ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సాయంత్రం 6 గంటలకు కోర్టు తాము అరెస్టు నుంచి కాపాడలేమని తేల్చి చెప్పిన దరిమిలా ఆయన అరెస్టు ఖాయమనే వాదన వినిపించింది. ఇక, సుమారు రెండు గంటల పాటు సీఎం ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేసినా.. అధికారులు బల ప్రయోగం చేయాల్సి ఉంటుందని …
Read More »నా కజిన్ అవినాష్ కడపకు చేసిందేమీలేదు
కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌పై నిన్న మొన్నటి వరకు తీవ్రస్థాయిలో యుద్ధం చేసిన షర్మిల.. ఇప్పుడు అనూహ్యంగా ఆయనను తన తమ్ముడేనని వ్యాఖ్యానించారు. వైఎస్ అవినాష్ నా తమ్ముడే. కానీ, ఏం ప్రయోజనం. కడపలో రెండు సార్లు ఎంపీగా విజయం దక్కించుకున్నారు. కానీ, ఒక్క పని కూడా చేయలేదు అని వ్యాఖ్యానించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి …
Read More »జనసేన నుంచి ఫస్ట్ రెబల్ క్యాండిటేడ్ రెడీ..
పొత్తుల్లో భాగంగా సీట్లు పోవడం.. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకున్న నాయకులకు ఇబ్బందులు ఏర్పడ డం.. వారిని సముదాయించలేక పార్టీలు సతమతం అవుతుండడం తెలిసిందే. ఈ పరంపరలో తాజాగా జనసేన కూడా తెరమీదికి వచ్చింది. ఈ పార్టీలోనూ చాలా మంది నాయకులు పార్టీ టికెట్లు ఆశించారు. ఆశించడమే కాదు.. వారికి పవన్ నుంచి గట్టి హామీలు కూడా వచ్చాయి. అయితే.. అంతా అనుకున్నా.. పొత్తుల తర్వాత.. త్యాగాలు చేయక తప్పలేదు. …
Read More »మొత్తనికి ఏపీ పై ఫోకస్ పెట్టిన బీజేపీ
ఏపీలో బీజేపీ పాగా వేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఒకసారి ప్రదాని నరేం ద్ర మోడీ ఏపీలో నిర్వహించిన ప్రజాగళం సభకు వచ్చి.. ఎన్డీయే కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి ఎన్డీయే కూటమి అవసరం ఎంత ఉందో కూడా ఆయన వివరించారు. ఇక, ఇదేసమయంలో ఏపీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం.. కొత్తగా ఇంచార్జిని నియమించింది. ఈయన నేతృత్వంలోనే ఏపీలో …
Read More »ఎవరా వెధవలు నాగబాబుగారూ!
జనసేన నాయకుడు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేవారు. ప్రతి వెధవనూ గౌరవించనక్కర్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇది రాజకీయంగా దుమారం రేపింది. కొన్నాళ్లుగా నాగబాబు చాలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులను విమర్శించిన వారిని, వారి విధానాలను తప్పుబట్టిన వారిని కూడా ఆయన ఏకేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ …
Read More »ఇండియా కూటమిలోకి జేడీ?
ఏపీలో డబ్బులు లేని ఎన్నికలు తీసుకువస్తామని పేర్కొంటూ రాజకీయ పార్టీ పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరిపోయారు. తాజాగా విజయవాడలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశాలకు ఆయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ చేరికపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. ప్రస్తుతం డబ్బులులేని, విలువలతో కూడిన ఎన్నికలు అవసరమని వ్యాఖ్యానించారు. ఇక, …
Read More »ఇక ఆ సీఎం అరెస్టు నుండి తప్పించుకోలేరు
కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసులతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రికి మరో షాక్ తగిలింది. మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆపలేం అంటూ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. …
Read More »2023 సమ్మర్ లాగే 2024 కూడా..
ఏడాది మొత్తంలో సినిమాలకు బాగా కలిసి వచ్చే లాంగ్ సీజన్ అంటే.. వేసవే. సంక్రాంతికి వారం పది రోజులు ఉండే సందడి.. సమ్మర్లో దాదాపు రెండు నెలలు కొనసాగుతుంది. సినిమాలకు మహరాజ పోషకులైన యూత్.. స్కూళ్లు, కాలేజీలు అవగొట్టుకుని.. పరీక్షలు ముగించుకుని బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా బయటికి వస్తారు. థియేటర్లను నింపేస్తారు. ఇక ఫ్యామిలీస్ కూడా ఆ టైంలో థియేటర్లకు బాగా వస్తాయి. అందుకే ఈ సీజన్లో వారం వారం గ్యాప్ …
Read More »చంద్రబాబు-పవన్ కలిసారు.. ఏమి డిసైడ్ అయ్యరంటే
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు.. చేతులు కలిపిన విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి ఉమ్మడిగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రచారం, ఎన్నికల వ్యూహాలలో ఎలా ముందుకు సాగాలనే విషయంపైనా ఇరు పార్టీలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించాయి. …
Read More »ఆపితే ఆగుతరా. పోనిర్రు..
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ను విడిచి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరు ఇద్దరు కాదు.. ఇప్పటికి పదికి పైగా నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. గెలిచిన వారు ఓడిన వారు అనే తేడా లేకుండా.. నాయకులు కారు దిగిపోతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు …
Read More »వర్మ విషయంలో టీడీపీ ఇంకాస్త జాగ్రత్తగా వుండాల్సిందే
ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్.! లక్ష మెజార్టీకి అస్సలేమాత్రం తగ్గకూడదంటూ ఇటీవలే పార్టీ శ్రేణులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ‘టీ టైమ్’ సంస్థ అధినేత తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుని ఖరారు చేసే క్రమంలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలవాలని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు ఓటుకి లక్ష ఖర్చు పెట్టడానికైనా సిద్ధమయ్యారు, అయినాగానీ …
Read More »హెలికాప్టర్లు కావాలా.. నాయకా? దేశంలో పెరిగిన డిమాండ్
దేశంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో విస్తృత స్థాయిలో ప్రచారానికి పార్టీలు శ్రీకారం చుట్టాయి. పైగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్‌కు పోలింగ్‌కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని, ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో.. ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రాలను చుట్టేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటు న్నా రు. దీనిలో భాగంగా మెజారిటీ పార్టీల నాయకులు.. హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. …
Read More »