కేసుల సుడిలో చిక్కుకున్న వైసీీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సోమవారం సాయంత్రం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆసుపత్రి నుంచి ఆయనను పోలీసులు నేరుగా బెజవాడ జిల్లా జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో వంశీకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యంతర బెయిల్ ఆసుపత్రిలో చికిత్స వరకే కొనసాగుతుందని, చికిత్స పూర్తి కాగానే …
Read More »జనం వద్ద ఇంకా రూ.2 వేల నోట్లు వున్నాయా
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమానిటైజేషన్ కూడా ఒకటి. అన్నింటికంటే కూడా ఈ నిర్ణయమే అతి పెద్దదని కూడా చెప్పాలి. ఈ నిర్ణయంతో అప్పటిదాకా ఉన్న రూ.100, రూ.500 నోట్లు రద్దు కాగా…కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే రూ.100, రూ.500 నోట్లను మార్చిన తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. జనం వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను …
Read More »5 కాదు 11.. కేసీఆర్ వ్యూహమేంటీ?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన వ్యూహాన్ని సడెన్ గా మార్చేశారు. బీఆర్ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, నాణ్యతా ప్రమాణాలపై ఏర్పాటు అయిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఈ నెల 5న కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు అయ్యేందుకు కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నా… ఎందుకనో గానీ సోమవారం ఆయన తన …
Read More »అభివృద్ధిలో తెలంగాణ కంటే ఏపీ అద్భుతం: తెలంగాణ ఎంపీ
తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ …
Read More »తిరువూరు డ్రామా కు తెరపడింది
ఏపీలో స్థానిక సంస్థల పాలక వర్గాలు వరుసబెట్టి వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలకు షిప్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నా కూడా ఆయా పురపాలికలకు చెందిన మెజారిటీ సభ్యులు వైసీపీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే విశాఖ, తిరుపతి వంటి కీలక నగరపాలక సంస్థలు టీడీపీ వశం కాగా… తాజాగా కృష్ణా జిల్లా పరిధిలోని తిరువూరు నగర పంచాయతీ కూడా …
Read More »‘గంజాయి బ్యాచ్ ను పరామర్శించనున్న జగన్’
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుండి సడెన్ గా గుంటూరు జిల్లా తెనాలి పర్యటనను ప్రకటించారు. మంగళవారం నాటి జగన్ పర్యటనకు సంబంధించిన నిర్ణయాన్ని వైసీపీ సోమవారం ఉదయం ప్రకటించింది. ఇటీవలే బహిరంగంగా ముగ్గురు యువకులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జాన్ విక్టర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారట. ప్రస్తుతం అతడిని పరామర్శించేందుకు జగన్ తెనాలి పర్యటనకు వెళుతున్నారు. జాన్ విక్టర్ …
Read More »కీలక ఓటు బ్యాంకు సంతృప్తి.. జగన్‌కు ఛాన్స్ తక్కువే!
ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకు సంతృప్తితోనే ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఏపీలో ప్రభుత్వాన్ని మార్చగల శక్తిగా కొన్ని వర్గాలను రాజకీయ నాయకులు పేర్కొంటారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు.. యువత.. గ్రామీణులు కీలకం. మధ్యతరగతి వారు ఉన్నా.. వారు పోలింగ్ బూత్ వరకు వస్తారో రారో.. అనేది చెప్పడం కష్టం. సో.. వారిని దాదాపు ఎలిమినేట్ చేస్తారు. దీంతో సాధారణంగా మహిళలను, ఉద్యోగులను, యువతను, గ్రామీణులను మాత్రమే ఓటు …
Read More »కేసీఆర్‌కు అచ్చిరాని ‘బీ’-ఆర్‌ఎస్?
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటు చాలా ఎక్కువ. ఆయన హేతువాది అని ఎక్కడా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. కమ్యూనిస్టు భావజాలం కొంత మేరకు ఉన్నా.. అవి ఆయన సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నికల సమయంలో యాగాలు చేసినా.. ఆయన సెంటిమెంటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క ఎన్నికల సమయం అనేకాదు.. అసలు ఆది నుంచి కూడా సెంటిమెంటుకు పెద్ద పీట వేశారు. …
Read More »జూన్ 4పై పవన్ మార్కు పవర్ పంచ్ డైలాగ్
జూన్ 4… ఆ రోజు ఏపీలో రాజకీయంగా పెను ప్రకంపనలే సంభవించనున్నాయి. ఇప్పటికే విపక్ష వైసీపీ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించింది. కూటమి పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ దిశగా ఆ పార్టీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. అయితే అదే రోజున కూటమి పార్టీలకు కూడా అత్యంత ముఖ్యమైన రోజే. ఎందుకంటే… ఆ రోజే వైసీపీ పాలనకు తెర పడి కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెడుతూ …
Read More »పశ్చిమ బెంగాల్ పోలీసులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం..
మీరు చదివింది నిజమే. ఆంధ్రప్రదేశ్‌కు చాలా దూరంగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, అక్కడి పోలీసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా మీరు పాటించే లౌకికత్వం?” అంటూ నిప్పులు చెరిగారు. లౌకికత్వం అంటే అందరికీ సమానంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరి విషయంలో లౌకికత్వం కవచంగా మారుతోందని, మరికొందరి విషయంలో ఖడ్గంగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. “ఇదేం పోలీసింగ్?” అంటూ …
Read More »ఎమ్మెల్సీ ఓకే!… మంత్రి పదవి ఎప్పుడు?
తెలంగాణలో అదికార పార్టీ కాంగ్రెస్ లో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మంత్రివర్గ విస్తరణ అదుగో, ఇదుగో అంటూ అధిష్ఠానం కాలయాపన చేస్తున్న కొద్దీ కొత్తగా ఆశావహులు చేరిపోతున్నారు. ఫలితంగా మంత్రి పదవుల కోసం పోటీ ఓ రేంజిలో పెరిగిపోతోంది. ఈ పోటీ, నేతల మధ్య మాటల తూటాలు.. ఇవేవీ పట్టని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. …
Read More »జగన్ వాహనాలకు ఈరోజు తో చెక్
ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థ ఆదివారం నుంచి పూర్తిగా మారిపోయింది. మొన్నటిదాకా వాహనాల ద్వారా జరిగిన రేషన్ సరుకుల పంపిణీకి స్వస్తి చెప్పిన కూటమి ప్రభుత్వం… పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల వద్దే రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఫలితంగా ఏపీవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభోత్సవాలు కోలాహలంగా జరిగాయి. జనం రేషన్ డీలర్ల షాపులకు ఉత్సాహంగా తరలివచ్చి తమ రేషన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates