వైసీపీ నాయకుడు, సీనియర్ నేత పేర్ని నాని మరోసారి తీవ్ర వివాదానికి తెరదీశారు. నెల్లూరు జిల్లా కోవూ రు ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై పేర్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా లో మైనింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా ఆమె కనుసన్నల్లోనే జరుగుతున్నాయని.. ఆమె మూటలు అంది స్తున్నారని.. అవి తీసుకుంటున్న కొందరు మంత్రులు ఆమెపై ఈగవాల కుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. మీకు మూటలు అందిస్తోంది కాబట్టి.. ఆమె మీకు మహాతల్లి అని ఎద్దేవా చేశారు.
మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తాజాగా మాట్లాడుతూ.. వైసీపీ నాయకురాలు, కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై విమర్శలు చేశారు. “పోలీసులను తిట్టి.. టీడీపీ నాయకులను తిట్టి.. ఎదురు తనకు అన్యాయం జరిగిందని.. హారిక మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆమెను మించిన మహానటి మరొకరు లేరు” అని కొల్లు వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా పేర్ని మాట్లాడుతూ.. ప్రశాంతి రెడ్డి వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చారు. ఆమె ఎమ్మెల్యే హోదాను అడ్డు పెట్టుకుని జిల్లా మొత్తాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
మైనింగ్ చేస్తూ.. దానిలో వచ్చిన లాభాల్లో కొంత మూటలు మీరు అందిస్తున్నారు కాబట్టి.. ప్రశాంతి మీకు మహాతల్లిగా కనిపిస్తోందని పేర్ని విమర్శించారు. అంతా రాసుకుంటున్నామని చెప్పిన ఆయన.. అధికా రంలోకి వచ్చాక.. ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు. పోలీసులపై కూడా పేర్ని తీవ్ర వ్యాఖ్యలు చేస్తు న్నారు. మంత్రులు చెప్పారని తమపై కి వచ్చి కేసులు పెడితే.. న్యాయస్థానాలకు ఈడుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోందన్న పేర్ని.. ఉప్పాల హారిక, ఆమె భర్త రాములను తిట్టి.. చివరికి వారి పైనే కేసులు పెట్టారని ఆరోపించారు. అయితే.. ఇంతకు ఇంత భవిష్యత్తులో తీర్చుకోవాల్సి ఉంటుంద న్నారు. మంత్రి కొల్లు రవీంద్రను పగటి వేషగాడితో పోల్చిన పేర్ని.. ఈ ప్రభుత్వం, మంత్రులు, నాయకులు అందరూ మీడియాపై ఆధారపడి బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates