Political News

ఎమ్మెల్యేల జంపింగుల‌ విష‌యాన్ని 3 నెల‌ల్లో తేల్చండి: సుప్రీం

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల‌కు చిక్కులు కొన‌సాగుతూనే ఉన్నాయి. త‌మ పార్టీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకుని.. పొరుగు పార్టీలో చేరిన ఎమ్మెల్యే లను వ‌దిలేది లేద‌ని చెప్పిన బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ .. న్యాయ పోరాటం కొన‌సాగిస్తునే ఉన్నారు. తొలుత హైకోర్టు.. త‌ర్వాత సుప్రీంకోర్టు వ‌ర‌కు.. ఈ కేసును కొన‌సాగించారు. తాజాగా మ‌రోసారి సుప్రీంకోర్టు.. స్పందించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై …

Read More »

ఏపీ ఇప్పుడే గాడిన ప‌డుతోంది.. ఎందుకు అడ్డుకుంటారు?: హైకోర్టు

ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబ‌డుల వ్య‌వ‌హారంపై రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఏపీ ఇప్పుడే గాడిన ప‌డుతోం ద‌ని.. ఇంత‌లోనే అడ్డుకునే ప్ర‌య‌త్నాలు ఎందుకు చేస్తున్నార‌ని.. పిటిష‌నర్‌ను ఉద్దేశించి తీవ్ర‌స్థాయిలో ప్ర‌శ్నించింది. “మీకు అభివృద్ధి చెంద‌డం ఇష్టం లేదా? రాష్ట్రంలో పెట్టుబ‌డులు వ‌స్తుంటే త‌ట్టుకోలేక పోతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇది స‌రికాదు. ఏపీ ప్ర‌భుత్వానికి స్వేచ్ఛ‌నివ్వండి. కొన్నాళ్లు వేచి చూడండి. ఆ త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుందో చూద్దాం. అంతేకానీ.. ఇప్ప‌టికిప్పుడు …

Read More »

జ‌గ‌న్‌కు ష‌ర్మిల నుంచి మ‌రింత కాక‌.. !

రాజకీయాల్లో ఒక పరిణామానికి మరికొన్ని పరిణామాలు కారణాలు అవుతాయి. ఉదాహరణకు చంద్రబాబుపై నమోదు చేసిన కేసు వైసీపీ హయాంలో ఆయనను జైలుకు పంపించిన తీరు వంటివి మేలు చేస్తాయని జగన్ భావించగా అవి మేలు చేయకపోగా సమాజంలోని రెండు మూడు సామాజిక వర్గాలను ఏకం చేశాయి. అంటే ఒక అరెస్టు కారణంగా అనేక మార్పులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతిమంగా జగన్కు నష్టాన్ని చేకూర్చింది. ఇలా ఒక విషయానికి …

Read More »

ముగిసిన చంద్ర‌బాబు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌.. ల‌క్ష్యం సాకార‌మేనా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారా లోకేష్‌, నారాయ‌ణ‌, టీజీ భ‌ర‌త్‌ల‌తో క‌లిసి నాలుగు రోజుల పాటు సింగ‌పూర్‌లో ప‌ర్య‌టించారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ఆయ‌న సింగ‌పూర్‌లో ఉన్నారు. బుధ‌వారం సాయంత్రం(స్థానిక కాల‌మానం ప్ర‌కారం) 5 గంట‌ల‌కు ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ను ముగించుకున్నారు. తిరిగి హైద‌రాబాద్‌కు, అటు నుంచి అమ‌రావ‌తికి చేరుకుంటారు. అయితే.. ఈ ఐదు రోజుల ప‌ర్య‌ట‌న వెనుక‌.. చంద్ర‌బాబు ల‌క్ష్యం నెర‌వేరిందా? …

Read More »

అజార్‌కే అవ‌కాశం.. కాంగ్రెస్‌లో క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

సీనియ‌ర్ నాయ‌కుడు, బీఆర్ ఎస్ నేత‌, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మ‌ర‌ణంతో అని వార్యంగా మారిన ఉప ఎన్నిక‌కు సంబంధించి.. కాంగ్రెస్ పార్టీ ఒక కీల‌క నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఉప ఎన్నిక‌కు మ‌రో మూడు మాసాల వ‌ర‌కు స‌మ‌యం ఉంది. అయితే.. అభ్య‌ర్థిని ఖ‌రారు చేస్తే.. ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం చేసుకుని.. గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం కోసం.. నాయ‌కులు …

Read More »

హిందూపురంలో వ‌సుంధ‌ర దూకుడు.. బాల‌య్య‌కు డ‌బుల్ ప్ల‌స్‌.. !

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని హిందూపురంపై నందమూరి బాలకృష్ణ ముద్ర బలంగా ఉన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో పాటు ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని అయినా తట్టుకుని నందమూరి బాలకృష్ణ విజయం సాధిస్తున్నారు. 2014లో తొలిసారి అరంగేట్రం చేసిన బాలకృష్ణ వరుసగా హిందూపురంపై తన సత్తా చాటుతున్నారు. వాస్తవానికి సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ నియోజకవర్గంలో పెద్దగా ఉండడం లేదన్నది వాస్తవం. ఇది 2014 నుంచి ఉన్న …

Read More »

మీ విజ‌న్ సూప‌ర్‌.. ఏపీకి వ‌స్తాం: బాబుకు హామీల వ‌ర‌ద‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. గురువారంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగియ‌నుంది. తొలి రోజు నుంచి ఆయ‌న పెట్టుబ‌డులు.. పీ-4పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. సింగ‌పూర్‌లో రోడ్ షో కూడా నిర్వ‌హించి.. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేశారు. పెట్టుబ‌డులు.. విద్యా సంస్థ‌ల‌కు సంబంధించిన ప్ర‌తినిధుల‌తో పాటు.. పారిశ్రామిక వేత్త‌లు, ప్ర‌భుత్వ అధికారులు, మంత్రుల ను వ‌రుసగా చంద్ర‌బాబు క‌లుస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న అవ‌కాశాలు.. ఇత‌ర‌త్రా …

Read More »

నెల్లూరుకు జ‌గ‌న్‌.. మ‌ళ్లీ సేమ్ సీన్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ గురువారం నెల్లూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. నెల్లూరు జిల్లా స‌ర్వే ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం జిల్లా జైల్లో ఉన్నారు. అక్ర‌మంగా గ‌నులు త‌వ్వి సొమ్ము చేసుకున్నార‌న్న‌ది ఆయ‌న‌పై ఉన్న అభియోగం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల‌ను బెదిరించార‌ని మ‌రో కేసు కూడా కాకాణిపై న‌మోదైంది. దీంతో కోర్టు ఆదేశాల ప్ర‌కారం… కాకాణిని రిమాండు ఖైదీగా జైల్లో ఉంచారు. ఈయ‌న‌ను …

Read More »

బీఆర్ ఎస్ చుట్టూ ఉచ్చు: గోర్రెల పేరిట కోట్లు దోపిడీ.. !

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, ఒక‌ప్ప‌టి అధికార పార్టీ బీఆర్ ఎస్ చుట్టూ.. గొర్రెల కుంభ‌కోణం చుట్టు కుంటోంది. గొర్రెల పేరుతో రూ.700 కోట్ల రూపాయ‌ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు.. ఏసీబీ అధికారులు ప్రాథ‌మికంగా గుర్తించారు. అంతేకాదు.. దీనికి మించిన సొమ్ము అక్ర‌మ దారుల్లో `పెద్ద‌ల‌కు` చేరింద‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హారాన్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా ఈడీ అధికారులు ఆరు …

Read More »

12 పెట్టెల్లో 11 కోట్లు… :  లిక్క‌ర్ స్కామ్‌లో `సిట్` సీజ్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు అమ‌లు చేసిన మ‌ద్యం విధానం దేశంలోనే అతి పెద్ద కుంభ‌కోణం అని దీనిని విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కేసును విచార‌ణ‌కు చేప‌ట్టి 9 మాసాల‌కుపైగానే అవుతోంది. ఒక‌వైపు అరెస్టులు.. జ‌రుగుతూనే ఉన్నాయి.. మ‌రోవైపు కేసులో ఎంత విచారించినా.. రోజు రోజుకు కొత్త విష‌యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్ర‌మాలు బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి. తాజాగా …

Read More »

సుజ‌నా చౌద‌రికి ల‌క్కు క‌లిసొచ్చేనా ..!

సుజ‌నా చౌద‌రి.. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. 2014-18 మ‌ధ్య కేంద్ర మంత్రిగా.. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. ఆయ‌న‌కు ల‌క్కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి ఆయ‌న 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉండి.. బీజేపీలోకి చేరిపోయారు. ఏదైనా చ‌ర్చ జ‌రిగితే.. బీజేపీలో జ‌ర‌గాలి. కానీ.. ఆయ‌న గురించి టీడీపీలోనే ఎక్కువ‌గా చ‌ర్చ …

Read More »

దేశంలో ఒక్కొక్క‌రిపై 1.32 ల‌క్ష‌ల అప్పు: కేంద్రం

దేశంలో జ‌నాభా ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం.. 142 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. తాజా అంచ‌నాల ప్ర‌కారం.. 142 కోట్ల 9 ల‌క్ష‌ల 30 వేల‌కు పైగానే జ‌నాభా ఉన్నారు. అయితే.. వీరికి ఒక్కొక్క‌రిపై.. ల‌క్షా 32 వేల 59 రూపాయ‌ల చొప్పున అప్పు ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా పార్ల‌మెంటులో వెల్ల‌డించింది. అయితే.. సొమ్మేమీ.. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌లు తీసుకున్న అప్పులో.. లేక బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన రుణాలో కాదు. కేంద్ర …

Read More »