున్నాయి. చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి సమావేశాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అది కూడా భాషా సంబంధిత అంశం కావడం గమనార్హం. మంత్రి సీతక్క, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల …
Read More »జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మృతి
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాల రీత్యా జగన్ పెద్దమ్మ సుశీలమ్మ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 85 ఏళ్ల వయసున్న సుశీలమ్మ వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా సతమతమవుతున్నారు. చాలా కాలంగా ఆమె పులివెందులలోని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే సుశీలమ్మను పరామర్శించే నిమిత్తం …
Read More »నిరంజన్ రెడ్డి సేవలు వైసీపీలో కొందరికే పరిమితం
ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా.. చోటుచేసుకున్న పరిణామాలే ఈ కేసులకు కారణమని కూడా చెప్పక తప్పదు. అయితే అధికార కూటమి అక్రమంగా కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ అదిష్ఠానం…కేసులకు భయపడవద్దని, పార్టీ లీగల్ టీం అండగా ఉంటుందని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తోంది. అయితే ఈ భరోసాలో ఒక్కో నేతకు ఒక్కో మాదిరి అన్నట్టుగా న్యాయ …
Read More »వంశీ ముక్కుపై గాయం… ఏం జరిగింది?
వైసీపీలో అందగాళ్లంతా కూటమి సర్కారుకు టార్గెట్ గా మారుతున్నారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ జైలులో పరామర్శించిన తర్వాత జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యల మాటేమిటో గానీ…దళిత యువకుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై జైలులో కాలం వెళ్లదీస్తున్న వంశీ… నెల తిరక్కుండానే …
Read More »ఇప్పాల… ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారా?
ఏపీలో విపక్షం వైసీపీకి హార్డ్ కోర్ అభిమానిగానే కాకుండా ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా కొనసాగుతున్న ఇప్పాల రవీంద్రా రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ సిస్కోలో భారత వ్యవహారాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల వరకూ అకౌంట్ మేనేజర్ గా పనిచేస్తున్న ఇప్పాల.. మంగళవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తో …
Read More »ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం తెలంగాణ RTC గుడ్ న్యూస్
హైదరాబాద్ క్రికెట్ అభిమానుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ మంచి వార్త అందించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్లే అభిమానుల రవాణా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 డిపోల నుంచి మొత్తం 60 బస్సులను ఆటగాళ్లు, ప్రేక్షకుల సౌకర్యార్థం నడపనున్నారు. ఈ సర్వీసులు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మాత్రమే అందుబాటులో …
Read More »ఆన్లైన్ బెట్టింగ్‌పై కేంద్రం క్లారిటీ.. రాష్ట్రాలకే అధికారం!
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ భూతంగా మారుతున్న ఈ రోజుల్లో, కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్‌ను నియంత్రించేందుకు రాష్ట్రాలకే పూర్తి అధికారముందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గనిర్దేశం లభించిందనే చెప్పాలి. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇస్తూ, మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ – …
Read More »మంత్రివర్గంలో మాకు చోటేదీ: కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త చిచ్చు తెరమీదికి వచ్చింది. త్వరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పక్కా క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఏప్రిల్ 3వ తేదీన ముహూర్తం పెట్టినట్టు కూడా చర్చసాగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా మారింది. అయితే.. ఈ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. అయితే.. తాజాగా మాదిగ సామాజిక వర్గానికి …
Read More »బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సీరియస్ విచారణకు సిట్ సిద్ధం!
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం కొనసాగుతూనే ఉంది. యువతను ఫైనాన్స్ దోపిడీ దిశగా నెట్టేసిన ఈ యాప్స్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సెలబ్రిటీల ప్రమోషన్లు, యూట్యూబర్ల స్వార్థపు లాభాల కోసం జరుగుతున్న ఈ ప్రకటనల వలన అమాయకులు బలవుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరిపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates