బాబుకు తెలీదా.. తెలియ‌నివ్వ‌డం లేదా?

కూట‌మి ప్ర‌భుత్వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం మూడు కీల‌క విష‌యాల్లో భారీ సెగ త‌గులుతోంది. ఇదేమీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం కాదు. ఎక్క‌డో తెర‌చాటున కూడా జ‌ర‌గ‌డం లేదు. అంతా బ‌హిరంగంగానే జ‌రుగుతోంది. మ‌రి దీనిని ప‌రిష్క‌రించేందుకు.. అస‌లు స‌మ‌స్య‌ను వినేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం.. చిత్రంగా ఉంది. మ‌రీముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు కు తెలియ‌ద‌ని అనుకోవాలా? లేక‌.. ఆయ‌న వ‌ర‌కు అధికారులుకానీ.. పార్టీ నాయ‌కులు కానీ.. అస‌లు తెలియ‌నివ్వ‌డం లేద‌ని అనుకోవాలా? ఇదీ.. ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇంత‌కీ ఆ మూడు విష‌యాలు ఇవే..

1) స్మార్టు మీట‌ర్లు: రాష్ట్రంలో సాధార‌ణ విద్యుత్ వినియోగించే గృహాల‌కు స్మార్టు మీట‌ర్ల‌ను బిగించే ప్ర‌క్రియ సైలెంట్‌గా జ‌రుగు తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ్య‌తిరేకత చూపుతున్నారు. అదానీ కంపెనీ నుంచి వ‌స్తున్నామ‌ని చెబుతున్న‌వారు.. నేరుగా ప్ర‌స్తుతం ఉన్న మీట‌ర్ల‌ను మార్చి.. కొత్త‌గా మీట‌ర్లు బిగిస్తున్నారు. దీనిపై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత వ‌స్తున్నా..ఎవ‌రూ ప‌ట్టించుకో వడం లేదు. మ‌రోవైపు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉన్న కామ్రెడ్లు..ఇ ప్పుడు క‌దంతొక్కుతున్నారు. స్మార్టు మీట‌ర్ల వ్య‌వ‌హారాన్ని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లి.. ఉద్య‌మాలు నిర్మిస్తున్నారు.

2) భూ స‌మీక‌ర‌ణ‌: రాజ‌ధాని ప్రాంతంలో ఇప్ప‌టికే స‌మీక‌రించిన‌(ల్యాండ్ పూలింగ్) 34 వేల ఎక‌రాల‌కు తోడుగా మ‌రో 44 వేల ఎకరాల‌ను స‌మీక‌రించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. కానీ.. ఇక్క‌డే పెద్ద చిక్కు వ‌స్తోంది. గ‌తంలో ఇచ్చిన రైతుల‌కు ఇప్ప‌టికీ న్యాయం చేయ‌లేద‌ని.. రైతులు ప్ర‌శ్నిస్తున్నారు. ముందుగా వారికి న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా భూ ములు ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిని ఎట్టి ప‌రిస్తితిలోనూ సమీక‌రిస్తామ‌ని చెబుతోంది. కానీ, చంద్ర‌బాబు జోక్యం చేసుకుని రైతుల‌తో మాట్లాడితే స‌మ‌సిపోయే స‌మ‌స్య‌ను పెద్ద‌ది చేస్తున్నారు.

3) ఇండోసోల్ వ్య‌వ‌హారం: ప్ర‌కాశం జిల్లాలో ఇండోసోల్ కంపెనీకి 4500 ఎక‌రాల భూముల‌ను స‌మీక‌రించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. సౌర విద్యుత్ సంస్థ‌ను ఏర్పాటు చేసుకునే ప్ర‌తిపాద‌న నేప‌థ్యంలో ఇండోసోల్‌కు ఈ భూమిని అప్ప‌గించాల‌ని నిర్ణయిం చింది. అయితే.. గ‌తంలో వ్య‌తిరేకించిన సంస్థ‌కు ఈ బూములు ఇవ్వ‌డాన్ని ఒక‌వైపు వామ‌ప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంటే.. మ‌రోవైపు.. రైతుల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. త‌మ ప్రాణాలైనా ఇస్తామ‌ని చెబుతున్న అన్న‌దాత‌లు.. భూములు మా త్రం ఇచ్చేది లేద‌న్నారు. ఈ వ్య‌వ‌హారం కూడా.. రాష్ట్ర స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. మొత్తంగా రైతులు.. సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌స్తుతం ర‌గులుతున్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు జోక్యం త‌ప్ప‌నిస‌రి!.