Political News

జ‌గ‌న్ కు ఆ అనుమతులు ఇవ్వొద్దు: ష‌ర్మిల డిమాండ్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు.. అస‌లు ప్ర‌జ‌ల స‌మీక‌ర‌ణ‌ల‌కు జ‌గ‌న్‌కు అనుమ‌తి ఇస్తే.. తామే కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో జ‌రిగిన దారుణంపై జ‌గ‌న్‌లో ఎలాంటి ప‌శ్చాత్తాపం క‌నిపించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారు ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగేందుకు అనుమ‌తి ఇస్తే.. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేకుండా …

Read More »

పిచ్చివేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తాం: పవన్ కల్యాణ్

ప్రతిపక్ష హోదాకు సరిపడినన్ని సీట్లు కూడా దక్కించుకోలేని వైసీపీ ఇప్పటికీ తన దుర్మార్గాలను వీడలేదని, తాను అధికారంలో ఉండగా… ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ఇప్పుడూ అదే చేస్తోందని జనసేనాని, ఏపీ డిప్యేటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వాస్తవ పరిస్థితిని గుర్తించి పద్దతి మార్చుకుంటే సరేనని… లేదని పిచ్చి వేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కూటమి పాలనకు …

Read More »

ఎన్నికల్లో గెలిచింది కూటమి పార్టీలు కాదు… : నారా లోకేష్

గ‌త 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూటమి పార్టీలు కాదు, ప్ర‌జ‌లే గెలిచార‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ హ‌యాంలో ఐదు సంవ‌త్స‌రాలు.. బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని గ‌డిపిన ప్ర‌జ‌లు కూట‌మి వైపు ఏక‌ప‌క్షంగా నిలిచార‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. వారంతా సుఖ శాంతుల‌తో జీవిస్తున్నార‌ని పేర్కొన్నారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌శ్నించినా.. స‌మ‌స్య ల‌పై స్పందించినా… లాఠీలు విరిగాయ‌ని.. జైళ్లు నిండిపోయాయ‌ని అన్నారు. …

Read More »

ఆ ‘భూతం’ ఇక అధికారంలోకి రాదు: చంద్రబాబు

వైసీపీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టారు. ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను బెదిరించారన్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన బ్యాటరీల కంపెనీని కూడా బెదిరించారని.. దీంతో వారు తెలంగాణకు వెళ్లి.. అక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. …

Read More »

‘పెద‌నాన్న‌’ స్కూలుకు లోకేష్ రిబ్బ‌న్ క‌టింగ్‌!

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ తొలిసారి.. త‌న పెద‌నాన్న‌తో క‌లిసి వేదిక‌ను పంచుకున్నారు. మాజీమంత్రి, ప‌రుచూరు మాజా ఎమ్మెల్యే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. నారా లోకేష్‌కు సొంత పెద‌నాన్న‌ అన్న విష‌యం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. లోకేష్ మాతృమూర్తి భువ‌నేశ్వ‌రికి సోద‌రి. అంటే ఆమె లోకేష్‌కు పెద్ద‌మ్మ‌. ఆమె భ‌ర్తే.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈయ‌న కూడా సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా …

Read More »

ఇకపై పోలీసులు చూస్తూ ఊరుకునేలా లేరు

నిజమే… ఏపీలో ఇకపై విపక్షం వైసీపీ పప్పులు ఉడకవ్. ఆ పార్టీ ఇష్ఠారాజ్యంగా వ్యవహరించడానికి కూడా వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ఒకే ఒక్క ఘటనతో వైసీపీ నేతలు, శ్రేణులకూ అర్థమైపోయింది. ఇకపై ఏ పని చేయాలన్నా పోలీసులు ఇచ్చిన అనుమతులు, విధించే ఆంక్షలకు లోబడే వైసీపీ నేతలు, శ్రేణులు ముందుకు సాగక తప్పదు. ఇందుకు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ జరిగిన ఘటనే …

Read More »

ఓరుగ‌ల్లు కాంగ్రెస్‌కు ‘కొండంత’ భారం!

వ‌రంగ‌ల్‌గా పిలుచుకుని ఓరుగ‌ల్లు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సీనియ‌ర్ల నుంచి పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. వ్య‌క్తిగ‌త వైష‌మ్యాలు.. వివాదాలు.. ముసురుకున్న నాయ‌క‌త్వం.. ఒక‌రి పై ఒక‌రు మాట‌ల యుద్ధాన్ని చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రి కొండా సురేఖ‌, ఆమె భ‌ర్త కొండా ముర‌ళీధ‌ర్ ల‌పై స్థానిక సీనియ‌ర్ నాయ‌కులు ఎలుగెత్తారు. “వారు కావాలో.. మేం కావాలో తేల్చుకోండి!” తేల్చుకోవాల‌ని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు …

Read More »

గుజరాత్‌లోనే మోదీకి షాక్ ఇచ్చిన ఉప ఎన్నికలు!

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి భారీ షాక్ తగిలింది. అంతేకాదు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ బీజేపీ ఓడిపోయింది. కేవలం ఒక్కే ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో మోదీతో నిత్యం వివాదాలు సాగించే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అటు గుజరాత్‌లోను, ఇటు తమ పాలన సాగుతున్న పంజాబ్‌లోను ప్రజలు ఆప్ అభ్యర్థులను గెలిపించారు. …

Read More »

ఈయనతో కాంగ్రెస్ కు కష్టమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి… పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న …

Read More »

విచార‌ణ‌కురా బాబూ.. చెవిరెడ్డి కుమారా

వైసీపీ నాయ‌కుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వసూలు చేసిన న‌గ‌దును విదేశాల‌కు త‌రలించే ప్ర‌క్రియ‌లో చెవిరెడ్డి పాత్ర ఉంద‌న్న‌ది ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు(సిట్‌) చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా …

Read More »

ష‌ర్మిల అక్కడ ఫైల్ అవుతున్నారు

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఇటు కూట‌మి ప్ర‌భుత్వం, అటు ప్ర‌ధాని మోడీ, మ‌రోవైపు.. సొంత సోద‌రుడు జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి స‌ర్కారు, ప్ర‌ధాని మోడీ సంగ‌తి ఎలా ఉన్నా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విరుచుకు ప‌డుతున్నారు. స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తున్నారు. అయితే.. ఈ సంద‌డిలో ప‌డిన ఆమె.. పార్టీ కార్య‌క్ర‌మాల‌పై ఒకింత సీత‌క‌న్నేశారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు పార్టీలో …

Read More »

అప్రూవర్‌గా కృష్ణంరాజు.. సాక్షికి ఉచ్చు?

వైసీపీ అధినేత జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో అమరావతి రాజధానిని “వేశ్యల రాజధాని” అంటూ చేసిన తీవ్ర వివాదాస్పద, దారుణ వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అప్రూవర్‌గా మారేందుకు అనుమతి కోరారు. “ఉన్నది చెప్పేస్తా. నన్ను వదిలేయండి!” అని పోలీసుల ముందు ఆయన వేడుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును మూడు రోజుల పాటు అమరావతిలోని తుళ్లూరు పోలీసులు విచారించారు. అయితే మొదటి రోజు …

Read More »