మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రైతు రుణమాఫీని పూర్తిచేసి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీకి కూడా ఆయన గడువు పెట్టారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. అంటే కేవలం మరో నెల రోజులు మాత్రమే దీనికి గడువు ఉంది. ఆ తర్వాత ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం …
Read More »కేంద్ర బడ్జెట్ పైనే చంద్రబాబు కోటి ఆశలు..!
ప్రస్తుతం రాష్ట్రంలో ఏం చేయాలన్నా డబ్బులతో ముడిపడి ఉంది. పోలవరం కట్టాలన్నా.. అమరావతి రాజధాని నిర్మించాలన్నా.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని పట్టాలు ఎక్కించాలన్నా.. వెనుకబడిన జిల్లాలను ఆదుకుని అభివృద్ధి పనులు చేయాలన్నా.. ఏ రూపంలో చూసినా నిధులతో అయ్యే పనులే ఉన్నాయి. కానీ రాష్ట్ర ఆదాయాన్ని చూస్తే ఆ స్థాయిలో లేదు. పోనీ ఇప్పటికిప్పుడు ధరలు పెంచుదామా? అంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించి జగన్మోహన్ రెడ్డిని …
Read More »కేతిరెడ్డి ఓటమి.. అసలు విషయం గుర్తుచేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చాలామంది అంచనా వేశారు కానీ.. ఆ పార్టీ మరీ 11 సీట్లకు పరిమితం అవుతుందని మాత్రం అనుకోలేదు. బాగా పని చేశారు అని పేరున్న ఎమ్మెల్యేలు సైతం చిత్తయి పోవడం ఆశ్చర్యం కలిగించింది. అలా ఆశ్చర్యపరిచిన ఫలితాల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానిది ఒకటి. ఇక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాగా పని చేశాడని చాలామంది చెబుతుంటారు. సోషల్ మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ …
Read More »విభజన సమస్యలు.. కొన్ని రాజకీయాలు.. ఏం జరుగుతోంది..?
ఏపీ తెలంగాణల మధ్య భజన అంశానికి సంబంధించి అనేక సమస్యలు పేరుకు పోయాయి. మరి ఈ సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఇటీవల జరిగిన సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, సమస్యలు పరిష్కారానికి కమిటీలను వేస్తున్నామని ఇరు రాష్ట్రాల మంత్రులు.. భట్టి విక్రమార్క, అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. దీంతో ఎంతో కొంత పరిస్థితి బాగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ …
Read More »కేటీఆర్ నటిస్తున్నారా.. భ్రమలో ఉన్నారా?
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఆ పార్టీ నేతలే కాదు.. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నట్లే ఉంది. తాజాగా బీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒకరైన కల్వకుంట్ల తారక రామారావు.. ఏపీలో వైసీపీ ఓటమి పట్ల తెగ ఆశ్చర్యపోయారు. ఐతే ఏపీలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఎప్పటికప్పుడు సంకేతాలు అందుతూనే ఉన్నా.. ఆ పార్టీ నేతలు దాన్ని గుర్తించలేకపోయారు. కేవలం బటన్లు …
Read More »పవన్ కల్యాణ్ది ట్రైలరే.. సినిమా ముందుందంట..!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? కేవలం సమస్యలు తెలుసుకుని వదిలేస్తున్నారా? ఆయా శాఖలలో ఏం జరుగుతోంది? ఆయా శాలఖలో ఆర్థిక పరిస్థితి ఏంటి? అని తెలుసుకుని మౌనంగా కూర్చున్నారా? ఇదీ ఇప్పుడు జరుగుతున్న చర్చ. కానీ, ఆయనకు నాలుగు శాఖలు ఇచ్చారు. పంచాయతీరాజ్, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక విభాగాలను కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఇవి తనకు నచ్చిన శాఖలని, తన మనసును హత్తుకున్న శాఖలని …
Read More »ఎన్నికల తర్వాత వైసీపీలో తొలివేటు !
ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలయింది. సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డ నెల రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తొలి వేటు వేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం అయ్యాడని సస్పెన్షన్ వేటు వేసింది. కదిరి శాసనసభ స్థానం …
Read More »షర్మిలకు రేవంత్ బిగ్ టాస్క్.. సక్సెస్ అవుతారా..?
ఏపీ పీసీసీచీఫ్ షర్మిలే సీఎం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం 2.86 శాతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కనీసం 50 శాతానికి పుంజుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందా నాయకులు కలివిడిగా ముందుకు సాగుతున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. సహజంగా ఏ పార్టీ అయినా …
Read More »కేసీఆర్కు అష్టకష్టాలు… కళ్లముందే కనిపిస్తున్నాయా?
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. “కెసిఆర్ కు ముందుంది ముసళ్ళ పండగ” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అంతరార్థం చాలా తీవ్రంగానే కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ పరంగా ఆరుగురు ఎమ్మెల్యేలను అదే సంఖ్యలో ఎమ్మెల్సీలను కూడా రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నారు, కాంగ్రెస్ …
Read More »వారసత్వ పోరులో షర్మిల ముందంజ…!
వారసత్వ పోరులో షర్మిల ముందంజలో ఉన్నారా? వైయస్ 75వ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించి జాతీయ స్థాయిలో ఆమె గుర్తింపు పొందారా? రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగేలా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారా? అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం.. వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించినా.. ఇప్పుడు వదిలేశారు. గత ఐదేళ్లలో రైతు దినోత్సవంగా పేరు …
Read More »జగన్ మళ్లీ గెలిచి ఉంటే.. 17 వేల కోట్లు వేసేసేవారా?
వైసీపీ ప్రభుత్వ 2019 – 24 మధ్య కాలంలో విద్యుత్ ను అడ్డు పెట్టుకుని ప్రజల రక్తం పీల్చిందని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాజాగా ఆయన విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో విద్యుత్ చార్జీల పెంపు, ఏయే రూపంలో ఎలాంటి భారం మోపారు? ఎంత మేరకు నిధులు రాబట్టారు? అనే కీలక విషయాలను చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్లలో… 9 …
Read More »మీడియా మిత్రులకు చంద్రబాబు సాఫ్ట్ కౌంటర్!
ఏపీ సీఎం చంద్రబాబు మీడియా మిత్రులకు షాక్ ఇచ్చారు. వారిని ఉద్దేశించి.. నవ్వుతూనే చురకలు అంటించారు. తాజాగా చంద్రబాబు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. అదేవిధంగా ఉచిత ఇసుక విధానాన్ని కూడా సమీక్షించారు. ఈ రెండు అంశాలపైనా ఆయన మీడియా మీటింగ్ పెట్టి.. వాటిని వివరించారు. రాష్ట్రంలో ఇసుక విధానంలో సమగ్రమైన మార్పును తీసుకు వచ్చామన్నారు. పేదలకే కాకుండా.. మధ్యతరగతి వర్గాలకు కూడా ఇసుకను ఉచితంగా అందించాలన్న …
Read More »