వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికలకు ముందు ఎక్కడ ప్రసంగించాల్సి వచ్చినా.. నా ఎస్సీలు, నా ఎస్టీ లు, నా మైనారిటీలు.. అంటూ.. ప్రసంగాలు ప్రారంభించేవారు. వారిని తాను ఆదుకుంటున్నానని.. అన్నధోరణిలో జగన్ వాయిస్ ఉండేది. మనసులో జగన్‌కు ఏమున్నా.. పైకి మాత్రం నాఎస్సీలు .. అనే చెప్పేవారు. దీనిపై అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆయన గుమ్మం బయటే ఉంచేశారన్న చర్చ అప్పట్లోనే వచ్చింది.
ఇక, దళిత వర్గానికి చెందిన నాయకులను కూడా జగన్ అవమానించారంటూ.. పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇక, ఎస్సీల్లోనూ జగన్ పట్ల వ్యతిరేకత పెరిగింది. దీనికి కారణం.. ఎస్సీ సామాజిక వర్గంలో విభే దాలు తెచ్చేలా వ్యవహరించడంతోపాటు.. వారికి సంబంధించిన కొన్ని నిర్ణయాలపై జగన్ నాన్చివేత ధోర ణిని అవలంభించడమేనని అంటారు. అయినా.. జగన్ సమస్యలను పరిష్కరించడం మానేసి.. ఎస్సీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చేశారు కూడా.
కట్ చేస్తే.. ఏ ఎస్సీలను అయితే.. జగన్ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారో.. ఏ ఎస్సీలైతే.. తనకు అండగా ఉంటారని లెక్కలు వేసుకున్నారో.. అలాంటి ఎస్సీలనే.. ఆ సామాజిక వర్గాన్నే.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్కున చేర్చుకుంటున్నారు. వారి ఇళ్లకు వెళ్తున్నారు. వారితో కలిసి కూర్చుకుంటున్నారు. వారి కష్టాలు పంచుకుంటున్నారు. వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా వారినికలిసి భరోసా కల్పిస్తున్నారు.
ఈ తరహాలో జగన్ గతంలో ఎన్నడూ చేయలేదు. వారికి డబ్బులు అయితే ఇచ్చారు తప్ప.. వారి ఇళ్లకు వెళ్లడం.. వారితో కలిసి కూర్చుని వారి కష్టాలు పంచుకోవడం వంటివి జగన్ ఎప్పుడూ చేయలేదు. అంతేకాదు.. వారిని తన కారులో ఎక్కించుకుని ప్రయాణించిన పరిస్థితి కూడా లేదు. కానీ.. చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నా ఎస్సీ.. అనే ట్యాగ్.. జగన్ నుంచి దూరమైపోవడం ఖాయమని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates