Political News

చ‌ర్చ‌లంటూనే.. లీగ‌ల్ ఫైటా..

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య చోటు చేసుకున్న జ‌ల వివాదంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. దీనిపై న్యాయ‌ప‌ర‌మైన పోరాటానికి సిద్ధం కావాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఎలా వెళ్లాలి? ఏం చేయాల‌నే దానిపై న్యాయ‌వాదుల నుంచి, అదేవిధంగా అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ నుంచి అభిప్రాయాలు తీసుకుని ఒక ఫైల్ రెడీ చేయాల‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి జ‌ల‌వ‌న‌రుల‌శాఖ అధికారులను ఆదేశించారు. దీనికి రెండు రోజులే గ‌డువు విధించారు. …

Read More »

రేవంత్ రెడీ అవుతుండగానే హైకోర్టు తీర్పు!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ ఎన్నికలకు సంబందించిన ఓ ప్రకటన విడుదల అయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో అయితే ఈ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికన్న ప్రచారమూ జరిగింది. అయితే రిజర్వేషన్ల ఖరారు భారీ కసరత్తుతో కూడుకున్నది కదా… అందుకే ఓ మోస్తరు ఆలస్యం అవుతోంది. ఇలాంటి క్రమంలో …

Read More »

వైసీపీకి దేవినేని ద‌బిడి… దిబిడి!

ప్ర‌చారం మంచిదే.. కానీ.. వికృత ప్ర‌చారం.. అది కూడా ప‌రాకాష్ఠ‌కు చేరితే.. అది తీవ్ర ప‌ర్య‌వ‌సానాల‌కు దారి తీస్తుంది. ఇప్ప‌డు వైసీపీ విష‌యంలోనూ అదే జ‌రిగింది. తాజాగా టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యం వైసీపీ జెండా క‌ప్పుకొన్నారు. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి రాజ‌కీయ జీవితం వారిది. ఎక్క‌డ బాగుంటుంద‌ని అను కుంటే అక్క‌డ‌కు వెళ్తారు. ఎవ‌రి వేదిక వారిది. అయితే..ఇదే అదునుగా వైసీపీ …

Read More »

ఎమ‌ర్జెన్సీకి.. మోడీకి సంబంధ‌మేంటి?.. తెలుసా?

దేశంలో 1975, జూన్ 25 అర్ధ‌రాత్రి ఎమ‌ర్జెన్సీ విధించారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కులపై స‌ర్కా రు ఉక్కుపాదం మోపింది. అనేక మంది నాయ‌కుల‌ను అరెస్టు చేసి జైళ్ల‌లో కూడా పెట్టారు. చిత్రం ఏం టంటే.. ఆనాటి ప్ర‌ధాని ఇందిర.. త‌న సొంత పార్టీ కాంగ్రెస్‌కు చెందిన వారిని కూడా జైలుకు పంపించింది. త‌న‌ను వ్య‌తిరేకించిన వారు, ఎమ‌ర్జెన్సీని త‌ప్పుబ‌ట్టిన వారు.. ఎంత‌టి వారైనా స‌రే.. జైల్లో మ‌గ్గాల్సిందే …

Read More »

పవన్ 2 లక్షల పుస్తకాల వెనుక అసలు స్టోరీ ఇదే!

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎంత చెయ్యాలో అంత చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే పవన్ మీద ఎన్నెన్ని దుష్ప్రచారాలు చేసిందో లెక్కలేదు. పవన్ గురించి సోషల్ మీడియాలో వెటకారాలు ఆడడానికి ఉపయోగించే విషయాల్లో ఆయన పుస్తక పఠనానికి సంబంధించిన రూమర్ ఒకటి. తాను 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పవన్ …

Read More »

ఇంటింటికీ బటన్ నొక్కే పని – జగన్ కొత్త అలోచన

ఏపీలో అధికార కూటమి, విపక్ష వైసీపీల మధ్య నిత్యం రాజకీయ మంటలు రాజుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వ అసమర్థత పై ప్రశ్నిస్తానంటూ వరుస ప్రకటనలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. క్యూఆర్ కోడ్ తో ఇంటింటికీ వైసీపీ అంటూ చెప్పిన జగన్… …

Read More »

ఎమ‌ర్జెన్సీలో అసాధార‌ణ అకృత్యం.. ఎంత ఘోరం అంటే!

ప్ర‌పంచ ప్ర‌జాస్వామ్య దేశాల‌కు త‌ల‌మానికంగా ఉన్న భార‌త్‌లో 1975, జూన్ 25న విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జాస్వామ్య వాదులు.. సమాజ ఉద్ధ‌ర‌ణ సంఘాలు కూడా నాడు అనేక హింస‌ల‌కు గుర‌య్యాయి. నాయ‌కుల‌ను జైళ్ల‌లో బందీలు చేశారు. అంతేకాదు.. ముంబై, అహ్మ‌దాబాద్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌త్యేకంగా జైళ్ల‌ను నిర్మించి మ‌రీ.. ఖైదీల‌ను అందులో పెట్టారు. ఇప్ప‌టికీ.. ఇవి నాటికి గుర్తుగా ఉన్నాయి. ఇవి అత్యంత ఇరుకైనా జైళ్లుగా …

Read More »

జ‌గ‌న్‌ పై కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కూట‌మి..

జగన్ దూకుడుకి కళ్లెం ఎలా వేద్దాం? ఇదీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కీలక చర్చ. విపక్షంలో ఉండగా సాధారణంగా ప్రజల మధ్యకు రావడం అనేది పార్టీలకు అవసరం. దాన్ని ఎవరు కాదనలేని విషయం కూడా. అయితే జగన్ పర్యటనలకు భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుండడం, తీవ్రస్థాయిలో యువత కూడా వస్తున్న నేపథ్యంలో కొన్ని వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. పొదిలి పర్యటనలో మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు. గుంటూరు …

Read More »

Jr చెవిరెడ్డి కోసం వేటా?, వెయిటింగా?

ఏపీలో పెను కలకలం రేపుతున్న మద్యం కుంభకోణంలో ఏ39గా ఉన్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదలు పెడతారా? లేదంటే మూడు రోజుల పాటు వేచి చూస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం తమ …

Read More »

క‌లిసొచ్చే కాలం అంటే ఇదే బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అన్నీ క‌లిసి వ‌స్తున్నాయి. కేంద్రం నుంచి స‌హ‌కారం అందుతోంది. ప‌నులు వేగం గా పూర్త‌వుతున్నాయి. ప్రాజెక్టుల ప‌నులు సాగుతున్నాయి. అంతేకాదు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా స‌కాలంలో అందుతున్నాయి. ఇలా.. క‌లిసొచ్చే కాలంగా చంద్ర‌బాబుకు అన్నీ స‌కాలంలో జ‌రుగుతు న్నాయి. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన ఫిక్కీ కూడా.. చంద్ర‌బాబుతో క‌లిసి న‌డిచేందుకు, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు వ‌చ్చింది. ఏంటీ ఫిక్కీ.. ఫిక్కీ …

Read More »

కేసులు ఎదుర్కొనే ధైర్యం జ‌గ‌న్ కోల్పోతున్నారా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నారా? ఒక‌ప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కోల్పోయారా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామం.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. అయితే, వాటి విష‌యంలో ఒక‌ప్పుడు 16 మాసాల పాటు జైలుకు వెళ్లిన విష‌యం కూడాఅంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కానీ.. తాజాగా మాత్రం ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు. కేసులు ఎదుర్కొనే ప‌రిస్థితి లేద‌ని గ్ర‌హించారో ఏమో తెలియ‌దు కానీ.. …

Read More »

శంకర్ కలల సౌథం కూలినట్టేనా

గేమ్ ఛేంజర్ దారుణంగా డిజాస్టరయ్యింది. ఇండియన్ 3 రిలీజవుతుందో లేదో కనీసం ఓటిటిలో అయినా వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ఇంతటి సందిగ్ధం మధ్య దర్శకుడు శంకర్ తర్వాతి సినిమాల మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన డ్రీం ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వచ్చిన వేల్పరికి నిర్మాతలు దొరకడం లేదని చెన్నై అప్డేట్. మూడు భాగాలుగా వెయ్యి కోట్ల దాకా బడ్జెట్ డిమాండ్ చేసే ఈ విజువల్ గ్రాండియర్ కోసం చాలా …

Read More »