చూసి నేర్చుకునే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సాటి మరెవరూ లేరు. ఆయన ఎక్కడా చిన్న బుచ్చుకోరు కూడా. ఏ స్థాయిలో ఉన్నా.. ఆయన గత అనుభవాలను నెమరు వేసుకుంటారు. పొరుగు వ్యక్తులను కూడా చూసి.. ఎలా ఉండాలో .. ఎలా ఉండకూడదో నేర్చుకోవడంలోనూ ఆయన వెనుకంజ వేయరు. ముఖ్యంగా వైసీపీ హయాంను కళ్లారా చూసిన చంద్రబాబు.. ఎలా ఉండకూడదో నేర్చుకుంటు న్నారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని జాగ్రత్తలు …
Read More »ఏపీకి తెలంగాణ డిప్యూటీ సీఎం.. మ్యాటరేంటి?
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి సత్సంబంఠధాలే కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రతిపాదిస్తున్న బానకచర్ల ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య రచ్చ రాజుకుంటోంది. నదుల అనుసంధానంలో బానకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకమైదని, దీనితో ఏపీలో నదుల అనుసంధానం దాదాపుగా పూర్తి అయినట్టేనని, అంతేకాకుండా రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే తమ అనుమతి లేకుండా బానకచర్లను ఎలా కడతారంటూ తెలంగాణ ఇప్పుడిప్పుడే గళం విప్పుతోంది. …
Read More »మా నాన్నకు కేన్సర్.. ఏమైనా జరిగితే: ముద్రగడ కుమార్తె
వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం(రెడ్డి) కుమార్తె క్రాంతి తాజాగా సంచలన పోస్టు పెట్టారు. తన తండ్రి పద్మనాభం కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారని తెలిపారు. ఈ విషయం తనకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారా తెలిసిందన్నారు. దీంతో ఆయన తనను వెంట బెట్టుకుని తన తండ్రిని చూసేందుకు తీసుకువెళ్లారని క్రాంతి పేర్కొన్నారు. కానీ, అక్కడ తన సోదరుడు గిరి అడ్డుకున్నట్టు వెల్లడించారు. “నా …
Read More »వైసీపీలో గుసగుస: ఈ సలహాలు ఇస్తోందెవరు ..!
వైసీపీ అధినేతగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో నాయకుల మధ్య చిత్రమైన చర్చ సాగుతోంది. “ఈ సలహాలు ఇస్తోందెవరు? జగన్‌ను నడిపిస్తోందెవరు? “ అని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గత వారంలో రెండు కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. అయితే.. రెండు కార్యక్రమాలు కూడా.. పార్టీకి ప్లస్ కాకపోగా.. మైనస్ అయ్యాయి. పైగా.. వ్యతిరేకత మరింత పెరిగేలా కూడా చేశాయి. ఈ వ్యవహారమే పార్టీలో చర్చకు దారితీసింది. అంతేకాదు.. …
Read More »ఇంటరెస్టింగ్!… ఒకే వేదికపై రేవంత్, మల్లన్న!
అదేంటో గానీ రాజకీయాల్లో అనుకుంటే ఏదైనా సాధ్యమే. కాదనుకుంటే ప్రతిదీ దుస్సాధ్యమే. నిజమే మరి.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీలో ఉంటూ పార్టీ పరువు తీసేలా వ్యవహరించారంటూ నోటీసులు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ… ఆ తర్వాత ఆయనపై ఏకంగా బహిష్కరణ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ను మల్లన్న పెద్దగా పట్టించుకున్నట్లే లేరు. ఎందుకంటే తన పనేదో …
Read More »పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలే: జనసేన
ఏపీలో అధికార కూటమిలో కీలక బాగస్వామి అయిన జనసేన తన శ్రేణులకు ఓ హెచ్చరికతో కూడిన సూచనను చేసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ లైన్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కూడా ఆ పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎంకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేరిట శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ …
Read More »కాళేశ్వరంలో ఏం జరిగిందో వారికి మాత్రమే తెలుసు: ఈటల
తెలంగాణలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణకు తాజాగా బీజేపీ నాయకుడు, అప్పటి బీఆర్ ఎస్ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. సుమారు రెండు గంటలకుపైగా విచారణ కమిషన్ ఆయనను ప్రశ్నించింది. అయితే.. లోపల ఏం జరిగిందన్న విషయం తెలియదు కానీ.. బయటకు వచ్చాక ఈటల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు …
Read More »ఆరోపణలకు ఆధారాలు ఉండాలి: కేటీఆర్‌కు సుప్రీం నోటీసులు
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయనపై సీఐడీ కేసు ఉంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఆరోపణలు చేసే ముందు.. ఆలోచన ఉండాలని.. అదేవిధంగా ఆధారాలు కూడా ఉండాలని పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందా? అని ప్రశ్నించడం గమనార్హం. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ఆరోపణలపై వివరణ …
Read More »కొత్త నిర్ణయం: ఏపీలో `షైనింగ్ స్టార్` అవార్డులు..
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్స హించేందుకు నడుం బిగించింది. కొత్తగా `షైనింగ్ స్టార్` అవార్డులను ప్రకటించింది. వీటిని 10, ఇంటర్ చదవి విద్యార్థులకు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు.. విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఈ …
Read More »నాడు ‘లడ్డూ’ తయారీకి వాడింది నెయ్యే కాదట!
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా ఓ మంచి గుర్తింపు ఉంది. తిరుమల లడ్డూకు ఉన్న రుచి మరే లడ్డూకు రాదు. రాబోదు కూడా. భక్త కోటి మహా ప్రసాదంగా పరిగణించే వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీకి ఎంపిక చేసిన విక్రయదారుల నుంచే దినుసులను టీటీడీ కొనుగోలు చేస్తుంది. 2019 దాకా అంతా బాగానే జరిగినా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పుణ్యమా అని తిరుమల లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యి …
Read More »ట్రంప్ తో కిరికిరి.. ఒక్కరోజే 12 లక్షల కోట్లు ఆవిరి!
అమెరికాలో రాజకీయ రంగంలో మాటల యుద్ధం షేర్ మార్కెట్‌ను తాకుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య తెరపైకి వచ్చిన వివాదం టెస్లా షేర్లను మట్టికరిపించింది. ఒక్కరోజే టెస్లా షేర్లు 14 శాతం వరకు క్షీణించడంతో, కంపెనీ మార్కెట్ విలువ నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యింది. ఇది టెస్లా చరిత్రలోనే రోజు వ్యవధిలో వచ్చిన అతిపెద్ద నష్టం. 2024 చివరినుంచి తిరిగి ట్రాక్‌లోకి …
Read More »జూన్ 12న ఏపీలో మామూలుగా ఉండదు!
నిజమేనండోయ్… ఈ నెల 12న ఏపీలో మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదంటే ఏమిటీ? అంటారా? ఆనాడు ఏపీలో నెలకొనే సంబరాలకు సరిపడ పేరు తట్టడం లేదు మరి. అందుకే ఆ రోజు ఏపీలో మామూలుగా ఉండదని మాత్రం చెప్పగలం. అయినా ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటారా? జూన్ 12న ఏపీలో కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తి అయ్యి… కూటమి పాలన రెండో ఏడాదిలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భాన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates