కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కుస్తీలు ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. స్థానికంగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రెడ్డప్ప గారి మాధవి పై టిడిపి సహా బిజెపి, జనసేన నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తను తీసుకున్న నిర్ణయమే సరైనదిగా భావిస్తున్నారని గతంలోని టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అధికారులను కూడా తిట్టడం అదేవిధంగా కౌన్సిల్ …
Read More »`పది` సూత్రాలతో పరుగులు పెట్టాలి: చంద్రబాబు
జిల్లాలు అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు రోజుల పాటు అమరావతిలోని సచివాలయంలో నిర్వహించి కలెక్టర్ల సదస్సు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు విషయాలపై మరోసారి కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాల అభివృద్ధికి ఇప్పటికే రోడ్ మ్యాప్‌ను రెడీ చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఓ పది సూత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఆయన వాటిని కలెక్టర్లు …
Read More »బీజేపీ అంటే ఏంటో జగన్‌కు అర్థమైందా…?
రాజకీయాల్లో అవసరం ఉంటే ఒకవిధంగా ఉంటారు.. అవసరం తీరాక మరో విధంగా ఉంటారు.. అనేది వాస్తవం. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం మరింత ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాలకు.. ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పొత్తులు పెట్టుకుని.. తర్వాత.. తమ ఇష్టప్రకారం వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, తమ అవసరానికి వాడుకుని.. వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీకి అర్థం కావాల్సింది.. బీజేపీ రాజకీయం. …
Read More »సొంత జిల్లాపై ప్రేమ ఇదేనా… జగన్ ..!
వైసిపి అధినేత జగన్ సొంత జిల్లా కడపలో టిడిపి నాయకులు మరో ప్రచారం ప్రారంభించారు. తన సొంత జిల్లా పై ఎనలేని ప్రేమ ఉందని, తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తారని వైసీపీ నాయకులు జగన్ గురించి పదేపదే ఇక్కడ చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి సమస్యలు కూడా వినిపిస్తారు. అయితే, అధికారంలో ఉన్నంతవరకు ఎలా ఉన్నా అధికారం కోల్పోయిన …
Read More »`వివేకా` కేసు మళ్లీ విచారణ… సునీత టార్గెట్ ఎవరు?
2019లో దారుణ హత్యకు గురైన ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బాబాయి.. వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కేసు విచారణను సీబీఐ గతంలోనే ముగించింది. దీనికి సంబంధించి కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అయితే.. వివేకాకుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత మాత్రం.. ఈ కేసు విచారణను పునః ప్రారంభించాలని.. తమకు అనేక అనుమానాలు ఉన్న వ్యక్తులను అసలు విచారించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ …
Read More »భక్తుల సొమ్ము.. భగవంతుడికే: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు.. భక్తులు తరచుగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఏపీలో అయితే తిరుమల, సింహాచలం, విజయవాడ దుర్గమ్మ, తెలంగాణలోఅయితే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి.. ఇలా.. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలకు భక్తులు విరివిగా విరాళాలు ఇస్తారు. ఆ సొమ్ముతో దేవాలయాలు.. వివిధ కార్యక్రమాలు చేస్తుంటాయి. భక్తుల సౌకర్యం కోసం.. కల్యాణ మండపాలు.. క్యూలైన్ల ఏర్పాట్లు.. తాగునీటి వసతులు.. భోజన సదుపాయాలు కూడా కల్పిస్తాయి. అదేసమయంలో వివిధ ప్రాంతాల్లో మరిన్ని ఆలయాలు …
Read More »`ఇంజనీర్ అంబేడ్కర్`ను అరెస్టు చేశారు!
విద్యుత్ కనెక్షన్ కావాలంటే లంచం.. మీటరు మార్చాలంటే లంచం.. బిల్లు కట్టేందుకు సమయం కోరితే లంచం.. డబుల్ ఫేజ్ నుంచి సింగిల్ ఫేజుకు మార్చాలన్నా లంచం.. చిరు ఉద్యోగి బదిలీ కోరితే లంచం.. దిగువ స్థాయి ఉద్యోగి ప్రమోషన్ కోరితే లంచం.. ఇలా అన్నింటా.. లంచం.. లంచం.. అంటూ.. అవినీతి అనకొండలా చెలరేగిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్స్(ఏడీఈ) అంబేడ్కర్‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. …
Read More »పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ప్రశంసలు.. ఏమన్నారంటే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు ప్రశంసించడం కొత్తకాదు. పలుసందర్భాల్లో జరిగిన కార్యక్ర మాలు.. సభల్లో పరస్పరం ప్రశంసించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. తాజాగా రెండో రోజు కలెక్టర్ల సదస్సు లో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేస్తున్న కృషిని, ఆయన నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, …
Read More »జనవరి నుంచే క్వాంటం హబ్‌గా అమరావతి!
ఏపీ రాజధాని అమరావతి.. జనవరి నుంచే క్వాంటం హబ్‌గా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో క్వాంటం కంప్యూటింగ్‌పై సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. అమరావతిని క్వాంటం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థిర నిశ్చయంతో ఉన్నామని చెప్పారు. గ్లోబల్ క్వాంటం డెస్టినేషన్‌గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. దీనికోసం రెండు …
Read More »వైసీపీ డ్రామా ఆడుతోంది: చంద్రబాబు
తాము తీసుకువచ్చిన వైద్య కళశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారని.. పేర్కొంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలపై చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. దమ్ముంటే.. అసెంబ్లీకి రావాలని.. అన్ని విషయాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. తాజాగా రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం.. మెడికల్ కాలేజీల వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన హయాంలో …
Read More »పవన్… ఈ చిరునవ్వుల భావమేమి?!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంత ఈజీగా నవ్వరు. ఏదైనా పెద్ద సందర్భం వస్తే తప్ప.. ఆయన పెద్దగా స్పందించరు. ప్రజల సమస్యలపైనా.. వాటి పరిష్కారంపైనా మాత్రమే దృష్టిపెడతారు. ఇక, ఏదైనా కార్య క్రమంలో పాల్గొన్నా.. కూడా ఆయన మౌనంగానే ఉంటారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై మాట్లాడి వెళ్లిపోతారు. తాజాగా అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వాస్తవానికి …
Read More »ఈ ఫొటో జూబ్లీహిల్స్ ఓటర్లను షేక్ చేసింది!
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ.. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో అక్కడి ఓటర్లను, రాజకీయ విశ్లేషకులను షేక్ చేసింది. అంతగా ఆ ఫొటోలో ఏముందన్న విషయానికి వెళితే… బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ కీలక నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటో చూసినంతనే జూబ్లీహిల్స్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates