Political News

కేటీఆర్ కు చెప్పే వారే లేరా?

రంగం ఏదైనా సరే.. కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకు రాజకీయాలు మినహాయింపు కాదు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగతంగా ఉండే పరిచయాలు.. పార్టీలకు అతీతంగా బంధాలు.. అనుబంధాలు కామన్. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకున్న వ్యక్తిగత సంబంధాల్ని దెబ్బ తీసుకునే రీతిలో ఏ ముఖ్యనేత వ్యవహరించరు. ఈ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తూ.. కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు కేటీఆర్. ఇలాంటి తీరుతో ఆయన పొందే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే …

Read More »

కార్య‌క‌ర్త‌ల సెంట్రిక్‌గా వైసీపీ బిగ్ స్ట్రాట‌జీ!

వైసీపీ అధినేత జ‌గ‌న్.. కార్య‌క‌ర్త‌ల సెంట్రిక్‌గా రాజ‌కీయాలను ముమ్మ‌రం చేస్తున్నారు. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తానే అన్నీ అయి రాజ‌కీయాలు చేసుకున్నారు. త‌న కుటుంబం కూడా వెంట న‌డిచింది. అమ్మ‌, చెల్లి.. ఇద్ద‌రూ కూడా రాజ‌కీయాల‌కు దోహ‌ద‌ప‌డ్డారు. అయితే.. ఇప్పుడు వారిద్ద‌రూ కూడా దూరమ‌య్యారు. పైగా చెల్లి రాజ‌కీయాలు యాంటీగా మారాయి. దీంతో జ‌గ‌న్‌కు ఇప్పుడు ఆద‌రువుగా ఉన్న కుటుంబ స‌భ్యులు, నాయ‌కులు కూడా ఎవ‌రూ క‌నిపించ‌డం …

Read More »

కేటీఆర్ వ‌ర్సెస్ ర‌మేష్‌: రేవంత్ స్పందించాలా? వ‌ద్దా?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు, బీజేపీ ఏపీ నేత‌, ఎంపీ సీఎం ర‌మేష్‌కు మ‌ధ్య వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ కాంట్రాక్టుల‌ను ఏపీ వారు దోచుకుంటున్నార‌ని.. ఇందుకేనా తెలంగాణ సాధించింది.. అని కేటీఆర్ విమ‌ర్శించారు. దీనిలో సీఎం రేవంత్ పేరును కూడా తీసుకువ‌చ్చారు. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల‌ను తాక‌ట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్నార‌ని.. దీనికి ప్ర‌తిఫలంగానే ఫ్యూచ‌ర్ సిటీలో …

Read More »

ఢిల్లీకి జ‌గ‌న్‌.. ఎందుకు?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఢిల్లీకి వెళ్తున్నారా? కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అవుతున్నారా? అంటే.. జ‌గ‌న్ నివాసం తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆదివారం, లేదా సోమ‌వారంలో జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్తున్నార‌ని అంటున్నారు. బీజేపీ పెద్ద‌ల‌ను ఆయ‌న క‌లుసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటు న్నారు. అదేవిధంగా ఇండియా కూట‌మి పార్టీల నాయ‌కుల‌తోనూ జ‌గ‌న్ భేటీ కానున్న‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా త‌న‌కు మద్ద‌తుగా నిల‌వాల‌ని వారిని కోరే …

Read More »

సింగపూర్ తెలుగు వారిని ఒక్క‌టే కోరుతున్నా.. చంద్ర‌బాబు

“సింగ‌పూర్ తెలుగు వారిని ఒక్క‌టే కోరుతున్నా. ఒక‌ప్పుడు నేను చేసిన ఆలోచ‌న‌తోనే మీరు సింగ‌పూర్ లో సెటిల్ అయ్యేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. నేను ఎప్పుడూ.. రాబోయే 30 ఏళ్ల గురించే ఆలోచిస్తా. ఆ ఆలోచ‌నతోనే నాడు.. ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ఇంజ‌నీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ఫ‌లితంగా.. మీరంతా ఇక్క‌డ‌కు వ‌చ్చి.. మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆలోచ‌న చేస్తున్నా.. మీరు ఏపీలో …

Read More »

జ‌గ‌న్ అరస్ట్ అంత తేలిక కాదు?

వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో రాజంపేట ఎంపీ, వైసిపి కీలక నాయకుడు మిథున్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్ దగ్గర పనిచేసిన ఓ ఎస్ డి లు పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి …

Read More »

సై..! రండి తేల్చుకుందాం: రేవంత్‌-ర‌మేష్‌ల‌కు కేటీఆర్ స‌వాల్‌

బీజేపీ నాయ‌కుడు, ఏపీలోని అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేష్ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను చేసిన ఆరోప‌ణ‌ల‌పై నిల‌బ‌డ‌తాన‌ని.. అవి ఆరోప‌ణ‌లు కాదు.. ప‌క్కా వాస్త‌వాల‌ని పేర్కొన్నారు. వీటిపై చ‌ర్చించేందుకు తాను సిద్ధ‌మేన‌న్నారు. “మీకు నిజంగానే తెలుసుకోవాల‌ని ఉంటే.. రండి.. ఒక్కరే కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి, సీఎం ర‌మేష్‌లు ఇద్ద‌రూ క‌లిసి రండి. చ‌ర్చిద్దాం.” అని కేటీఆర్ స‌వాల్ …

Read More »

‘బీఆర్ఎస్ పోయి.. జాగృతి, కేటీఆర్ పోయి జైశంక‌ర్‌’

బీఆర్ఎస్ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింది. రాష్ట్రంలో స‌మ‌స్య‌లపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై యుద్ధం చేసేందుకు తెలంగాణ జాగృతి మాత్ర‌మే ముందుకు వ‌స్తోంద‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ‘లీడ‌ర్‌’ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో క‌విత ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. దీనికి సంబంధించి కొన్ని మార్పులు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇంత పెద్ద ఈవెంట్లో ఎక్క‌డా బీఆర్ఎస్ జెండా కానీ.. గులాబీ రంగులు …

Read More »

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం: జ‌గ‌న్

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో సంప‌ద సృష్టిస్తామ‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక్క‌రూపాయి కూడా సృష్టించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. పైగా.. అప్పులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయ‌న్నారు. దీనివ‌ల్ల రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారుతోంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇటీవ‌ల కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) ఇచ్చిన నివేదిక‌ను వివ‌రించారు. దీనిలో పేర్కొన్న గ‌ణాంకాలు తాము చెబుతున్న‌వి కాద‌ని.. కేంద్రంలో …

Read More »

పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం

పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను క్రిష్ – జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. గురువారం నాడు రిలీజ్ అయిన సినిమాను ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎందుకంటే పవన్ …

Read More »

ఇక‌ అవినాష్ వంతు.. అరెస్టు కోరుతూ ‘సిట్‌’ పిటిష‌న్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై విచార‌ణ చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తుబృందం ఇప్ప‌టికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వీరిలో 11 మంది విజ‌య‌వాడ జైల్లో ఉండ‌గా.. మిథున్‌రెడ్డి మాత్రం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు. అయితే..ఈ అరెస్టులు ఇప్ప‌టితో ఆగేలా క‌నిపించ‌డం లేదు. మ‌రో 12 మంది నిందితుల‌ను అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పేర్కొంటూ.. తాజాగా విజ‌య‌వాడ ఏసీబీ …

Read More »

న‌న్ను అన‌వ‌స‌రంగా కెలికిన కేటీఆర్‌: సీఎం ర‌మేష్‌

బీజేపీ నాయ‌కుడు, ఏపీలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “న‌న్ను అన‌వ‌స‌రంగా కేటీఆర్ కెలుకుతున్నాడు..” అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో చేతులు క‌లిపి తాను కాంట్రాక్టులు కొట్టేస్తున్నాన‌ని.. కంచ గ‌చ్చిబౌలి భూముల త‌న‌ఖా వెనుక‌.. త‌ను ఉన్నాన‌ని కేటీఆర్ ఆరోపించార‌ని.. చెప్పారు. అదేస‌మ‌యంలో తాను సాయం చేసినందుకుగాను ‘ఫ్యూచ‌ర్ …

Read More »