ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా అధికార పార్టీలయిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబరాలకు పిలుపునిచ్చారు. మరోవైపు, జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి అంబటి …
Read More »‘జగన్ కోసమా జనం కోసమా’ – వైసీపీ నేతలపై విమర్శలు!
వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వైసీపీనాయకులు రోడ్డెక్కారు. కూటమి పార్టీలు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న సాకుతో `వెన్నుపోటు దినం` పేరిట నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే.. చాలా జిల్లాల్లో ఈ ఊసు కనిపించడంలేదు. మరో వైపు కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం నాయకులు రోడ్డెక్కారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణజిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన పేర్ని నాని.. అక్కడ …
Read More »బాబు కలల ప్రాజెక్టు సాకారమయ్యేనా? రీజనేంటంటే!
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. బనకచర్ల. ఇది కర్నూలులోని ఓ గ్రామం. ఇక్కడ భారీ ప్రాజెక్టును తీసుకురావడం ద్వారా గోదావరి నది జలాలను వృధా కాకుండా.. ముఖ్యంగా సముద్రంలో కలవకుండా.. ఇక్కడకు తీసుకువచ్చి.. ఆ నీటిని సీమకు అందించడం ద్వారా ఇక్కడి రైతులకు.. సాగు, ప్రజలకు తాగు నీరు అందించేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా భారీ కసరత్తు …
Read More »జగన్ ఓటమికి ఏడాది.. నాడు – నేడు ..!
జగన్.. మూడు అక్షరాలు.. కానీ, 2019-2024 మధ్య జరిగిన ఐదు సంవత్సరాల్లో.. ఆ పేరు అనేక విమర్శలకు.. వివాదాలకు కూడా దారితీసింది. తూర్పు-పడమరగా ఉన్న బీజేపీ-టీడీపీలను చేతులు కలిపేలా కూడా చేసింది. అంతేకాదు.. ప్రజల్లో మహోజ్వల చైతన్యానికి.. కలియతత్వానికి కూడా.. నాంది పలికింది ఆ పేరే. నేటికి(జూన్ 4) సరిగ్గా ఏడాది కిందట జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై ఆశలు పెట్టుకున్న జగన్.. …
Read More »వారానికి ముందు.. వైసీపీ యాగీ!
మరో వారంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. వీటికి సంబంధించి పక్కా ప్రణాళిక కూడా రూపొందించారు. ఈ నెల 12 నాటికి తల్లికి వందనం పేరుతో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా.. కేంద్రం ఈ నెల నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్రం కూడా అదే కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభించనుంది. ఇక, బడి …
Read More »చంద్రబాబుది అకుంఠిత దీక్ష: పవన్ కల్యాణ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే కాకుండా.. ఆ పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తూ.. ప్రజలు ఇచ్చిన తీర్పునకు నేటితో(జూన్ 4, 2025) ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కూటమి పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక, తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రి వర్గం కూడా భేటీ అయింది. వివిధ అంశాలపై చర్చ కోసం నిర్వహించిన ఈ సమావేశంలో తొలి చర్చగా గత ఏడాది ఇదే రోజు …
Read More »కేసీఆర్ది గట్టి గుండె: కవిత
మాజీ సీఎం కేసీఆర్ ది గట్టి గుండె అని.. అందుకే అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బీఆర్ ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై రాజకీయాలు చేయడం తగదని ఆమె సూచించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం వెనుక.. ఆయనను రాజకీయంగా బద్నాం చేయాలన్న ఉద్దేశం ఉందని ఆరోపించారు. “సింహాన్ని చర్చకు పిలుస్తారా?“ అని ఆమె సటైర్లు వేశారు. ఏం తప్పు చేశారని కేసీఆర్ను విచారణకు పిలుస్తారని ప్రశ్నించారు. …
Read More »తల్లికి వందనం.. తేదీ ప్రకటనే తరువాయి
ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అత్యంత కీలకమైన పథకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సీఎం చంద్రబాబు డెడ్ లైన్ ను ప్రకటించగా… తాజాగా బుధవారం ఆయన నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ పథకానికి అవసరమైన …
Read More »`యువగళం` భేష్.. లోకేష్కు పవన్ అభినందన!
“యువగళం పాదయాత్ర భేష్. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు చేపట్టిన ఈ పాద యాత్ర సఫలీకృతమైంది.“ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నాడు 2023-24 మధ్య టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రను ఆయన అభినందించారు. తాజాగా నారా లోకేష్ తన పాదయాత్రపై పుస్తకం రూపొందించిన విషయం తెలిసిందే. అనేక విషయాలు.. ఫొటోలతో రూపొందించిన ఈ యువగళం పాదయాత్ర పుస్తకాన్ని …
Read More »బొత్సకు ఏమైంది?.. మాట్లాడుతూనే కుప్పకూలిన నేత
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాటి పార్టీ నిరసనల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అయితే ఈ నిరసనల్లో ప్రసంగిస్తూనే ఆయన ఉన్నట్టుండి కుప్పకూలి పోయారు. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చేపట్టిన నిరసనలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స ప్రసంగిస్తున్న సమయంలోనే చేతిలో మైకు పట్టుకునే ఆయన అలా అలా కుప్పకూలారు. వేగంగా …
Read More »కూటమి సంబరాలు షురూ!
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించి బుధవారం(జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కూటమి పార్టీలు సంబరాలు ప్రారంభించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టారు. ఓ వైపు వెన్నుపోటు దినం అంటూ విపక్ష వైసీపీ నిరసనలకు తెర తీసినా… కూటమి పార్టీలు చేపట్టిన సంబరాల నేపథ్యంలో ఆ నిరసనలు దాదాపుగా …
Read More »ఏపీలో తొలిసారి కొత్త కార్పొరేషన్.. చంద్రబాబు నిర్ణయం
ఏపీలో పాలనా పరంగా తీసుకువచ్చిన అనేక మార్పులు ప్రజల అభివృద్ధికి దోహదపడుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొత్తగా లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇది దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ అని పేర్కొన్నారు. దీనివల్ల అభివృద్ధి, ఉపాధి మరింత వేగంగా ప్రజలకు చేరువ అవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్పొరేషన్ రాష్ట్రంలోని పోర్టులు, మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందన్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates