మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ కొలువు దీరనుంది. భారీ విజయం నమోదు చేసుకున్న టీడీపీ కూటమి ఈ సభలను అత్యంత గౌరవంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కీలక నేతకు స్పీకర్ బాధ్యతలు ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. పేరు బయటకు రాకపోయినా.. రెండు రోజుల్లో దీనిపైనా క్లారిటీ రానుంది. ఆ వెంటనే .. స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. …
Read More »పింఛను దారులు లక్కీ.. నెలకు 4 వేలు!
రాజకీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియదు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాలకు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కేవలం నెలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛను మొత్తంపై ఆధారపడే అవ్వలు, తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఏపీలో పండగే పండగ. ఈ నెల 1వ తేదీ వరకు కూడా.. రూ.3000 మాత్రమే పింఛను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000లకు చేరుకున్నారు. …
Read More »700 కోట్లు మింగేసిన గొర్రెలు? ఈడీ కేసు
తెలంగాణలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ వ్యవహారం.. వివాదంగా మారింది. ఈ పంపిణీ పథకంలో అవినీతి చోటు చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఏసీబీ అధికారులు దీనిపై గత నెల రోజులుగా సైలెంట్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారు జరిపిన విచారణ సంచలనంగా మారి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా 700 కోట్ల రూపాయల మేరకు మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించారు. …
Read More »జగన్ మారలేదు.. బ్రో!
ఒక ఓటమి నాయకుల్లో మార్పు తీసుకువస్తుంది. ఒక పెద్ద ఘోర పరాజయం పార్టీలను మార్పు దిశగా అడుగులు వేయిస్తుంది. ఇది మనకు 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ.. ఇప్పటికి ఆ పార్టీ లో వచ్చిన మేలిమి మార్పును కళ్లకు కడుతుంది. అనేక మంది వివాదాస్పద నాయకులకు చంద్రబాబు చెక్ పెట్టారు. తనను తాను ప్రజలకు మరింత చేరువ చేసుకున్నారు. ప్రజల నాడి పట్టుకున్నారు. తన ఆలోచనలకు విరుద్ధమే అయినా.. …
Read More »ఐఏఎస్ లకు క్లాస్ తీసుకున్న బాబు
“ప్రభుత్వాలు శాశ్వతం కాదు. అధికారులుగా మీరు 30 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేస్తారు. కానీ, గడిచిన ఐదేళ్లలో మీరు ఎవరికి చేశారో.. ఎందుకు అలా చేశారో.. ఎవరిని అణిచేశారో..ఎందుకు అణిచేశారో.. ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోండి” అని ఏపీలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులకు నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఉన్నతా ధికారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగానే …
Read More »‘ఔను.. మా నోటి దూలే ఓడించింది’
తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం ఆ పార్టీలోని కీలక నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. అయితే.. పైకి మాత్రం అందరూ గుంభనంగా ఉంటున్నారు. కానీ, ఒకరిద్దరు మాత్రం ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. వీరిలో కీలక నాయకుడు, నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన.. మాజీ మంత్రి అనిల్ కుమార్.. ఒకరు. ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు …
Read More »పవన్ కోసం ఎవరూ బొకేలు, శాలువాలు తేవద్దు
త్వరలోనే తాను జిల్లాల పర్యటనకు రానున్న జనసేన అధినేత, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతేకాదు.. తనను కలిసేందుకు వచ్చేవారు ఎవరూ కూడా బొకేలు.. శాలువాలు తీసుకురావద్దని ఆయన విన్నవించారు. ఈ మేరకు తాజాగా ఆయన నోట్ విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు గోల్డెన్ సిగ్నేచర్స్!!
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేయగా.. అనంతరం.. మంత్రులతో భేటీ అయి.. భవిష్యత్తుపై వారితో చర్చించారు. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత.. గురువారం సాయంత్రం నాటికి విజయవాడకు తిరిగి వచ్చారు. ఇక్కడి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం.. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు సరిగ్గా పండితులు నిర్ణ …
Read More »జగన్ గురించి ఇకపై నోరెత్తను: ఆర్ఆర్ఆర్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై నిత్యం సటైర్లతో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ నాయకుడు, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను ఎట్టి పరిస్థితిలోనూ జగన్ గురించి మాట్లాడబోనని అన్నారు. ఆయనపై సటైర్లు కూడా వేయబోనని తేల్చి చెప్పారు. “జగన్ గురించి మాట్లాడను. ఆయనను అనుకరించను. ఆయన గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్“ అని తేల్చి …
Read More »ఇంకా పరదాలు అలవాటు వదలని అధికారులు
ఏపీ సర్కారులో గత ఐదేళ్లుగా కొన్ని అలవాట్లకు అలవాటు పడిన అధికారులు.. ఇంకా వాటిని వదిలించుకోలేక పోతున్నారు. పదేపదే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెబుతున్నా.. సదరు పాత వాసనలను వారువదిలి పెట్టలేక పోతున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత.. చోటు చేసుకున్న రెండు కీలక పరిణామాలపై ఇప్పుడు సర్కారు కూడా తీవ్రంగా స్పందించింది. దీనిలో ప్రధానంగా.. పరదాలు కట్టడం. రెండోది ట్రాఫిక్‌ను గంటలకొద్దీ నిలిపి వేయడం. …
Read More »ఇది కదా జగన్ బాబు ని చూసి నేర్చుకోవలసింది
ఏపీలో చంద్రబాబు మార్కు పాలన ప్రారంభమైంది. ఆయన ఎన్నికల సమయంలో వైసీపీ నేతలపై ఎలాంటి విమర్శలు చేసినా.. వ్యాఖ్యలు చేసినా.. ఇప్పుడు మాత్రం చాలా పద్ధతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా నిర్ణయాల్లో సరళత్వం చోటు చేసుకుంటోంది. వివాదాలకు దూరంగా.. విచక్షణకు దగ్గరగా చంద్రబాబు నిర్ణయాలు కనిపిస్తున్నాయి. తాజాగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే… గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యాకానుక పథకం …
Read More »ప్రధాని మోడీ చిరు తో ఏమన్నారంటే
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయిపట్టుకుని చిరంజీవి వద్దకు వెళ్లి ఇద్దరి చేతులు కలిపి పైకెత్తి ప్రజలకు అభివాదం చేసిన దృశ్యాలు నిన్నటి నుండి వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా వేదిక మీద చిరంజీవి ఎంతో ఎమోషన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అంతే ఎమోషనల్ గా పెట్టిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ …
Read More »