ప్ర‌జ‌ల‌కు చేరువ‌.. ఈ ఎమ్మెల్యేలు సూప‌ర్‌.. !

కూట‌మి ప్ర‌భుత్వంలో కొందరు ఎమ్మెల్యేల చొర‌వ అద్భుతః అని అనిపిస్తోంది. ఇది ఎవ‌రో వారంటే ఇష్టమైనవారు.. వారికి అనుచ‌రులుగా ఉన్న వారు చెబుతున్న మాట కాదు. అచ్చంగా జ‌నాల నుంచే ఈ మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు వ‌స్తుంటే.. హార‌తులు ప‌ట్టే ప‌రిస్థితి మ‌రోసారి ఏపీలో క‌నిపిస్తోంది. ఇది ఒక‌ప్ప‌టి సంప్ర‌దాయం. ఎమ్మెల్యేలు త‌మ‌కు మేలు చేశార‌ని భావిస్తే.. ప్ర‌జ‌లు వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటారన్న‌ది గ‌తంలో ఎప్పుడో జ‌రిగింది.

ఇప్పుడు మ‌రోసారి అలాంటి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అది కూడా.. కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రీ ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల పేరు చెబితే వెగ‌టు పుట్టించిన చోట ఇప్పుడు కూట‌మి పార్టీల నాయ‌కులు ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జలు వారికి నిజంగానే హార‌తులు ప‌డుతున్నా రు. ఈ జాబితాలో విజ‌య‌వాడలోని తూర్పు, గుంటూరులోని బాప‌ట్ల‌, వినుకొండ‌, కృష్ణాలోని గుడివాడ‌, విశాఖ‌లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం, అదేవిధంగా అనంత‌పురం అర్బ‌న్ వంటివి క‌నిపిస్తున్నాయి.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు.. సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ.. ప్ర‌జ‌ల‌కు మాత్రం ప‌నులు చేసుకుని పోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చేరువ‌గా ఉంటున్నారు. మ‌రీ ముఖ్యంగా గుడివాడ‌లో అయితే.. అసలు పిలిస్తే ప‌లుకుతున్నారు.. అనే పేరు రావ‌డం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పెట్ట‌ని కోట‌గా మారింది. ఎక్క‌డా తేడా లేకుండా.. రాకుండా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు. గ‌తంలో మూడు ద‌శాబ్దాలుగా ప‌రిష్కారం కాని వాటిని కూడా ఇప్పుడు ప‌రిష్క‌రిస్తున్నారు.

ఇక‌, బాప‌ట్ల‌లో అయితే.. ప‌క్క‌నే కృష్ణ‌మ్మ ఉన్నా.. ఇక్క‌డ చాలా గ్రామాల్లో తాగునీటి స‌మస్య ఉంది. దీనిని ప‌రిష్క‌రించేందుకు వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌ల‌జీవ‌న్ మిష‌న్‌ను ఇక్క‌డకు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. విజ‌య‌వాడ తూర్పులో కొండ ప్రాంతాల వారికి అసంపూర్తిగా ఉన్న ప‌ట్టాలు ఇచ్చేశారు. అలాగే.. అనంత‌పురం అర్బ‌న్‌లో ర‌హ‌దారి వెడ‌ల్పు నుంచి ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాల‌ను ఇక్క‌డి ఎమ్మెల్యే ద‌గ్గుబాటి ప్ర‌సాద్ చేస్తున్నారు. సో.. ఇలా.. కొంద‌రు ఎమ్మెల్యేల తీరు అద్భుతః అన్న‌ట్టుగా ఉంద‌ని నివేదిక‌లు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి.