Political News

తెలంగాణ ఎన్నిక‌ల‌కే ఇంత‌.. ఏపీ ఎన్నిక‌లైతే ఇంకెంత‌?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. మూడు ప్ర‌ధాన పార్టీలు.. వెర‌సి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఘ‌ట్టం పూర్త‌యిపోయింది. కానీ, ఎన్నిక‌ల వేడి మాత్రం ఇంకా చ‌ల్లార‌లేదు. ఈ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం.. ఇంకా చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. దీనికి కార‌ణం.. నాయ‌కులు, పార్టీల మ‌ధ్య చెల‌రేగిన మాట‌ల మంట‌లు.. జంపింగుల యుద్ధాలు.. ట్విస్టులు, కౌంట‌ర్లు.. ఒక్క‌టేమిటి.. అన్నీ ఇన్నీకావు. ఏకంగా ఎన్నిక‌ల సంఘంతో మొట్టికాయ‌లు …

Read More »

ఎంపీల లెక్క సరిపోయిందా ?

తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు ఎంపీల లెక్క సరిపోయింది. లెక్కసరిపోవటం అంటే ముగ్గురు ఎంపీలు ఓడిపోయి మరో ముగ్గురు ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్ తరపున ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలిచారు. అలాగే బీజేపీ తరపున పోటీచేసిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఓడిపోయారు. రేవంత్ …

Read More »

కేటీఆర్‌ను మ‌రిపించే మంత్రి ఎవ‌రో? ఐటీ వ‌ర్గాల గుస‌గుస‌!

తెలంగాణలో ఐటీ రంగం విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌తోపాటు.. గ‌చ్చిబౌలి వంటి కీల‌క ప్రాంతాల్లో ఐటీ విస్త‌ర‌ణ జోరుగా సాగుతోంది. కేసీఆర్ స‌ర్కారు అనేక సంస్త‌ల‌ను కూడా ఆహ్వానించింది. ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్ కీల‌క పాత్ర పోషించారు. ఐటీ,ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఆయ‌న ఒక ముద్ర వేశారు. నిరంత‌రం ఐటీ ఉద్యోగుల‌తో ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ట‌చ్‌లో కూడా ఉండేవారు. దీంతో ఆయ‌న‌కు ‘ఫ్రెండ్లీ …

Read More »

వెనిగ‌ళ్ల‌కు టికెట్‌.. రావికి ప‌ద‌వి…తేల్చేసిన చంద్ర‌బాబు

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ హాట్ టాపిక్కే. గుడివాడ అన‌గానే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు.. ఫైర్ బ్రాండ్ కొడాలి నాని. వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న కొడాలి నానికి చెక్ పెట్టాల‌నేది టీడీపీ వ్యూహం. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒక‌టి రాజ‌కీయం.. రెండు వ్య‌క్తిగ‌తం కూడా..! రాజ‌కీయంగా నానిని ఓడించ‌డం.. ఒక భాగ‌మైతే.. రెండోది చంద్ర‌బాబు కుటుంబాన్ని వ్య‌క్తిగతం విమ‌ర్శిస్తున్న …

Read More »

డిప్యూటీ వ‌ద్దు.. సీఎం సీటే కావాలి.. ముదిరిన వివాదం!

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలకు తావివ్వ‌కూడ‌ద‌ని అంద‌రూ భావించినా.. అలాంటి వాతావ‌ర‌ణానికి చెక్ పెట్టేలా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించినా.. చివ‌రి నిముషంలో మాత్రం గ్రూపు రాజ‌కీయాలే ప్రారంభమయ్యాయి. హైద‌రాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుంది. సీఎం ఎవరో అధిష్టానం ఫిక్స్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఖ‌మ్మంలోని …

Read More »

తెలంగాణ స‌చివాలయంలో వ‌డివ‌డిగా ఏర్పాట్లు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావ‌డంతో ఆ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నిక‌ల సంఘం చర్యలు చేపట్టింది. ఈ క్ర‌మంలో తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈవో …

Read More »

పార్టీ ఓడి వారు.. పార్టీ మారి వీరు ప‌ద‌వులు పోగొట్టుకున్నారు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చిత్ర‌మైన జంపింగుల వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా నాయ‌కులు పార్టీలు మారేసి.. జెండా మార్చేసి.. కండువాలు క‌ప్పేసుకున్నారు. ఇలాంటి వారిలో కొంద‌రు ఇప్పుడు అల‌మ‌టిస్తున్నారు. అయ్యోమార‌కుండా ఉంటే బాగుండేది క‌దా! అని బాధ‌ప‌డుతున్నారు. దీనికి కార‌ణం.. మారిన పార్టీ అధికారంలోకి రావ‌డ‌మే! అదేవిధంగా పార్టీ ఓడిపోకుండా.. అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. కొంద‌రు ఖ‌చ్చితంగా మంత్రులు అయ్యేవా రు. వీరిలో తొలిసారి …

Read More »

అన్న‌ద‌మ్ములు-భార్యాభ‌ర్త‌లు-మామా అల్లుళ్లు!

తాజాగా జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒకే కుటుంబం నుంచి అనేక మంది పోటీ చేశారు. వీరిలో చాలా మంది ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. కాంగ్రెస్ జోరును కూడా త‌ట్టుకుని నిల‌బ‌డిన వారిలో కొంద‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో బీఆర్ ఎస్‌నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నాయ‌కులు ఉన్నారు. ఇలాంటివారిలో అన‌దమ్ములు, భార్యాభ‌ర్త‌లు, మామా అల్లుళ్లు కూడా.. గెలుపు గుర్రం ఎక్కారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి …

Read More »

సెంటిమెంటు అస్త్రానికి ఫుల్లుగా ప‌డిపోతార‌న్న‌మాట‌..

రాజ‌కీయాల్లో నాయ‌కులు అనుస‌రించ‌ని వ్యూహాలంటూ ఉండ‌వు. స‌మ‌యానికి త‌గిన విధంగా నాయ‌కులు త‌మ వ్యూహాల క‌త్తుల‌కు ప‌దును పెడ‌తారు. అందునా.. ఎన్నిక‌లంటే మ‌రింత ఎక్కువ‌గా వ్యూహాల‌కు తెర‌దీ స్తారు. ఈ వ్యూహాలు అవి.. ఇవి.. అనే తేడా ఉండ‌దు. స‌మ‌యానికిత‌గిన విధంగా ఏదైనా ఉండొచ్చు. గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ప‌ర‌మావ‌ధి, ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేయ‌డ‌మే మూల మంత్రం. ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు.. హుజ‌రాబాద్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి. …

Read More »

కేటీఆర్ భేటీ.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా?

తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓట‌మి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయ‌కుల‌ను పార్టీ కార్యాల‌యానికి పిలిపించుకుని భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా బేటీకి అంద‌రూ రావాల‌ని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను త‌ప్పిస్తే.. మిగిలిన వారిలో మ‌రో ముగ్గ‌రు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మ‌ల్లారెడ్డి(మేడ్చ‌ల్‌), …

Read More »

ప‌వ‌న్‌ను బీజేపీ మోసం చేసిందా?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీతో చేతులు క‌లిపి ముందుకు వెళ్లిన బీజేపీ.. పొత్తు ధ‌ర్మాన్ని విస్మ‌రించిందా? ప‌వ‌న్‌కు భారీ షాకే ఇచ్చిందా? నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడ‌తా! అన్న చందంగా వ్య‌వ‌హ‌రించి.. మొత్తానికే మోసం చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీతో పొత్తులో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎనిమిది ఇచ్చేందుకు …

Read More »

తెలంగాణ‌పై కాంగ్రెస్ ముద్ర‌.. 40 ఏళ్ల‌లో గెల‌వ‌ని స్థానాల్లోనూ!!

తెల‌గాణ‌పై కాంగ్రెస్ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపించింది. కేవ‌లం అధికారంలోకి రావ‌డ‌మే కాదు.. ఎవ‌రూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు ఒకింత ఎక్కువ‌గానే కాంగ్రెస్ త‌న స్థిర‌త్వాన్ని నిల‌బెట్టుకుం ది. తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొనే ప‌రిస్థితి నుంచి తెలంగాణ అధికారాన్ని కైవ‌సం చేసుకునే ప‌రిస్థితి వ‌డివ‌డిగా అడుగులు వేసింది. మొత్తం 119 స్థానాల్లో మేజిక్ ఫిగ‌ర్ 60 దాటుకుని.. మ‌రో 4అద‌నంగా త‌న బ్యాగ్‌లో వేసుకుంది. మొత్తానికి సుస్థిర‌మైన ప్ర‌భుత్వ‌మే …

Read More »