దక్షిణాది రాష్ట్రం తమిళనాడుకు గత కొంతకాలంగా గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎన్ రవి నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. నిన్నటిదాకా తమిళనాడులోని అదికార డీఎంకే నిర్ణయాలను వ్యతిరేకించిన కారణంగా ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిస్తే… ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని ఆయన ఏకంగా ఆపకుండా 51 పుషప్స్ తీశారు. అదేదో ఆయన ఇంటిలో తీసి వీడియో విడుదల చేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. యోగా డేను పురస్కరించుకుని ఏర్పాటు …
Read More »బనకచర్ల పై బీజేపీ తేల్చేనా
బనకచర్ల… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన వ్యవహారంగా మారిన సాగు, తాగు నీటి ప్రాజెక్టు. అసలు చిత్రం ఏంటంటే దీనికి సంబంధించిన ప్రణాళికే ఇంకా సిద్ధం కాలేదు. కేవలం ఇది నోటి మాట పైనే ఉంది. కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేరవేసింది అంతే. కేంద్రం ఓకే అంటే ఆ తర్వాత అసలు పనులు ప్రారంభం అవుతాయి. అంటే ప్రాజెక్టు ప్రయోజనాలు, బనకచర్ల గ్రామం (కర్నూలు …
Read More »జగన్ పై అభిమానం.. తల్లిదండ్రులకు శాపమా?
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తల్లులకు ఎనలేని ప్రేమ ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతారు. దీనికి కారణం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో 15 వేల రూపాయలు చొప్పున ఏటా పిల్లల చదువులకు వెచ్చించింది. ఆ నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోనే వేసింది. అంతేకాదు …
Read More »ఉల్లిగడ్డతో జగన్ ను ఉతికేసిన బాబు!
విపక్ష నేత అంటే… ప్రభుత్వం చేస్తున్న పనులపై నిత్యం నిఘా ఉంచుతూ అందులోని తప్పొప్పులను చెబుతూ సాగాలి. ఈ తరహా విపక్ష నేతలు ఇప్పుడు లేరనే చెప్పాలి. ప్రభుత్వం ఏ పని చేసినా దానిని భూతద్దంలో చూసి మరీ లేని తప్పులను పట్టేసి మరీ విమర్శలు గుప్పించే విపక్ష నేతలే ఇప్పుడున్నారు. ప్రత్యేకించి ఏపీలో ఈ తరహా మరీ పెరిగిపోయిందని చెప్పాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఏకంగా …
Read More »కృష్ణంరాజు సాక్షి గురించి ఏం చెప్పారంటే
రాజధాని అమరావతిని వేశ్యలతో పోల్చుతూ.. తీవ్ర వివాదాస్పద, దారుణ వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణం రాజును పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటల వరకు విచారించారు. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేయడంతో మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని.. దీనిని …
Read More »అజ్జూ భాయ్ దమ్ము చూశారా..?
అజ్జూ భాయా?… ఆయన ఎవరు? అంటారా? ఈ తరానికి పెద్దగా గుర్తుండకపోవచ్చు గానీ… పాత తరానికి మాత్రం ఆయన ఓ సూపర్ డూపర్ క్రికెట్ హీరో. అంతేకాదండోయ్… జెంటిల్మన్ గేమ్ లాంటి క్రికెట్ కు ఫిక్సింగ్ మకిలీ అంటించిన వారిలో ఈయన ఒకరుగా అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. ఇదంతా గతం అయితే… ఇప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ లో మహ్మద్ అజారుద్దీన్ పేరు మారుమోగిపోతోంది. క్రికెట్ ను వీడిన నాటి నుంచి కాంగ్రెస్ …
Read More »ఈ ఒక్క YCP MP పాస్ అయ్యాడు
వైసీపీ నాయకులు అంటే ఒక విధమైన ఏవగింపు ప్రజల్లో కనిపిస్తోంది. నోరు విప్పితే బూతులు.. ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే.. మైకులు సైతం సిగ్గుపడేలా వారి మాటలు ఉంటాయనే టాక్ తరచుగా ప్రత్యర్థుల నుంచి వినిపిస్తుంది. అధికారంలో ఉండగా.. న్యూడ్ వీడియోలు చేసిన ఎంపీ ఒకరైతే.. మంత్రులుగా ఉంటూ.. బొచ్చు-బొకడా అంటూ కామెంట్లు చేసిన వారు.. ఆడు-ఈడు అంటూ.. నోరు చేసుకున్న వారు ఉన్నారు. పోనీ.. ప్రతిపక్షంలోకి వచ్చినా ఏమైనా మార్పుందా? …
Read More »‘చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మోదీకే సాధ్యం’
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నింటా యోగాసనాలు వేస్తూ జనం ఉల్లాసంగా కనిపించారు. ఇక యోగా దినోత్సానికే నాందీ పలికిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం 11న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకున్నారు. ఇందుకోసం శుక్రవారమే విశాఖ చేరుకున్న మోదీ… శనివారం ఉదయమే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రముఖులతో కలిసి యోగా …
Read More »కూటమికి ప్రజలిచ్చిన మార్కులు ఇవే!
ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన బాగుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. 51 శాతం మంది ప్రజలు ప్రభుత్వ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా రైజ్ అనే సంస్థ ఏడాది కూటమి పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. దీనికి సంబంధించిన రిపోర్టును శుక్రవారం విడుదల చేసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు? పాలన తీరు ఎలా ఉంది? మంత్రులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయం …
Read More »బాబు మాత్రమే కట్టగలరు!
ఏపీ రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుండుగుత్తగా అమరావతినే కోరుకుంటున్నారు. ఈ విషయం తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టంగా తెలిసింది. ప్రస్తుతం రాజధాని అమరావతి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. మూడు రాజధానులు అంటూ.. జగన్ గత తన పాలనలో ఎలుగెత్తారు. కానీ, ప్రజలు మాత్రం నూటికి నూరు శాతం అమరావతి వైపే మొగ్గు చూపారు. చంద్రబాబు మాత్రమే అమరావతి కట్టగలరని వంద శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. తాజా …
Read More »పట్టుబట్టి.. రికార్డు కొట్టిన చంద్రబాబు!
ఒక కృషి-ఒక పట్టుదల ఉంటే విజయం దానంతట అదే వరిస్తుందని చెప్పడానికి తాజాగా విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవమే పెద్ద ఉదాహరణ. దీనిని ప్రపంచ దేశాలు మెచ్చేలా చేయాల ని.. గిన్నిస్ రికార్డు సాధించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నెల రోజుల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆయన ఆహ్వానించారు. దీంతో …
Read More »ప్రభాకర్ రావు వల్ల సంసారాలు పాడైపోయాయి
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం కరీంనగర్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. సిరిసిల్లతోపాటు ఫోన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates