వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల శాసన సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై బుక్లెట్ రూపొందించారు. దీనిని ఎవరు రాశారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎందుకంటే.. ప్రాణ భయం ఉన్న నేపథ్యంలో ఎవరు రాశారనే విషయం బయటకు పొక్కలేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం పీడిఎఫ్ కాపీ జోరుగా వైరల్ అవుతోంది. ఇలా.. ఒక ఎమ్మెల్యే అరాచకాలపై బుక్లెట్ రూపొందించడం.. ప్రచారం చేయడం అనేది చరిత్రలో ఇదే తొలిసారి అని పరిశీలకులు చెబుతున్నారు. …
Read More »సంచలనం: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరు
ఆరు మాసాల కిందట దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో తాజాగా మరో సంచలనం వెలుగు చూసింది. ఈ స్కాం గురించిన అనే కీలక విషయాలు అన్నీ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలుసునని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ను కూడా దాఖలు చేసింది. ఈడీ తరఫు న్యాయవాది పదే పదే కేసీఆర్ పేరును తాజాగా ప్రస్తావించడం గమనార్హం. ఢిల్లీలోని ఆమ్ …
Read More »జగన్‌పై రాయిదాడి కేసులో నిందితుడికి బెయిల్!
ఏపీ సీఎం జగన్‌పై విజయవాడ శివారులోని సింగ్‌నగర్ ప్రాంతంలో జరిగిన రాయి దాడి ఘటనలో ప్రధాన నిందుతుడు(ఏ1) సతీష్‌కు ఉపశమనం లభించింది. విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్‌కు సంబంధించి కొన్ని షరతులు విదించింది. ప్రతి శనివారం, ఆదివారం సింగ్‌నగర్ పోలీసు స్టేషన్లో హాజరు కావాలని.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు సంతకాలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా రూ.50 వేలపూచీ కత్తు …
Read More »చంద్రబాబు రిటర్న్ టు ఏపీ.. ఇక, వేడే!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం తిరిగి రానున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత(ఈనెల 13) ఆయన కుటుంబంతో సహా.. విదేశాలకు వెళ్లారు. అయితే.. చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసమని అప్పట్లో పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఈ పర్యటనలో నారా లోకేష్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. మొత్తంగా నారా కుటుంబం అమెరికాలో పర్యటించింది. ఈ పర్యటనను ముగించుకుని బుధవారం చంద్రబాబు ఫ్యామిలీ …
Read More »వీరికి న్యాయం చేయాలి బాబూ..!
టీడీపీ సర్కారు కనుక అధికారంలోకి వస్తే.. అంటే.. కూటమి గెలిచి.. పార్టీ అధికారంలోకి వస్తే.. మంత్రి పదవుల విషయంలో యాగీ ఉండడం ఖాయం. ఎందుకంటే.. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన, 10 స్థానాలు తీసుకున్న బీజేపీ కూడా.. జోరుగానే ప్రయత్నించింది. హోరుగానే ప్రచారం చేసుకుంది. ఎక్కడిక్కడ గెలుపు గుర్రాలనే పెట్టుకున్నారు. వీరిలో ఎవరినీ తక్కువగా అంచనా వేయలేం. అదేసమయంలో గెలుస్తారో.. లేదో అన్న అనుమానం ఉన్నప్పటికీ.. బలమైన పోటీనే …
Read More »ఏపీలో పాలన అంత ఈజీకాదు బ్రో!!
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు పాలన పగ్గాలు చేపడతారు? అనేది.. ఆసక్తికర విషయమే. ప్రజలు దీనికి సంబందించి తీర్పు చెప్పేశారు. తమను పాలించే వారిని ఎన్నుకొన్నారు. కేవలం ఫలితం మాత్రమే వేచి ఉంది. అది జూన్ 4న వ్యక్తమవుతుంది. జూన్ 9 నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అవుతుంది. అయితే.. ఈ సారి ఏపీలో పాలన అంత ఈజీ అయితే కాదని అంటున్నరు పరిశీలకులు. దీనికి కారణం.. …
Read More »రాజ్యాంగం వర్సెస్ రాజ్యాంగం-బీజేపీ వర్సెస్ కాంగ్రెస్!!
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే.. కీలకమైన విషయం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. వరుసగా మూడోసారి అదికారంలోకి రావాలని తపిస్తున్న బీజేపీ ఒకవైపు.. కాదు, ఈ సారైనా గెలిచి.. పార్టీ అస్థిత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తున్నాయి. రెండు సార్లు వరుసగా అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాలపై వ్యూహాలు వేస్తూ.. ఎన్నికల పోరులో తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇక, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ ఎన్నికలకు ముందు.. భారత్ …
Read More »పిఠాపురంలో పిచ్చి పీక్స్ !
ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం శాసనసభ స్థానం నుండి బరిలోకి దిగాడు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. జనసేన తరపున మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు పిఠాపురం గ్రామాలలో సందడి చేశారు. వైసీపీ తరపున రోజా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా …
Read More »తగ్గేదేలా… సర్కారుకు దీటుగా కేసీఆర్ తెలంగాణ ఉత్సవాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న జరగనుంది. దీనికి సంబంధించి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. ఇక, రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ గీతం, అధికారిక ముద్ర, తెలంగాణ తల్లి …
Read More »‘తీన్మార్’.. విజయం ఖాయమేనా?
తెలంగాణలో మరో ఎన్నికకు ముహూర్తం సమీపించింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నిన్న మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఈ హడావుడి కనిపిస్తోంది. ఖమ్మం-వరంగల్-నల్లగొండ.. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తంగా 4.63 లక్షల మంది పట్ట భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్లగొండ.. …
Read More »జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా ?
కడప జిల్లా జమ్మలమడుగులో ఈసారి గెలుపు ఎవరిది ? అన్న చర్చ జోరుగా నడుస్తుంది. ఇక్కడి ఫలితాల మీద అంచనాలు అందక బెట్టింగ్ రాయుళ్లు కూడా భయపడి వెనక్కు తగ్గుతున్నారంటే ఇక్కడ పోటీ ఎలా జరిగిందో అంచనా వేయవచ్చు. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి, కూటమి పొత్తులో భాగంగా బీజేపీ నుండి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు పోటీకి దిగారు. ఆదినారాయణ రెడ్డి 2004, 2009 …
Read More »అలా జరిగితే.. పవన్ కు తిరుగులేదుగా!
ప్రస్తుత ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఎన్ని గెలుస్తారనే విషయంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. కొందరు నాలుగు అంటుంటే.. మరికొందరు.. సగం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. సరే… ఈ వాదన ఎలా ఉన్నప్పటికీ.. పోటీలో ఉన్నవారు మాత్రం బలమైన నాయకు లే.. దీంతో మొత్తంగా గెలిచినా ఆశ్చర్యంలేదని మరికొందరు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గమనిస్తే… 19-20 స్థానాలు దక్కించుకున్నా ఆశ్చర్యం …
Read More »