బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న ఆయనకు తెలంగాణలోనే అధికారం లేకుండా పోయింది. అన్నీ తానే అనుకుని, పార్టీకి ఎలాంటి వ్యూహకర్తల అవసరం లేదని బీరాలు పలికిన కేసీఆర్కు షాక్ తగిలింది. ఇప్పుడు అర్జెంట్‌గా ఆ పార్టీకి ఓ వ్యూహకర్త అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రతి పార్టీకి ఓ వ్యూహకర్త ఉంటున్నారు. ఎన్నికల …
Read More »అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్నయ్యా..
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. అద్దం పంపిస్తాను.. ముఖం చూసుకో అన్నయ్యా! అంటూ .. ఆమె నిప్పులు చెరిగారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. మూడు కీలక విషయాలను ప్రస్తావించారు. వీటికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రతి పనినీ చంద్రబాబుపైకి …
Read More »ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు గుర్తింపు సంపాదించిన నేత.. ముద్రగడ పద్మనాభం. 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడడంలో ఆయన పాత్ర కూడా కొంత ఉంది. టీడీపీకి వ్యతిరేకంగా కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ప్రయత్నం కొంతమేర ఫలించింది. ఐతే వైసీపీకి పరోక్షంగా అండగా నిలిచిన ముద్రగడ.. పూర్తిగా రాజకీయ రంగు పులుముకోకుండా ఆ …
Read More »ఆ చట్టం జగన్ మెడకు చుట్టుకుందా?
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే నిర్దేశించే స్థాయికి వెళ్లిపోతుంటాయి. ప్రతిపక్షాలు అలాంటి అంశాలను సరిగ్గా అందిపుచ్చుకుని అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం చూస్తుంటాం. గత ఎన్నికల ముంగిట ప్రత్యేక హోదా అంశంతో టీడీపీని ప్రతిపక్ష వైసీపీ అలాగే ఇరుకున పెట్టి ప్రయోజనం పొందింది. కానీ ఎన్నికల తర్వాత ఆ అంశాన్ని పక్కన పెట్టేసిందన్నది వేరే …
Read More »ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ ప్రయోజనం ఉండటం లేదనే టాక్ ఉంది. అందుకే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకునేందుకు నాని సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారంటూ ఆత్మీయ సమావేశానికి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే …
Read More »మోడీ వస్తున్నారు.. కూటమిలో జోష్, వైసీపీలో టెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో ఉన్న కూటమికి మరింత నమ్మకం కలగబోతోంది. అవును.. ఏపీలో విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. చిలకలూరిపేటలో మోడీ సభతో ఏపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కూటమి హుషారుగా …
Read More »వ్యతిరేకత జగన్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వ్యతిరేకత అనేది తన మీద కాదని, తన ఎమ్మెల్యేల మీద మాత్రమే అని జగన్ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారనే ప్రశ్నకు …
Read More »శింగనమల సింగమలై ఎవరో?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు గెలుపోటములపై బేరీజు వేసుకుంటూ ఓట్ల వేటలో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని చెప్పాలి. గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ మంత్రి శైలజానాథ్ మరోసారి …
Read More »తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన పోలింగ్ దశకు చేరుకోనుంది. ఇలాంటి వేళలో ఎంతటి హడావుడి నెలకొని ఉంటుందో తెలిసిందే. రెండోసారి అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించటంతో పాటు.. రోజువారీ ప్రచారంతో దూసుకెళుతున్నారు. అయితే ఎన్ని …
Read More »తీన్మార్ మల్లన్న ఆస్తులు ప్రభుత్వానికి.. సంచలన నిర్ణయం
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఒకసారి తప్పిపోయిన ఎమ్మెల్సీ సీటు ఈ దఫా దక్కింది. దీంతో తాజాగా ఆయన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. దీనికి ముందు తీన్మార్ …
Read More »అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది. నరేంద్రమోడీ ఆకర్షణ, రామమందిరం, హిందుత్వవాదం తమను గెలుపు వాకిట నిలబడతాయని భావిస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సినీ నటులను ప్రచారానికి దించుతున్నారు. అయితే ఈ సారి హోంమంత్రి …
Read More »గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఈ ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద గెలిస్తే ఎంపీ అయి కేంద్ర మంత్రి అవుతానని, ఓడిపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని అమె అంటున్నారట. హైదరబాాద్ ఎంపీ …
Read More »