ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. దీంతో ఇదే కనుక నిజమైతే.. ఎవరికి అవకాశం చిక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీనియర్లు చాలా మంది వెయిటింగ్‌లో ఉన్నారు. పైగా.. దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు చేతికి చాంతాడంత లిస్ట్ చేరిందని సమాచారం. ఇదిలావుంటే.. మంత్రివర్గంలోకి స్పీకర్ …
Read More »పవన్ సార్.. పట్టించుకోండి: గిరిజనులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా పనిని చేపడితే.. ఖచ్చితంగా అది పూర్తి చేస్తారని.. ఆయన హామీ ఇస్తే ఆ పని నెరవేరుతుందని కూడా నమ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా పనులు చేస్తారని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్రయత్నిస్తారన్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజనులు మరింత ఎక్కువగా పవన్‌పై ఆశలు పెట్టుకున్నారు. …
Read More »‘గోవా’ గడ్డపై తొలిసారి.. తెలుగు పలుకు!
గోవా.. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. కొన్నికొన్ని ప్రాంతాలు మనకు అదే రోజు దఖలు పడలేదు. ఆ తర్వాత.. జరిగిన చర్చలు, సంప్రదింపుల ద్వారా దేశంలో కలిశాయి. ఇలాంటివాటినే కేంద్ర పాలిత ప్రాంతాలుగా పేర్కొంటారు. ఇలాంటి వాటిలో గోవా ఒకటి. అయితే.. ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. అందుకే అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. దీనికి తొలిసారి తెలుగు వ్యక్తి గవర్నర్ …
Read More »జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక లో సునీత?
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ? అన్నదానిపై అప్పుడే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ నెలలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా …
Read More »రాజకీయాలు బోరు కొట్టాయా.. ఈ నేతలు సైలెంట్.. !
ఏపీలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సైలెంట్ అయ్యారు. మరి వీరికి క్రియాశీల రాజకీయాలు బోరు కొట్టాయా ? లేక.. ఆయా పార్టీల తీరుపై వారు అలక బూనారా? అనేది చర్చకు దారితీసింది. కీలక సమయంలో నాయకులు మౌనంగా ఉండడంతో వైసీపీ ఇబ్బందులు పడుతోంది. ఇక, ప్రభుత్వం జోరుగా ఉన్న సమయంలో సర్కారు సైడు వాయిస్ వినిపించడంలో సీనియర్లు ముందుకు రాకపోవడంతో టీడీపీ కూడా ఇబ్బందులు పడుతోంది. ఇక, జనసేనలో …
Read More »జిల్లాలే కాదు.. మండలాలపైనా టీడీపీ పట్టు..!
రాష్ట్రంలో జిల్లాల పేర్లు అదేవిధంగా మండలాలకు కూడా కొత్తగా పేర్లు పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటి.. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.. అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఉదాహరణకు గత వైసిపి ప్రభుత్వం 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ వాటికి కొత్తగా పేర్లు కూడా పెట్టింది. అప్పట్లో కొన్ని జిల్లాల …
Read More »నేను కూడా దత్తత తీసుకుంటా.. విమర్శలకు చంద్రబాబు చెక్
పీ-4 పథకంలో భాగంగా పేదలను దత్తత తీసుకోవాలని పలువురిని సీఎం చంద్రబాబు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో వైసీపీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పీ-4 పథకం కింద నారా కుటుంబమే కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు కదా! అని ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇతర నాయకులు, సోషల్ మీడియాలోనూ ఇదే తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు, …
Read More »మిథున్ కోరికలు తీర్చలేనివి
వైసీపీ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆగస్టు 1వ తేదీ వరకు మిథున్‌ను రిమాండ్‌కు పంపుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు ఆదివారం రాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. చిత్రం ఏమిటంటే.. గతంలో …
Read More »శవం డోర్ డెలివరీ కేసు.. బాబు ఇక తప్పించుకోలేడు
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన అనంతబాబు తన సొంత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి డ్రైవర్ కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు 2022లో రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. హత్య చేయడంతో పాటు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసును తాజాగా పునర్విచారణ చేయాలంటూ …
Read More »ఆ యువ మంత్రికి చంద్రబాబు ఫుల్ మార్కులు.. !
కూటమిలోని మంత్రుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఈ విషయం అందరికీ తెలిసిందే. కొందరు బాగా పనిచేస్తుంటే మరికొందరు నెమ్మదిగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ప్రభుత్వం చెప్పింది నెమ్మదిగా చేస్తున్నారు. అయితే వీరిలోనూ ఒకరిద్దరూ తమంతట తాముగా కొన్ని కొన్ని కార్యక్రమాలను నిర్దేశించుకుని, పనిచేస్తున్న మంత్రులు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరిద్దరి పేర్లు చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లాయి. తాజాగా జరిగిన మంత్రివర్గంలో వారిని చంద్రబాబు ప్రశంసించారు. వీరిలో పరిశ్రమల …
Read More »ప్రసన్న కుమార్‌ను అరెస్టు చేయలేదు…
వైసీపీ నాయకుడు, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శుక్రవారం పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో జరిగిన విచారణకు ఉదయం 11 గంటలకు హాజరైన ఆయనను రెండు గంటల పాటు పోలీసులు విచారించారు. అయితే.. ఆయనను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ నాయకులు, ప్రసన్న కార్యకర్తలువందల సంఖ్యలో డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, రెండు …
Read More »ఇందిరమ్మ రికార్డును బద్దలు కొట్టిన మోడీ!
దేశానికి వరుసగా సుదీర్ఘకాలం పాటు సేవలందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెల కొల్పారు. ఇదే సమయంలో గతంలో ఇదేవిధంగా సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ రికార్డును ఆయన అధిగమించారు. మరీ ముఖ్యంగా గాంధీయేతర వ్యక్తి ఇలా రికార్డు సమయం పాటు దేశాన్నిపాలించడం.. మరో సంచలన విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రాజకీయ మైలురాయిని అధిగమించారు, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates