ఈ సారి ఆంధప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జట్టుకట్టాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. టీడీపీ, జనసేన నాయకులతో పాటు బీజేపీ నేతలు కూడా వైసీపీది అరాచక పాలన అంటూ జగన్పై విమర్శలు చేస్తున్నారు. ఇందులో బీజేపీ నేతలు కూడా తగ్గడం లేదు. కానీ జగన్ మాత్రం బీజేపీ శత్రువుగా మారిన సరే ఆ పార్టీని మాత్రం పట్టుకుని వదలడం లేదని టాక్. జగన్తో …
Read More »రేవంత్ ఫస్ట్ ప్రయారిటీ ఆ నియోజకవర్గాలే
ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే విజయం సాధించి చూపాలని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే చేస్తోందనే చెప్పాలి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిచి అధిష్ఠానానికి బహుమతిగా ఇవ్వాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. మిగతా సీనియర్ నాయకులూ తమ …
Read More »నారాయణ ఈ సారి ఫస్ట్ రావాలని!
ఒకటి, రెండు, మూడు.. ఇలా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తారు. ఇప్పుడు ఇలాగే తాను కూడా పొలిటికల్ ఎగ్జామ్లో ఫస్ట్ రావాలని నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓడిన నారాయణ.. ఈ సారి మాత్రం టీడీపీ తరపున జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో సాగిపోతున్నారు. 2014 ఎన్నికల్లో నారాయణ …
Read More »వ్యూస్ సరే.. కానీ ఒవైసీని ఓడించేంత ఓట్లు వస్తాయా?
సినిమాల్లో నటించి లేదా సోషల్ మీడియాల్లో వీడియోలతో ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. వీళ్లకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉంటున్నారు. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఆ అభిమానం ఓట్లుగా మారుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. గతంలో ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాల్లో ఫెయిల్ అవడమే అందుకు నిదర్శనం. ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ …
Read More »హిందూపురంలో తేలిన పరిపూర్ణానంద స్వామి !
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామి హిందూపురం లోక్ సభ, శాసనసభ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం లోక్ సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేయాలని ఆశించారు. ఆ స్థానం బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. దీంతో పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. గతంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి …
Read More »ఏపీలో ఎవరు గెలుస్తారో.. జోస్యం చెప్పిన కేసీఆర్!
తెలంగాణలో తన పార్టీ పరిస్థితి, తన నేతల పరిస్థితి.. నానాటికీ తీసికట్టుగా మారుతున్నా.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మెరమెచ్చు మాటలు మానడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు కేసీఆర్కు అత్యంత కీలకం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోయి.. అధికారం నుంచి దిగిపోయి ఉన్న పరిస్థితి నాయకుల వరుస జంపింగులతో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. …
Read More »జగన్ తరువాత మోడీ ని ఎటాక్ చేస్తున్న షర్మిల
ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై అత్యంత సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. అంతేకాదు.. మహిళల మంగళల సూత్రాలు తెంపిన నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ లెక్క చెప్పగలరా? నన్ను చెప్పమంటారా? అని ప్రశ్నించారు. తాజాగా బాపట్ల …
Read More »భర్త పదవి భార్యకు.. జగన్ మంత్రం?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కుటుంబ పోరును సీఎం జగన్ సెట్ రైట్ చేశారు. ఈ నియోజకవర్గంలో విజయం దక్కించుకుని తీరాలని కసితో ఉన్న సీఎం జగన్.. ఇక్కడ తలెత్తిన భార్యాభర్తల వివాదాన్ని తనదైన శైలిలో పరిష్కరించారు. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈయనను ఓడించి తీరాలనేది సీఎం జగన్ పంతం. ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్ …
Read More »హేమాహేమీల మధ్య లో బర్రెలక్క
బర్రెలక్కగా ప్రచారంలో ఉన్న శిరీష.. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. జూపల్లి కృష్ణారావు పోటీ చేసిన కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగారు. ఆమెకు ప్రజా సంఘాలు, ఎన్నారైలు, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు మద్దతు తెలిపారు. ఇక, యువత పెద్ద ఎత్తున ఆన్ లైన్ ప్రచారం కూడా …
Read More »‘తండ్రి ఆస్తి కొట్టేసి.. చెల్లికి అప్పిస్తావా..’
సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజ్లో ఫైరయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్ సోదరి.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల .. తన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న అప్పుల అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ అఫిడవిట్లో షర్మిల.. తాను తన అన్న జగన్కు, వదిన భారతికి రూ.82 కోట్లకు పైగా అప్పులు ఉన్నానని తెలిపారు. తర్వాత ఆమె దీనిపై వివరణ కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా …
Read More »రేవంత్, భట్టికి పొంగులేటి ఝలక్
కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం లోక్ సభ అభ్యర్థి టికెట్ ఖరారు వ్యవహారం కలకలం రేపుతున్నది. తన భార్య నందినికి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మాజీ మంత్రి మండవకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్, తన కుమారుడికి ఇవ్వాలని మంత్రి తుమ్మలలు, తన భార్య కాకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని భట్టి కోరారు. కాగా ఈ సీటు తన సోదరుడు ప్రసాదరెడ్డికి ఇవ్వాలని, లేదంటే వియ్యంకుడు …
Read More »ఈ పని బాబు ఎప్పుడో చెయ్యాలి కదా
పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న పేరు. గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ ఎన్నారై తన అఫిడవిట్లో రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఆయన కంటే ఆస్తిపరులు ఎంతోమంది ఉండొచ్చు కానీ.. అదంతా బినామీల పేరిట, నల్లధనం రూపంలో ఉండొచ్చు. కానీ పెమ్మసాని మాత్రం యుఎస్లో వ్యాపారం …
Read More »