ఇటీవల అనారోగ్యంతో బాధపడి కోలుకున్న ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆయనను ఆత్మీయంగా పలకరించారు. సభలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాజకీయ హుందాతనానికి ఉదాహరణగా నిలిచింది. సభా కార్యక్రమాల మధ్యలో బొత్స సత్యనారాయణను ఉద్దేశించి “బొత్స సత్యనారాయణ గారు నమస్కారం” అంటూ మంత్రి లోకేష్ పలకరించారు. ఆయన వినకపోవడంతో మండలి చైర్మన్ జోక్యం చేసుకుని …
Read More »తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల చిచ్చు!
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో తాజాగా పరకాల నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 2023లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ నుంచి రావూరి ప్రకాశ్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గంపై కన్నేసిన మంత్రి కొండా సురేఖ కుటుంబం తాజాగా మరింత దూకుడు ప్రదర్శించింది. పరకాల గడ్డపైనే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు …
Read More »తిరుమలలో కేక్ కటింగ్ ఏంటమ్మా మాధురి?
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతపై ఇప్పటికే చర్చ సాగుతున్న నేపథ్యంలో దీనికి మరింత సెగ పెంచేలా.. గురువారం పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ కొత్త జంట.. తిరుమల శ్రీవారి ఆలయం మహా గోపురం ముందు..ఫొటో , వీడియో షూట్ చేసుకుంది. దీంతో పాటు.. కొందరు యూట్యూబర్లు.. ఇక్కడే రీల్స్ చేశారు. ఈ ఘటనలపై తీవ్ర విమర్శలు రావడంతో తిరుమల తిరుపతి అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో …
Read More »నామినేషన్లు వేశారు.. మరి వాళ్ళ సంగతి?
తెలంగాణలో రాజ్యసభ సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. రెండు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ, సీఎం సలహాదారు.. వేం నరేందర్‌రెడ్డి గురువారం రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఎన్నికలు ఈ నెల 16న జరగనున్నాయి. ఎలానూ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బలం ఉంది కాబట్టి.. వీరి గెలుపు కూడా లాంఛనమే. ఇద్దరూ పెద్దల సభకు వెళ్లడం కూడా ఖాయమే. అయితే.. …
Read More »రప్పా రప్పా.. ఇక చాలని చెప్పు జగన్!
వైసీపీ కార్యకర్తలు అభిమానంను పేరుగా చెప్పుకుని చేస్తున్న రాద్ధాంతం అరాచకానికి దారి తీస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు రప్పా రప్పా పోస్టర్లు ప్రదర్శిస్తూ, రప్పా రప్పా నినాదాలతో హంగామా చేస్తున్నారు. అయితే దీనిని ఆపాల్సిన జగన్ కూడా వారిని చూసి ఆనందిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పైగా ఇందులో తప్పేంటని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇది సమాజంలో జగన్‌కే మైనస్ అవుతుందని సొంత పార్టీ నేతలే …
Read More »కేసీఆర్, రేవంత్ ను ఒకేసారి ఎలా ప్రేమిస్తావ్ కడియం?
బీఆర్ ఎస్ పార్టీ తరఫున 2023లో విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కు మద్దతుగా మారిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 8 మంది ఎమ్మెల్యేల విచారణనే స్పీకర్ ప్రసాదరావు పూర్తి చేశారు. మిగతా ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ వాయిదా పడుతూ వస్తోంది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఇద్దరిపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ …
Read More »పిల్లలనుకంటే పాతిక వేలు: బాబు గారి కొత్త పథకం
రాష్ట్రంలో జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో జనాభా అంశంపై గురువారం జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి జరగాలన్నా, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, సామాజిక సమతుల్యం పెరగాలన్నా జనాభాను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇప్పుడు జనాభా విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలిపారు. అందుకే ఒక పిల్లో పిల్లాడో ఉంటే చాలనుకునే దంపతులు 57 శాతం మంది …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ ఎలా ఉంటుందంటే..
వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు వారు హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారు ఇంట్లోనే కూర్చుంటామంటే ప్రజలు కూడా వారిని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెట్టే రోజులు వస్తాయని విమర్శించారు. సభకు రావాలని తామంతా కోరుతున్నామని చెప్పారు. “ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలి. జగన్‌కు అవసరమైతే ప్రజలను వెళ్లి …
Read More »పాడిన పాటే పాడుతోన్న అంబటి
సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు కేసుల్లో పీటీ వారెంట్ పై రాజమండ్రి జైల్లో 18 రోజులు ఉన్న అంబటి…కోర్టుకు హాజరయ్యే సమయంలో తగ్గేదేలే అంటూ పుష్ప మాదిరి మేనరిజంతో చెప్పడం చర్చనీయాంశమైంది. జైలుకు వెళ్లినా భయపడేదే లేదని అంబటి ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా …
Read More »ఇరాన్ యుద్ధంపై మోదీ స్పందన.. ఇంత ఆలస్యమెందుకు?
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా యుద్దం ప్రకటించడం.. ఇరాన్ కూడా బలంగానే పోరాటం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలు దేశాలు రెండుగా చీలిపోయాయి. రష్యా, చైనాలు ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. ఇక, పాకిస్థాన్ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థను ఎదుర్కొంటోంది. యుద్ధం వద్దంటే.. అమెరికాకు కోపం.. కావాలంటే ఇరాన్‌కు కోపం.. …
Read More »వైసీపీ హయాంలో మొక్కలు కూడా స్వేచ్ఛ కోల్పోయాయి: పవన్
వైసీపీ హయాంలో ప్రజలతో పాటు మొక్కలు, చెట్లు కూడా స్వేచ్ఛ కోల్పోయాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అటవీ శాఖపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు, చెట్ల దుస్థితిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రహదారుల విస్తరణ పేరుతో మొక్కలను, చెట్లను తొలగిస్తున్నారని, అలా తొలగించిన వాటిని వేరే ప్రాంతంలో నాటాలని సూచించారు. ఈ క్రమంలో కీలక చర్చను …
Read More »విజయ్ ఒంటరి పోరే… ఛాన్స్ లాగేసిన సీఎం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ.. కొన్నాళ్ల కిందటి వరకు చెప్పుకొచ్చిన నటుడు విజయ్ ప్రకటించారు. ఈయన స్థాపించిన తమిళ వెట్రి కగళం(టీవీకే) పార్టీ ఒంటరి పోరునే ఎంచుకుందని పదే పదే ప్రకటించారు. తమిళ ప్రజల కోసం.. నిలబడతామని కూడా తెలిపారు. అయితే.. పరిణామాలు అన్నీ ఒకేలా ఉండవు కదా.. బీజేపీ సహా.. అధికార పార్టీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates