Political News

వైసీపీలో ‘మార్పు’ కోసం వెయిటింగ్‌?!

వ్య‌క్తిగ‌తంగా అయినా.. సంస్థాగతంగా అయినా.. అప్‌డేష‌న్‌(ఆధునీక‌ర‌ణ‌) అనేది కీల‌కం. ఇక‌, రాజ‌కీయాల్లోనూ నూత‌న నిర్ణ‌యాలు.. నూత‌న పంథాల‌ను ఎంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా చేయని పార్టీలు… మ‌నుగ‌డలో లేని విష‌యం.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌కు నోచుకోని విష‌యం మ‌న‌కు తెలిసిందే. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కాంగ్రెస్ పార్టీనే. అదేస‌మ‌యంలో క‌మ్యూనిస్టు పార్టీలు కూడా. తాము న‌మ్మ‌డిన సిద్ధాంతానికి ప‌రిమిత‌మై.. అప్‌డేట్ కాకుండా.. ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణుల‌తో మ‌మేకం కాని నేప‌థ్యంలో …

Read More »

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు.. చంద్ర‌బాబుపై నింగినంటిన అభిమానం!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు చాలా ఏళ్ల త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. 2014లో ఆయ‌న అప్ప‌టి విభ‌జిత ఏపీ ముఖ్య‌మంత్రిగా గెలిచిన త‌ర్వాత‌.. ఒక‌సారి, 2015లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎల్ బీ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు మ‌లి సారి ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. త‌ర్వాత‌.. అప్ప‌టి సీఎం కేసీఆర్ తో విభేదాలు.. ఓటు కు నోటు కేసు.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు.. త‌దిత‌ర అంశాల‌తో …

Read More »

మోడీకి బాబు మ‌రింత విశ్వాస‌పాత్రుడయ్యారే: నేష‌న‌ల్ టాక్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి చంద్ర‌బాబు మ‌రింత విశ్వాస పాత్రుడు అయ్యారా? ఏపీ సీఎంపై మోడీకి మ‌రింత వాత్స‌ల్యం పెరిగిందా? అంటే.. జాతీయ మీడియా క‌థ‌నాలు ఔన‌నే చెబుతున్నాయి. దీనికి కార‌ణం.. మోడీ ద‌గ్గ‌ర చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరేన‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామ్య పార్టీలుగా ఉన్న జేడీయూ, ఎల్జీపీ వంటివి.. త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ.. ప‌ట్టుబ‌డుతు న్నాయి. వ‌చ్చే బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే దీనిని చ‌ర్చించాల‌ని కూడా.. …

Read More »

అడ్డంగా ఇరుక్కున్న మార్గాని భరత్

అధికారంలో ఉండగా ఏం చేసినా చెల్లుతుంది. కానీ అధికారం పోగానే తాడు కూడా పామై చుట్టుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అదృష్టం కలిసొచ్చి 2019లో వైసీపీ వేవ్‌లో రాజమండ్రి ఎంపీగా గెలిచేసిన మార్గాని భరత్.. గత ఐదేళ్లలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నాడు. పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అంటూ ఆయన మీద తరచుగా విమర్శలు వచ్చేవి. ఆయన పబ్లిసిటీ పిచ్చి గురించి చాలాసార్లు …

Read More »

ఢిల్లీ మీడియా ప్రశ్నలు – ఆ డెవిల్ తరిమేశాం అన్న బాబు

Chandrababu

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉండి తిరిగొచ్చారు. రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న శుక్ర‌వారంతో ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ మీడియాతో ఢిల్లీలో మాట్లాడారు. ఏపీలో స‌మ‌స్య‌ల‌పై మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టిస్తామ‌న్నారు. 2014-19 మ‌ధ్య చేప‌ట్టిన ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తిలో కీల‌క‌మైన ఐకానిక్ భ‌వ‌న స‌ముదాయాన్ని పూర్తి చేయ‌డం …

Read More »

కలిశెట్టి .. తొలి జీతం అమరావతికే !

2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి అభివృద్ది పనులు ఆగిపోయాయి.చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి కావడంతో రాజధాని అమరావతికి మంచిరోజులు వచ్చాయి. ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం పలువురు స్వచ్చంధంగా సొంత నిధులు ఇస్తున్నారు. తాజాగా విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి అభివృద్ది కోసం తనవంతు చేయూతనిచ్చారు. లోక్ సభ సభ్యుడుగా అందుకున్న తొలి నెల వేతనం రూ. …

Read More »

1000 కోట్ల మైలురాయి సాధ్యమేనా

బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తున్న కల్కి 2898 ఏడి రెండో వారంలోనూ దూకుడు కొనసాగించనుంది. నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ప్రకారమే ఫస్ట్ వీక్ ని 700 కోట్లతో ముగించిన ప్రభాస్ ఇప్పుడు వెయ్యి కోట్ల మైలురాయి మీద కన్నేశాడు. ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే పుష్కలంగా ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వారం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా నోటెడ్ రిలీజులు లేవు. తెలుగులో …

Read More »

పిన్నెల్లి బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్ట‌మే: జ‌గ‌న్‌కు స‌మాచారం

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వ్య‌వ‌హారం ముదురు తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌స్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే.. ఆయ‌న‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు వైసీపీ శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా నెల్లూరు కు వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రామ‌కృష్ణా రెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాదులో మాట్లాడారు. బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు ఏమైనా చేయాల‌ని వారి కోరారు. …

Read More »

అర్దరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు !

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌కి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే గురువారం అర్దరాత్రి కాంగ్రెస్‌లోకి తీర్దం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. ఎమ్మెల్సీలు మీడియా కంట పడకుండా వెనుక గేట్‌ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి …

Read More »

అమిత్ షాకు చెప్పడం వెనక అంతర్యమేంటి ?!

‘ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతున్నాం. ఆరో తేదీన మంచి వాతావరణంలో ఇరువురు ముఖ్యమంత్రులం చర్చించుకుంటున్నాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పాను’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంధర్భంగా ‘మీరు సమస్యలు పరిష్కరించుకుంటామంటే మా సహకారం ఉంటుంది’ అని అమిత్ …

Read More »

పొలిటికల్ టాక్: పవన్‌తో అంత వీజీ కాదు

పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో అప్పుడప్పుడూ ఆవేశంగా మాట్లాడుతుంటాడు.. సవాళ్లు చేస్తుంటాడు కానీ.. ఆయనకు కక్ష సాధింపు రాజకీయాలు ఇష్టముండదని.. పనిగట్టుకుని ఎవరినీ టార్గెట్ చేయడని అంటారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ వాళ్ల మీద ప్రతీకార దాడులు జరుగుతుంటే.. వాటిని నివారించడానికే పవన్ చూశాడు. ఒకటికి రెండుసార్లు అలాంటి చర్యలకు వెళ్లొద్దని టీడీపీ, జనసేన వాళ్లకు పిలుపునిచ్చాడు. తాజాగా పిఠాపురంలో కూడా ప్రతీకార దాడులు వద్దనే చెప్పాడు. అలా అని పవన్ అన్నింటినీ …

Read More »

జగన్ ఏమీ మారలేదుగా

151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన ఐదేళ్లకు కేవలం 11 సీట్లకు పడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతటి ఘనవిజయం తర్వాత ఇంతటి ఘోర ఓటమికి ఎందుకు ఎదురైంది అని వైసీపీ ఆత్మావలోకనం చేసుకుంటుందని.. పొరబాట్లు దిద్దుకుని ముందుకు సాగుతుందని అనుకుంటాం. ముఖ్యంగా ఈ ఓటమికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే అని.. ముందు ఆయనే మారాలని స్వయంగా వైసీపీ నేతలు, కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. కానీ …

Read More »