Political News

కూటమి పాలనలో ఏపీ రైజింగ్

రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం పెరగకపోగా…సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలితాలను ఇచ్చాయి. గత 11 నెలల జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే..గత నెల(మార్చి) జీఎస్టీ వసూళ్లు అత్యధిక …

Read More »

బాబు మార్కు చొరవ ఎవ్వరికీ సాధ్యం కాదంతే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు. వారి విషయం ఏమో గానీ.. చంద్రబాబు పర్యటనలను చూస్తున్న సామాన్య జనం అయితే చంద్రబాబు నూటికి రెండు వందల శాతం మారిపోయారంటూ హారతులు పడుతున్నారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమంటూ నిత్యం చెప్పుకునే చంద్రబాబు… ఆ దిశగా గతంలోనూ అడుగులు వేసినా… ఇప్పుడు పేదరికాన్ని పారదోలే దిశగా …

Read More »

పాస్టర్ ప్రవీణ్.. ఇంకో కీలక వీడియో బయటికి

క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులేమో ప్రవీణ్‌ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయాడని చెబుతుండగా.. ఆయన మద్దతుదారులు మాత్రం ఇది హత్యే అని నొక్కి వక్కాణిస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ సహా పలువురు కుట్ర కోణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే అనుమానాలతో గొడవ చేస్తోంది. …

Read More »

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ అదే ఎన్డీఏనే అధికారం కొనసాగిస్తోంది. నాడు కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఇప్పుడు కూడా అదే పదవిలో ఉన్నారు. నాడు సీఎం హోదాలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్ మెంట్ అంత …

Read More »

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రహస్యాలు, చీకటి కోణాలు, బయటకు రాని మర్మాలు అంటూ ఏవీ ఇక ఉండబోవని చెప్పాలి. ఏం చేసినా ఎదుటి వారికి కించిత్ కూడా అనుమానం రాకుండా…అసలు జరిగిన కార్యం ఎలా జరిగిందో కూడా అవతలి వారికి తెలియకుండా పనులు చక్కబెట్టడంలో వంశీది అందె వేసిన చేయ్యేనన్న ప్రచారం ఉంది కదా. ఆ తరహా ప్రచారం ఇకపై ఉండబోదు. ఎందుకంటే…తెర ముందు వంశీ …

Read More »

సరదా సరదాగా!… నవ్వుతూ తుళ్లుతూ!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మోముపై నిత్యం చిరునవ్వు చిందుతూనే ఉంటుంది. ఓ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సగటు మిడిల్ క్లాస్ మనిషిగా ఉండటానికే ఇష్టపడతారు కూడా. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్తులపై విరుచుకుపడుతున్న సమయంలో రేవంత్ ఓ ప్రళయ రుద్రుడి మాదిరే కనిపిస్తారు. ఆ సందర్భాల్లో రేవంత్ నోట నుంచి వచ్చే మాటలు తూటాల్లా పేలతాయి. అయితే ఆ ప్రసంగం …

Read More »

ఊరటకు హైకోర్టు ససేమిరా… కాకాణి అరెస్టు తప్పదా?

అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరింత చిక్కుల్లో పడిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 2 రోజుల పాటు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన కాకాణికి.. మంగళవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో తనపై తొందరపాటు చర్యలు చేపట్టకుండా… ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న కాకాణి పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఇందులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ …

Read More »

ఆ నలుగురి కోసం రంగంలోకి జానా రెడ్డి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు గానీ… చూస్తుంటే ఇంకా చాలా కసరత్తే జరుగుతున్నట్లుగా ఉంది. అంతేకాకుండా ఇంకా విస్తరణకు సంబంధించిన జాబితా కూడా సిద్ధం కాలేదన్న వాదనలకూ బలం చేకూరుతోంది. ప్రస్తుతానికి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ లో ఇంకో ఆరు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఓ నాలుగు స్థానాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… ఆ నలుగురూ …

Read More »

నేను ‘డైలాగులు’ చెప్పే ర‌కం కాదు: జ‌గ‌న్ పై బాబు సెటైర్లు

“కొంద‌రు చెబుతారు.. మాట ఇచ్చాను.. అన్నీ చేసేస్తామ‌ని.. కానీ, వాళ్లు ఏం చేశారో.. అంద‌రికీ తెలుసు. మ‌డ‌మా.. కాలు అన్నీ తిప్పేశారు. కానీ.. నేను డైలాగులు చెప్పే ర‌కం కాదు.. చేసేది చెబుతాను.. చెప్పింది చేస్తాను. వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయ‌డానికి నేను రాలేదు. ప్ర‌జ‌లు ఇచ్చిన మ్యాండేట్‌తో రాష్ట్రాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ది చేసేందుకు వ‌చ్చాను” అని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా ఆయ‌న వైసీపీ అధినేత‌, మాజీ …

Read More »

రాప్తాడుకు త్వరలో వస్తా: వైఎస్ జగన్

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. టీడీపీకి కంచుకోటగానే కాకుండా టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అడ్డాగా పేరున్న రాప్తాడులో ఆయన త్వరలోనే పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా జగనే వెల్లడించారు. త్వరలోనే రాప్తాడు వస్తానని… రాప్తాడు మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవలే మరణించిన పార్టీ కార్యకర్త లింగమయ్య కుమారుడితో జగన్ చెప్పారు. …

Read More »

జీవీఎంసీపై కూటమి జెండా!… ఆపడం అసాధ్యమే!

ఏపీలో స్థానిక సంస్థలు వరుసబెట్టి కూటమి ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మునిసిపల్ కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాలు వైసీపీ నుంచి టీడీపీకి మారాయి. తాజాగా రాష్ట్రంలోనే అతి పెద్దది అయిన గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)పై కూటమి జెండా ఎగిరేందుకు రంగం సిద్ధం అయిపోయింది. ఈ మేరకు ఇప్పటికే జీవీఎంసీ మేయర్ గా ఉన్న వైసీపీ నేత గొలగాని వెంకట కుమారిపై కూటమి …

Read More »

ఎంపీ అప్పలనాయుడికి అపురూప గిఫ్టు ఇచ్చిన రాజుగారు

రాజకీయాలు.. రాజకీయ నేతలు అన్నంతనే ఒకలాంటి భావన మనసులో ఉంటుంది. అయితే.. కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం గౌరవాన్ని ఇవ్వటం.. తొందరపడి మాట అనే సాహసం చేసే అపురూప వ్యక్తిత్వం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు సొంతం. తెలుగు రాజకీయాల్లో అసమాన్య వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారన్న సంగతి తెలిసిందే. సాధారణంగా తాను రాజకీయంగా బలంగా …

Read More »