టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఎవరికైనా పదవులు ఇచ్చినా.. ఎవరికైనా అవకాశాలు కల్పించినా.. వారి నుంచి మరింత ప్రయోజనం ఆశిస్తారు. ఇది సహజం. రాజకీయాలైనా వ్యాపారమైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆదాయాన్ని కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ఆ పార్టీ ప్రయోజనాలు.. ఆ పార్టీకి సంబంధించిన అనుకూల అంశాలను కోరుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆది నుంచి జరుగుతున్న వ్యవహారం. ఈ రకంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు చంద్రబాబునాయుడు ఏరుకోరి పదవి అప్పగించారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో గ్రీష్మ ఎమ్మెల్యే టికెట్ ఆశించారని చర్చ జరిగింది. అయితే కొంత పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం మండలిలో బలమైన వాయిస్ వినిపించేవారు ఉన్నప్పటికీ.. మరింత బలమైన వాయిస్ వినిపించేవారు కావాలి. అదేవిధంగా రఫ్ గా వ్యాఖ్యలు చేసేవారు.. రఫ్ గా దూకుడుగా వ్యవహరించే వారు కావాలని చంద్రబాబు ఆసలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కావలి గ్రీష్మను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం.
టిడిపి నిర్వహించిన ఒంగోలు మహానాడులో ఆమె తొడ కొట్టి మరి వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది చంద్రబాబు నాయుడును ఆకర్షించింది. దీంతో ఆమెకు ప్రమోషన్ చేస్తూ మండలిలో నియమించారు. ఆమె బలమైన వాయిస్ వినిపించాలని కోరుకున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇది జరిగి 5, 6 నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా గ్రీష్మ కనీసం మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ లోపు అనేక పరిణామాలు జరిగాయి. జగన్ యాత్రలకు సంబంధించిన వివాదాలు, రైతులకు సంబంధించిన అంశాలు తెరమీదికి వచ్చాయి.
యూరియాకి సంబంధించిన అంశాలు వచ్చాయి. ఉల్లిపాయలకి సంబంధించిన విషయాలు వచ్చాయి. తాజాగా వైద్య కళాశాలకు సంబంధించిన అంశాలు కూడా తెరమీద కు వచ్చాయి. ఇన్ని విషయాలు వచ్చినప్పటికీ కూడా గ్రీష్మ పార్టీ తరపున వాయిస్ వినిపించడం కానీ తనదైన శైలిలో ఎదురుదాడి చేయడం కానీ అనేది ఎక్కడ కనిపించలేదు. వినిపించలేదు. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఆవిడ కోరుకున్నది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దీనికి సమాధానం అయితే లేదు.
కానీ, భవిష్యత్తులో ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారనేది చూడాలి? మరి కొద్ది రోజుల్లో శాసన మండలి ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రీష్మపై పార్టీ మంచి ఆశలు పెట్టుకుంది. బలమైన వైసీపీ గళాన్ని ఎదుర్కొనేందుకు గ్రీష్మ లాంటి రఫ్ గా వ్యవహరించే నాయకురాలు ఉపయోగపడతారని భావిస్తోంది. మరి ఆవిడ ఈ విషయంలో సక్సెస్ అవుతారా లేకపోతే మైనస్ అవుతారా అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates