ఏపీ పీసీసీ చీఫ్.. మాజీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ ఇవ్వనుందా? ఆమె సేవలకు గుర్తుగా.. మరింత బాధ్యతలు అప్పగించనుందా? ఆమెను గౌరవప్రదమైన పదవిలోకి పంపనుందా? అంటే.. తాజాగా జరిగిన పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సోమవారం షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకులు.. సోనియాగాంధీ, రాహు ల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలుసుకున్నారు. వారి నివాసానికి వెళ్లిన షర్మిల.. సుమారు రెండుగంటల పాటు …
Read More »జాగ్రత్త పడుతున్న జగన్..
ఎన్నికల ఫలితాల్లో బొక్క బోర్లా పడ్డా వైసీపీ అధినేత జగన్.. ఇన్నాళ్లకు వాస్తవం గ్రహించారు. పార్టీ అంటే.. కేవలం సంక్షేమ పథకాలు కాదని.. పార్టీ అంటే.. నాయకులని ఆయన గుర్తించినట్టున్నారు. ఈ క్రమంలోనే నాయకులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. తాజాగా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశానికి జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల 19న తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి …
Read More »ఏపీ అసెంబ్లీ కొలువుకు ముహూర్తం ఫిక్స్!
ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మంత్రులు.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలవరం నుంచి తన పనిని ప్రారంభించారు. దీంతో దాదాపు కూటమి ప్రభుత్వం పని ప్రారంభించేసినట్టయింది. అయితే.. ఇంకా ఐదారుగురు మంత్రులు బాధ్యతల స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నెల 19న మంచి రోజు కావడంతో ఆ రోజు.. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కందుల దుర్గేష్ …
Read More »మాజీ సీఎంకు బీజేపీ మరో ఆఫర్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ మరో ఆఫర్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసిన కిరణ్ కుమార్ ఓటమి పాలయ్యారు. తన రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఓటమి కోసం కిరణ్ కుమార్ గట్టిగానే కష్టపడ్డా కానీ ఫలితం లేకపోయింది. ఒకవేళ కిరణ్ కుమార్ ఎంపీగా గెలిస్తే మోడీ కేంద్ర కేబినేట్లో ఆయనకు …
Read More »విశాఖపై బాబు ఫోకస్.. రంగంలోకి లోకేశ్!
విశాఖపట్నం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నగరం. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిపాలన రాజధానిగా విశాఖను చేసుకుని రుషికొండ ప్యాలెస్ నుంచి పాలన నిర్వహిద్దామనుకున్నారు. కానీ బ్యాడ్‌లక్. ప్రజలు ఓట్లతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. రాజకీయ, ఐటీ, పారిశ్రామిక రంగాల పరంగా కీలకమైన విశాఖపై ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిసింది. పొలిటికల్‌గా ఇక్కడ మరింత బలోపేతంపై ఫోకస్ పెట్టిన ఆయన …
Read More »ఎలా జస్టిఫై చేసుకుంటావ్ జగన్?
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు అధికారం చెలాయించిన వైఎస్ జగన్ సర్కారు… తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చేసిన పనులన్నీ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారి ఆ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. 2019లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన ఇంట్లో వినియోగిస్తున్న ఫర్నిచర్ విషయంలో ఎలా కేసులు పెట్టి వేధించారు, చివరికి ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి తీసుకొచ్చారు అన్నది తెలిసిందే. ఇప్పుడు మాజీ సీఎం …
Read More »జగన్ ఇంటి ముందు కూల్చివేత.. వెనుక ఆ మంత్రి!
అక్కడ ఏపీలో జగన్ పార్టీ ఓడిపోగానే ఇక్కడ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ముందు జీహెచ్ఎంసీ కూల్చివేతలు సంచలనంగా మారాయి. లోటస్‌పాండ్‌లోని నివాసం ముందు సెక్యూరిటీ రూమ్‌లు, ఇతర నిర్మాణాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ వాటిని కూల్చివేసింది. కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కూల్చివేతలు చేపట్టారని సంబంధిత అధికారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ నిర్మాణాలను కూల్చడం వెనుక ఓ తెలంగాణ …
Read More »వైసీపీలో పడుతున్న వికెట్లు.. !
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఎప్పుడు ఏక్షణంలో ఎవరు పార్టీని వీడుతారో అనే భయం పార్టీ నేతలను వెంటాడుతోంది. గెలిచిన వారిలోనూ ఒకరిద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన పార్టీలో ఉండడం అనుమానంగానే ఉంది. విరూపాక్షి ఇప్పటికే టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన దీనిని ఖండించారు. తనకు సీటు ఇచ్చి.. …
Read More »జగన్ ఇంటి వద్ద ప్రైవేటు సైన్యం !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తాడేపల్లిలోని తన ఇంటినే సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగించుకోవడంతో ఇక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జగన్ ఇంటి దగ్గర ఆంక్షలు ఎత్తేశారు. దీంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఇన్నిరోజులు ఆంక్షలు ఉండటంతో.. ఇబ్బందులు …
Read More »రాధాకు బాబు గిఫ్ట్ అదే!
టీడీపీని నమ్ముకుని, అధినేత చంద్రబాబు నాయుడుపై అభిమానంతో ఎలాంటి పదవులు లేకపోయినా, టికెట్ రాకపోయినా పార్టీలో కొనసాగిన వంగవీటి రాధా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతోందని తెలిసింది. రాధాకు బాబు గిఫ్ట్ ఇవ్వబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆయన్ని చట్టసభలకు పంపేందుకు బాబు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. ఎమ్మెల్సీగా తొలి జాబితాలోనే రాధా పేరును చంద్రబాబు ఫైనల్ చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కూటమి విజయం కోసం …
Read More »‘రుషికొండ ‘ లీలలు చాలానే ఉన్నాయ్: నారా లోకేష్
విశాఖపట్నంలో రుషికొండ పై మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్‌ను ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకువెళ్లి పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోపల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి… ఎలాంటి విలాసవంతమైన భవనాలు ఉన్నాయి? అనే విషయాలు వెలుగు చూశాయి. నిజానికి ఈ నిర్మాణం గత మూడేళ్లలో చేపట్టినా.. పురుగును కూడా పోనివ్వనంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే.. …
Read More »ఊపిరి పీల్చుకున్న ‘తాడేపల్లి’..!
మాజీ సీఎం జగన్ నివాసం ఉంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లా శివారు ప్రాంతం తాడేపల్లి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత ఐదేళ్లుగా ఇబ్బంది పడిన ఇక్కడి ప్రజలకు తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు ఉన్న రహదారి అందుబాటులోకి వచ్చింది. జగన్ ఆక్రమించుకున్న రోడ్డు నుంచి, ప్రజలకు విముక్తి లభించింది. ప్రజలు వాడుకోవలసిన రోడ్డుని, ఆక్రమించి… తన ప్యాలెస్ ముందు పేదలు ఉండటానికి వీలు లేదని, జగన్ వాళ్ళ ఇళ్లు తీసేయించిన …
Read More »