తెలుగు దేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గానీ, ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గానీ బీసీలకు అన్నింటా అగ్ర తాంబూలమే వేశారు. చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ సీట్లలో అనుకున్న దాని కంటే కూడా మెరుగైన రీతిలోనే సీట్లను ఇచ్చిన బాబు… ప్రభుత్వ పథకాల్లోనూ వారి కోటాకు ఎక్కడ …
Read More »‘కారు’లో నుంచి ‘గువ్వ’ల ఎగిరిపోయింది!
తెలంగాణలో సోమవారం అటు అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు అత్యంత ప్రత్యేకమైన రోజు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ప్రత్యేకమైన రోజే బీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆది నుంచి పార్టీ క్రియాశీలకంగా పనిచేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను …
Read More »ఇక్కడ రేవంత్ … అక్కడ కేసీఆర్
తెలంగాణలో సోమవారం నిజంగానే ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పక తప్పదు. ఎందుకంటే… రోజుల తరబడి సాగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు అయిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా… దానిపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సమీక్షించింది. అదే సమయంలో కేబినెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపై కేబినెట్ భేటీకి ముందే బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్… …
Read More »జగన్ చుట్టూ ఇక ‘ప్రైవేట్’ రక్షకులు!
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి ముందు తాను కూడా రాష్ట్రాన్ని పాలించిన అనుభవాన్ని మరిచిన జగన్… ప్రభుత్వ యంత్రాంగం గౌరవం దిగజారేలా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రేకెత్తుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే జగన్ కు సరిపడ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నా… ఆయన మాత్రం ఏకంగా 50 మంది దాకా ప్రైవేట్ …
Read More »ఆర్ఆర్ఆర్ పై కేసు పెట్టి తప్పుచేశా.. : కానిస్టేబుల్
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత రఘురామకృష్ణరాజు (ఆర్ ఆర్ ఆర్)పై కేసు పెట్టి తప్పు చేశానని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మహమ్మద్ ఫరూక్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ కేసును కొనసాగించే అవకాశం తనకు లేదన్నారు. అందుకే ఆయనపై నమోదు చేసిన కేసు సహా కోర్టులో వేసిన పిటిషన్లను కూడా వెనక్కి తీసుకుంటున్నానని ఆయన సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. …
Read More »ఉపాసనకు కీలక పోస్టు ఇచ్చిన సీఎం రేవంత్
మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలు, మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఆమెను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కో-చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ సహా ఉపాసన ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. తనను కో చైర్మన్‌గా నియమించినందుకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన …
Read More »ఈ నాయుడి ముందు అంతా జుజూబీలే!
వెంకటేశ్ నాయుడు… వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్య స్నేహితుడిగా పరిచయమై.. ఏపీ లిక్కర్ స్కాంలో అందరి కంటే కీలక భూమిక పోషించిన వ్యక్తిగా ఇప్పుడు ఓ రేంజిలో ఈయనకు హైప్ వచ్చేసింది. మొన్నటిదాకా ఈయన ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా నిండా ఈయన గారి వింతలు, విశేషాలు, జల్సాలు, నోట్ల కట్టల లెక్కింపులు… అబ్బో ఒకటా, …
Read More »కొడాలి నానిపై మరో కేసు… ఎక్కడో తెలుసా?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిని ఇప్పుడప్పుడే కేసులు వదిలేలా లేవు. ఇప్పటికే నాని ప్రాతినిధ్యం వహించిన గుడివాడ కేంద్రంగా పలు కేసులు నమోదు కాగా…గుండె సంబంధిత వ్యాధి, దానికి చికిత్స, ముంబైలో ఆపరేషన్ తదితర కారణాలతో జైలు నుంచి తప్పించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా నానిపై మరో కేసు నమోదు అయ్యింది. అది కూడా విశాఖపట్నంలో నమోదు కావడం గమనార్హం. …
Read More »వెంకన్న దర్శనంపై నాయుడు వర్సెస్ ఎల్వీఎస్!
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అంటే ఆ ఇద్దరికీ ఎంత భక్తో మాటల్లో వర్ణించలేం. అలాంటి వారిద్దరి మధ్య ఇప్పుడు స్వామి వారి దర్శనం గురించే వివాదం నెలకొంది. స్వామి వారి దర్శనాన్ని భక్తులకు మరింత వేగిరంగా కల్పించేందుకు శ్రమిస్తున్నామని ఒకరంటే… అది అసాధ్యమని, ఆ తరహా ప్రయత్నాలు మానుకోవాలని, అవన్నీ కూడా వృథా ప్రయత్నాలేనని మరొకాయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక శీఘ్ర దర్శనంపై కసరత్తు చేస్తున్న …
Read More »మీరు పెట్టే చేపల కూర తినడానికి రాలే: మంత్రి పై మల్లు రవి ఫైర్
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్నారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి కూడా హాజరయ్యారు. అయితే.. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన ఓ చిన్న ఘటన.. ఆయనను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దండు నరసింహ అనే కార్యకర్త.. వేదికపైకి వచ్చి.. మైకులో ప్రసంగిస్తున్న మల్లు రవికి ఓ కాయితం అందించారు. …
Read More »అయితే.. ఏమైతది?: కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా.. ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్లు చేశారు. ‘అయితే.. ఏమైతది!’ అని ప్రశ్నించారు. అంతేకాదు, ‘మీరు(మీడియా) చేస్తున్న హడావుడే ఎక్కువగా ఉంది. కోర్టు కాగ్నిజెన్స్(ఆధారాలు) తీసుకోమని చెప్పి రెండు రోజులైతంది. మీరు గిప్పుడు రాసిన్రు.. ఏమైతది?.. ఏమైతది? రాయండి.’ అని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు అనంతరం.. మీడియాతో మాట్లాడిన …
Read More »కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా: బండి సంచలన వ్యాఖ్యలు
“కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా నేను మారను. నేను ప్రజల మనిషిని. నాపై వచ్చే అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నా” అని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా బండి సంజయ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తనను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates