Political News

ఏపీలో ఆ ‘చైర్మ‌న్’ కుర్చీలు హాటు గురూ… !

కూట‌మి ప్ర‌భుత్వంలో ప‌ద‌వుల కోసం నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. సీట్లు త్యాగం చేసిన వారు ఈ క్ర‌మంలో చాలా ముందున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సీటు త్యాగం చేసిన వారికి స‌హజంగానే చంద్రబాబు హామీలు గుప్పించారు. ఈ క్ర‌మంలో వారు త‌మ సీట్ల‌ను వ‌దులుకున్నారు. ఇలాంటి వారిలో కొంద‌రు మారాం చేసి సీట్లు వ‌దులుకోగా.. మ‌రికొంద‌రు చంద్ర‌బాబు ఇలా చెప్ప‌గానే అలా వ‌దులుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబే చెప్పుకొచ్చిన విష‌యం …

Read More »

జగన్ భయం అదేనా?

Y S Jagan

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల నుంచి ఐదుగురిని లాగేస్తే పది శాతం ఎమ్మెల్యేలు కూడా లేక చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారంటూ ఎద్దేవా చేసిన జగన్.. …

Read More »

టీడీపీలో ప‌ద‌వులు ప్లీజ్‌: జిల్లాకు ఇద్ద‌రు చొప్పున వెయిటింగ్..!

కూట‌మి స‌ర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఎన్నిక‌ల స‌మయంలో సీట్లు ద‌క్క‌ని నాయ‌కులు, సీట్లు త్యాగం చేసిన నాయ‌కులు కూడా.. నామినేటెడ్ ప‌ద‌వుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. హీనాతి హీనంగా వేసుకున్నా.. జిల్లాకు ఇద్ద‌రు చొప్పున ఇలాంటి వారు తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. క‌నీసంలో క‌నీసం.. ముగ్గురు నుంచి న‌లుగురు చొప్పున నాయ‌కులు జిల్లాల్లో ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు. …

Read More »

రాజ‌ధాని రైతుల క‌ష్టాలు తీరేనా..!

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి స్థిర‌ప‌డింది. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది కాబ‌ట్టి.. అమ‌రావ‌తికి ఢోకాలేదు. ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతాయి. కానీ, ఇప్పుడు అస‌లు స‌మ‌స్య రైతుల‌తోనే ఉంది. వారికి దాదాపు ఏడాది కాలంగా నిధులు ఇవ్వ‌డం నిలిచిపోయింది. నిబంధ‌న‌ల మేర‌కు వారికి నెల నెలా పింఛ‌న్లు ఇవ్వాలి. ఇవి ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏటా ఒక‌సారి కౌలు చెల్లించాలి. ఈ విష‌యంలోనే వైసీపీ స‌ర్కారు రైతుల‌ను ప‌క్కన పెట్టింది. వారు …

Read More »

పిఠాపురానికి ప‌వ‌న్ క‌ల్యాణ్.. మూడు రోజులు అక్క‌డే!

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 70 వేల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. వాస్త‌వానికి ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌, మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రెండు సార్లు పిఠాపురం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి షెడ్యూల్ ప్ర‌క‌టించారు. ఈ నెల 25నే ఆయ‌న పిఠాపురం వెళ్తార‌ని తొలుత జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది. త‌ర్వాత‌.. వారాహి అమ్మ‌వారి దీక్ష …

Read More »

జ‌గ‌న్‌కు జ‌గ‌నే శ‌త్రువు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. త‌న‌కు ప్ర‌తిప‌క్ష నేత హోదా క‌ల్పించ‌క‌పోవ‌డం, ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా మంత్రులంతా ఆ ప‌ని పూర్తి చేశాకే త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఈ రోజు గ‌వ‌ర్న‌ర్‌కు రాసిన లేఖ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆల్రెడీ సాక్షి ప‌త్రిక ఇదే వాద‌న చేస్తుండ‌గా.. జ‌గ‌న్ సైతం లేఖ ద్వారా త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. ఐతే …

Read More »

ఇలా అయితే.. అంద‌రూ పోతారేమో కేసీఆర్ గారూ!

ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి నాయ‌కుల జంపింగులు కొత్త‌కాదు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. అలానే దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉన్న రాజ‌కీయాలు రేపు ఉండ‌వు. రేపు ఉన్నవి మ‌రునాడు కూడా ఉండ‌వు. అయితే.. ఎవ‌రు పోయినా.. ఎవ‌రు వ‌చ్చినా.. కీల‌క‌నాయ‌కులు అనేవారిని నిల‌బెట్టుకోవాల్సి ఉంది. ఒక‌వేళ వెళ్లిపోతున్న నాయ‌కుల‌ను పిలిచి మాట్లాడాలి. ఓదార్చాలి. త‌ప్పులు ఎక్క‌డ జ‌రుగుతున్నాయి. వారు ఏం ఆశిస్తున్నారో …

Read More »

స‌ర్కారుతో కాదు.. స‌మ‌స్య‌ల‌పై స‌మ‌రంతోనే బెనిఫిట్ జ‌గ‌న్ స‌ర్‌!

అయిందేదో అయిపోయింది. ప్ర‌జ‌లు తీర్పు చెప్పేశారు. చంద్ర‌బాబు కావాల‌నుకున్నారు. ఏక‌ప‌క్షంగా వేసేశారు. ఇప్పుడు అరుపులు.. గ‌గ్గోళ్లు పెట్టుకుని ప్ర‌యోజ‌నం లేదు. ఇచ్చిన తీర్పున‌కు బ‌ద్ధులై ఉండ‌డం ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రికైనా ప‌ద్ధ‌తి. విధేయ‌త‌. ఈ విష‌యంలో కూట‌మి స‌ర్కారు త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం.. లేఖ‌లు సంధించ‌డం కాకుండా.. బాధ్య‌తాయుత మాజీ ముఖ్య‌మంత్రిగా, అంత‌క‌న్నా బాధ్యతాయుత 40 శాతం ఓట్లు తెచ్చుకున్న కీల‌క పార్టీ అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ …

Read More »

ఏపీ విష‌యంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు!

జ‌గ‌న్ వివాదాస్ప‌ద నిర్ణ‌యాల్లో త‌న‌కు న‌చ్చ‌ని మీడియాపై నిషేధం విధించ‌డ‌మే. అప్ప‌ట్లో 2019-24 మ‌ధ్య‌.. కొన్ని చానెళ్ల‌ను రాష్ట్రంలో ప్ర‌జ‌లుఎవ‌రూ వీక్షించేందుకు వీలు లేకుండా.. సిటీ కేబుల్ ఆప‌రేట‌ర్ల‌పై ఒత్తిడి తెచ్చి.. వాటి ప్ర‌సారాల‌ను నిలుపుద‌ల చేయించారు. దీంతో ఆయా చానెళ్ల యాజ‌మాన్యాలు కోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు కొలువుదీరిన త‌ర్వాత‌.. సీఎం చంద్ర‌బాబుకు తెలిసి జ‌రిగిందో.. తెలియ‌క జ‌రిగిందో తెలియదు కానీ.. …

Read More »

వైసీపీ తొలి అడుగు.. మోడీ వైపా, రాహుల్ వైపా!?

ఏపీలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ.. ప్రాధాన్యం కోల్పోయింది. అయితే.. ఇది రాష్ట్ర స్థాయిలో! కానీ, జాతీయ స్థాయిలో చూసుకున్న‌ప్పుడు మాత్రం వైసీపీకి కొంత మేర‌కు ప్రాధాన్యం ఉంది. న‌లుగురు ఎంపీలు ద‌క్కారు. నిజానికి ఇద్ద‌రు ఎంపీల‌ను ద‌క్కించుకున్న పార్టీలు కూడా.. ప్రాధాన్యం నిల‌బెట్టుకుంటున్నాయి. కేంద్రంలోని జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు వీరిని త‌మ‌కు సాధ్య‌మైనంత ఎక్కువ‌గా ఆక‌ర్షించే ప‌నిలో ఉన్నాయి. తాజాగా లోక్‌స‌భ స్పీక‌ర్ వివాదం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం …

Read More »

జ‌గ‌న్ స‌ర్‌.. మనం గౌర‌విస్తే.. వారూ గౌర‌వించేవారు!

ఏపీ తాజా మాజీ సీఎం జ‌గ‌న్.. అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడికి సుదీర్ఘ లేఖ రాశారు. 11 సీట్లే వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు త‌మ‌ను ప‌క్క‌న పెట్టిన‌ప్పటికీ.. అసెంబ్లీ అయినా.. గౌర‌వించాల‌ని ఆయ‌న కోరారు. అంతేకాదు.. ఇటీవ‌ల త‌న‌ను అవ‌మానించారంటూ పెద్ద బండ‌ప‌డేశారు. మంత్రుల త‌ర్వాత‌.. త‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించార‌ని.. ఇదెక్క‌డి సంప్ర‌దాయ‌మ‌ని ఆయ‌న నిగ్గ‌దీసి నిజం ప్ర‌శ్నించారు. అంతేకాదు.. స్పీక‌ర్ స్థానంలో ఉన్న అయ్య‌న్న పాత్రుడు.. దీనికి …

Read More »

వైసీపీ మాజీ ఎంపీపై కూట‌మి స‌ర్కారు ఫ‌స్ట్ యాక్షన్‌!

కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌పై దృష్టి పెడుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో స‌ర్కారు ద‌న్ను చూసుకుని చెల‌రేగిన చాలా మంది నాయ‌కులు.. భూముల‌ను క‌బ్జా చేసేందుకు య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ.. ప్ర‌ముఖ రియ‌ల్ట‌ర్‌.. సినీ నిర్మాత కూడా అయిన‌.. ఎంవీవీ స‌త్య‌నార‌య‌ణ‌పై విశాఖ‌ప‌ట్నంపోలీసులు నాన్ బెయిలబుల్ కేసు న‌మోదు చేశారు. విశాఖ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో …

Read More »