వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ.. విజయవాడ లోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనను రెండు రోజుల పాటు విచారించేందుకుఅనుమతి ఇచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి డిస్టరీల నుంచి సొమ్ములు వసూలు చేయడంలోనూ.. టార్గెట్లు నిర్ణయించడంలోనూ ముఖ్య పాత్ర పోషించినట్టు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని మరింతలోతుగా విచారించాలని కోరుతూ.. సిట్ అధికారులు గతంలోనే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పలు దఫాలుగా విచారణ కూడా సాగింది. తాజాగా ఆయనను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ.. కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ సందర్భంగా పోలీసులకు పలు షరతులు విధించింది.
ఇవీ షరతులు..
1) ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలి.
2) విచారణ సమయంలో కొట్టడం.. తిట్టడం.. వంటివి చేయరాదు.(గతంలో ఆరోపణలు వచ్చాయి)
3) మానసిక వేధింపులకు గురి చేయొద్దు.
4) విచారణ సమయంలో ఆయనకు విరామం ఇవ్వండి.
5) రెండు పూటలా ఆయన కోరుకున్న ఆహారం ఇవ్వాలి.
6) విచారణ సమయంలో మిథున్ రెడ్డి న్యాయవాదిని అనుమతించాలి.
7) విచారణ మొత్తాన్నీ ఆడియో, వీడియో రికార్డులు చేయాలి.
8) ఈ కేసు విచారణలో సంబంధం లేని వ్యక్తులు విచారణలో జోక్యం చేసుకోరాదు.
9) సిట్ నియమించిన అధికారులు మాత్రమే మిథున్ రెడ్డిని విచారించాలి.
సిట్ రాబట్టే అంశాలు ఏంటి?
1) మద్యం కేసులో ముడుపులు వసూలు చేయాలని ఎవరు చెప్పారు?
2) ఏడిస్టిలరీకి ఎంత టార్గెట్ విధించారు.
3) దుబాయ్ తదితర దేశాల్లో ఎందుకు సిట్టింగులు వేశారు?
4) ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటి?
5) గత ఎన్నికల్లో ఓటర్లకు ఈ నిధులు పంపిణీ చేశారా?
6) అంతిమంగా ఈ కేసులో లబ్ధి పొందింది ఎవరు?
Gulte Telugu Telugu Political and Movie News Updates