వైసీపీ వైపు రెడ్లు త‌గ్గుతున్నారే ..!

రాష్ట్రంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఒక పార్టీకే ప‌రిమితం కాలేదు. వాస్త‌వానికి సామాజిక వ‌ర్గాల వారీగా క‌మ్మ‌, కాపు వ‌ర్గాలు.. పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. 70-80 శాతం మంది క‌మ్మ సామాజిక వ‌ర్గం టీడీపీ వైపు ఉంటే.. 1-2 శాతం మంది క‌మ్యూనిస్టుల వైపు ఉన్నారు. వైసీపీ వైపు ఉన్న‌ది కేవ‌లం 20-30 శాతం మంది మాత్ర‌మే. వారు కూడా అటు ఇటుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిలోనూ.. గ‌తంలో వైఎస్ రాజశేఖ‌ర‌రెడ్డి ద్వారా మేలు పొందిన వారే ఉన్నారు.

ఇక‌, కాపు సామాజిక వ‌ర్గంలో 70-80 శాతం మంది జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్నారు. మిగిలిన వారిలో 10-15 శాతం టీడీపీవైపు ఉండ‌గా.. 10 శాతం మంది మాత్ర‌మే వైసీపీ వైపు చూస్తున్నారు. మిగిలిన వారిలో త‌ట స్థంగా 2-3 శాతం మంది ఉన్నారు. సో.. క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాలు.. టీడీపీ.. జ‌న‌సేన‌ల‌ను బ‌ల ప‌రుస్తున్నాయనే విష‌యం స్ప‌ష్టంగా ఉంది. కానీ.. రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుడిగా.. ఆ వ‌ర్గంలో వైఎస్ త‌ర్వాత బ‌ల‌మైన నేత‌గా ఎదుగుతార‌ని భావించిన జ‌గ‌న్‌ వైపు రెడ్డి వ‌ర్గం ఎలా ఉంది? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం.

ఈ లెక్క‌ల‌న్నీ తాజాగా నిర్వ‌హించిన‌ రెండు మూడు స‌ర్వేల్లో స్ప‌ష్ట‌మైంది. వీటి ప్ర‌కారం.. క‌మ్మ‌, కాపులు టీడీపీ, జ‌న‌సేల‌ను బ‌ల‌ప‌రుస్తున్న‌ట్టుగా.. రెడ్డి సామాజిక వ‌ర్గం వైసీపీని బ‌ల‌ప‌ర‌చ‌లేక పోతోంది. 2014, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్న ఐక్య‌త, వైసీపీవైపు చూపిన మొగ్గు నానాటికీ త‌గ్గుతూ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రెడ్డి సామాజిక వ‌ర్గంలో 42 శాతం మేర‌కు మాత్ర‌మే వైసీపీకి అనుకూలంగా ఉన్నార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇది స‌ర్వేలే కాదు.. జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను గ‌మ‌నించినా.. స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

మిగిలిన వారిలో 35 శాతం మంది గుండుగుత్త‌గా టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. 10 శాతం మంది జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారని స‌ర్వేలు చెబుతున్నాయి. మిగిలిన వారిలో 5 శాతం మంది త‌ట‌స్థంగా ఉన్నారు. అంటే.. ఒక‌ప్పుడు 90 శాతం మంది కాంగ్రెస్‌కు అండ‌గా ఉన్న రెడ్ల‌లో 70 శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉంటే.. 2019 త‌ర్వాత‌.. ఈ సంఖ్య త‌గ్గుతూ… వ‌చ్చిందని, 2024 నాటికి 30 కి ప‌డిపోయింద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఆ త‌ర్వాత‌.. కొంత మేర‌కు కోలుకున్నా.. ఆశించిన విదంగా అయితే.. వైసీపీకి రెడ్ల మ‌ద్ద‌తు లేద‌న్న‌ది స‌ర్వేలు చెబుతున్న మాట‌. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ ఆలోచ‌న చేసుకోవాల్సి ఉంటుంది.