రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం గమనార్హం. వాస్తవానికి ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రజలు చాలా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని ఏమాత్రం సంతృప్తిగా లేరని పదేపదే చెబుతున్నారు. ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా, ఎప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడినా కూడా ఆయన ఇదే మాట చెబుతున్నారు. దీంతో నిజంగానే సర్కారుపై వ్యతిరేకత పెరిగిందా? అనే ప్రశ్నలు వచ్చాయి.
అయితే రాష్ట్రంలో జరిగిన ఏడాది పాలనలో ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతోనే ఉన్నారని తాజాగా వెల్లడైన పలు సర్వేలు చెబుతున్నాయి. సూపర్ సిక్స్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు ఆశలు ఉన్నమాట వాస్తవమే అయితే ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేయాలని కానీ ఇప్పటికిప్పుడు వాటిని కోరుకుంటున్నట్టుగా కానీ ఈ సర్వే రిపోర్ట్ లలో స్పష్టం కాలేదు. పైగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రహదారులు ఏర్పాటు చేయటం, అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించటంపై ప్రజలు సంతోషంగానే ఉన్నారు.
అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పెట్టుబడులను ఆకర్షించడం వంటివి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఒక రకంగా ప్రభుత్వంపై ప్రజలకు ఎక్కడా విశ్వాసం సడలిపోలేదు. అంతేకాదు తమకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై మరింత విశ్వాసంతో ఉండటం వారు తమకు మేలు చేస్తారని భావిస్తుండడం గమనార్హం.
సో దీనిని బట్టి ప్రజలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పై విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని గుర్తించడంలో వైసీపీ నేత విఫలమవుతున్నారు. సహజంగానే ఏ రాష్ట్రంలో అయినా.. ప్రభుత్వంపై ఏడాది కాలంలోనే వ్యతిరేకత పెరగదు. పైగా ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఏపీ వంటి రాష్ట్రానికి మరిన్ని చిక్కులు ఉంటాయి. కాబట్టి ప్రజలు దీనిని అర్ధం చేసుకున్నారనే చెప్పాలి. అయితే.. వచ్చే ఏడాదిపై మాత్రం ప్రజలకు చాలానే ఆశలు ఉన్నాయి. దీనిని బట్టి.. ఈ ఏడాదికి ప్రజలు సంతృప్తితోనే ఉన్నారన్నది పరిశీలకుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates