Political News

ఏపీలో దొంగ ఓట్లు…ఇద్దరు అధికారులు సస్పెండ్

ఏపీలో ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గతంలో ఉరవకొండలో పర్యటించారు. అనంతపురంలో 6000 దొంగ …

Read More »

#TeluguPeopleWithRamojiRao…బాబు, లోకేష్ మద్దతు

మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో రామోజీరావుపై వైసీపీ ప్రభుత్వం కక్షగట్టిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే #TeluguPeopleWithRamojiRao ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే రామోజీరావుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు ప్రకటించారు. ఆ హ్యాష్ ట్యాగ్ ను చంద్రబాబు, లోకేష్ ట్రెండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో …

Read More »

హరీష్ రావు బట్టలు ఊడదీస్తా: మైనంపల్లి

హరీష్ రావు… కేసీఆర్ మేనల్లుడు, బీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేత. పార్టీలో చాలా మంది నేతలకు హరీష్ ఎంత చెప్తే అంతా. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ లో హరీష్ రావు పెత్తనం సహించని మైనంపల్లి తీవ్ర విమర్శలు చేశారని తెలుస్తోంది. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి ఆయన …

Read More »

కమిటీతో ఏం పని? ప్రకంటించేసిన ఉత్తమ్

తెలంగాణ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. టికెట్ ఆశిస్తున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ఇక్కడ రాష్ట్రంలో టీపీసీసీ, స్క్రీనింగ్ కమిటీ ఉన్నాయి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో మరో స్క్రీనింగ్ కమిటీ ఉంది. చివరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇవేమీ తనకు అవసరం లేదన్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే …

Read More »

నిర్విరామంగా 12 గంటలు పాటు..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో రికార్డుల మోత మోగిస్తున్నారు. నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను సుమారు 12 గంటల పాటు ఆగకుండా నిర్వహించారు. యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత ఆయన నిర్విరామంగా చేపట్టిన యాత్ర ఇదే. యువగళం పాదయాత్ర 190 వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పాదయాత్ర …

Read More »

తాడిపత్రిలో టెన్షన్..టెన్షన్‌..అసలేం జరుగుతుంది!

అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా దీని గురించి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంపై జేసీకి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా జేసీ …

Read More »

మా జీపీఎస్‌ ను దేశమే కాపీ కొడుతుంది: జగన్!

ఏపీలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. సీపీఎస్‌ కి బదులు తమ ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. సీపీఎస్‌ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. సోమవారం విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జగన్‌ మాట్లాడుతూ..అతి తర్వలోనే ఉద్యోగుల కోసం గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ పై ఆర్డినెన్స్‌ …

Read More »

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రకటించారు. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం కాబట్టి మధ్యాహ్నం 2.38 కి తొలి జాబితా రిలీజ్ చేశానని, తప్పకుండా పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని కేసీఆర్ అన్నారు. ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక ఆట అని, బీఆర్ఎస్ కు మాత్రం ఎన్నికలంటే ఒక పవిత్ర యజ్ఞం అని, బాధ్యత …

Read More »

అక్కడి నుంచి జగన్ బావమరిది

వైఎస్సార్ జిల్లా కమలాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో జగన్ బావమరిది పోటీ చేయబోతున్నారా? ఈ మేరకు జగన్ హామీ ఇచ్చారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమలాపురం ఎమ్మెల్యేగా జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. వరుసగా రెండో సారి ఎన్నికల్లో గెలిచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన తనయుడు నరేన్ రామాంజనేయరెడ్డిని బరిలో దింపాలని చూస్తున్నట్లు …

Read More »

నిమ్మకాయల స్టాండ్ బై అభ్యర్ధా ?

Nimmakayala Chinarajappa

వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా పార్టీవర్గాల సమాచారం అయితే ఇదే. ప్రస్తుతం నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014,19 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ గెలుపుకోసం కష్టపడుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబునాయుడు సామాజికవర్గం సమీకరణలను పరిశీలిస్తున్నారట. ఇందులో భాగంగానే చినరాజప్పను మూడోసారి పెద్దాపురంలో కాకుండా మరో మూడు నియోజకవర్గాల్లో పోటీకి పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక్కడ పాయింట్ ఏమిటంటే కాపుల ప్రాబల్యం ఎక్కడ ఎక్కువగా ఉంటే చినరాజప్పను అక్కడి నుండి …

Read More »

దళిత బంధుకు మెలికలా ?

తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో దళితబంధు పథకం అత్యంత ప్రిస్టేజియస్ అండ్ కాస్ట్లీ పథకం. ఎందుకంటే దళితుల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది పైగా వీళ్ళకి ఇవ్వబోయే డబ్బులు కూడా చాలా ఎక్కువ. అందుకనే ఇది చాలా కాస్ట్లీ పథకమైపోయింది. నిజానికి ఇది అచ్చంగా పొలిటికల్ లబ్దికోసమే రూపొందించిన పథకం అనటంలో ఎలాంటి అనుమానంలేదు. దాదాపు ఏడాది క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీచేసిన …

Read More »

వీళ్లకు టికెట్లు ఇవ్వాలి.. వాళ్లకు వద్దు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చేరికలతో పార్టీలు బిజీ అయిపోయాయి. మరోవైపు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్.. కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆయన ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే కొంతమంది నాయకులకు టికెట్లు దక్కవనే ప్రచారం సాగుతోంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన బాట పట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దొంటూ, మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ …

Read More »