చంద్రబాబు మారిపోయారు. పూర్తిగా మారిపోయారు. దశాబ్దాల తరబడి ఒకే తీరును ప్రదర్శించే ఆయన ఇప్పుడు కొత్త వెర్షన్ లో కనిపిస్తున్నారు. అధికారం.. ప్రతిపక్షం ఆయనకు అలవాటే అయినప్పటికీ గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన్ను పూర్తిగా మార్చేశాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. బాబులో మార్పు ఎంతన్న విషయం మరింత బాగా అర్థమవుతుంది. ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే కేంద్రంలో చక్రం తిప్పాలన్న తహతహ బాబులో …
Read More »ఆ ఆరుగురు ఎవరు ? .. కొత్త మంత్రుల కొట్లాట !
లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. గత డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పేరుతో ప్రతి పనికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో ఇప్పుడు అందరిదృష్టి మంత్రి పదవుల మీద పడింది. డిసెంబరులో 12 మందిని మంత్రి వర్గంలోకి తీసుకోగా మరో 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రులయ్యే ఆ ఆరుగురు ఎవరు అన్న …
Read More »ఏపీలో ఉచిత బస్సు.. ఎప్పటి నుంచంటే!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైంది.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనినే ఎన్నికలకు ఏడాది ముందు.. నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ఆరు హామీల్లో ఒకటిగా చేర్చారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హామీ ఎప్పుడంటూ చర్చ ప్రారంభమైంది. చంద్రబాబు కూటమి …
Read More »కేసీఆర్ చేస్తే రైటూ.. రేవంత్ చేస్తే రాంగా?
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు! అధికారం ఉంది కదా.. రాష్ట్రంలో అడ్డు ఎవరు? అనే అహంకారంతో సాగే వాళ్లకు కాలమే సమాధానం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలను చేర్చుకుని ఈ పార్టీలను కేసీఆర్ దెబ్బకొట్టారు. ప్రత్యర్థి పార్టీ అనేదే లేకుండా చూడాలనుకున్నారు. కానీ కేసీఆర్‌కు ఇప్పుడు అదే దెబ్బ రిటర్న్‌లో తగులుతోంది. …
Read More »పవన్ షూట్ ఇప్పుడే కాదట
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే పవన్ రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి పెండింగ్‌లో ఉన్న తన సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో పడతాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఫలితాల తర్వాత కథ మారిపోయింది. కూటమి ఘనవిజయం సాధించింది. జనసేన అద్భుత ఫలితాలు రాబట్టింది. పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. నాలుగు మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు. దీంతో సీరియస్‌గా రాజకీయాల …
Read More »జగన్‌పై పులివెందులలో తిరుగుబాటు?
కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఉన్న పట్లు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబం తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. వైఎస్ అయినా, ఆయన వారసుడు జగన్ అయినా.. పులివెందులకు వెళ్లకుండా, ఎన్నికల ప్రచారం కూడా చేయకుండానే అక్కడ ఎన్నికల్లో గెలిచేస్తుంటారు. వారికి భారీ మెజారిటీలు కూడా గ్యారెంటీ. ఐతే ఈసారి మాత్రం ఎన్నికల్లో జగన్‌కు మెజారిటీ కొంచెం తగ్గింది. …
Read More »వైసీపీ వెర్సస్ కూటమి.. అసెంబ్లీలో తేడా క్లియర్
అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో గొడవలు జరిగి అసెంబ్లీ రణరంగంగా మారిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఐతే దశాబ్దాలుగా చూస్తున్న అసెంబ్లీ సెషన్లకు భిన్నమైన దృశ్యాలు గత ఐదేళ్లలో చూశాం. ప్రతిపక్ష నేతల మీద దారుణాతి దారుణంగా వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసి రాజకీయాల మీద జనాలకు అసహ్యం పుట్టేలా చేశారనే విమర్శలను వైసీపీ నేతలు ఎదుర్కొన్నారు. “లోకేష్ ఎలా …
Read More »విధ్వంసం అంటే ఇది కాదు జగన్ !
గుంటూరు జిల్లా శివారులోని తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ.. శనివారం ఉదయం అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. 7 బుల్డోజర్లను వినియోగించి, పటిష్టమైన భద్రత మధ్య ఈ భవనాలను కూల్చేశారు. అయితే.. దీనిపై స్పందించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని.. రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన …
Read More »వైసీపీలో ఫైర్ తగ్గితేనే బ్రాండ్ నిలబడేది…!
వైసీపీలో నాయకుల వ్యవహార శైలి ఎన్నికల్లో ప్రభావం చూపిందనేది వాస్తవం. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. బూతులు మాట్లాడడం.. రెచ్చగొట్టేలా వ్యవహరించడం.. టీడీపీ సీనియర్లపైనా పరుష పదజాలంతో విరుచుకుపడడం ఒక ఫ్యాషన్ అని ఎక్కువ మంది భావించారు. ఇలా చేయడమే రాజకీయ మని అనుకున్నారు. అంతేకాదు.. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో పడాలంటే కూడా.. ఇలానే చేయాలన్న వాదన కూడా బయటకు వచ్చింది. దీంతో కొడాలి నాని, రోజా, …
Read More »శభాష్ స్పీకర్‌గారూ… ఊపిరి పీల్చుకో మీడియా!
ఏపీలో కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మీడియాకు స్వేచ్ఛ కల్పిస్తూ.. ఆయన తొలి సంతకం చేశారు. అసెంబ్లీ కార్యక్రమాలను కవర్ చేయడంలో మీడియాకు ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఆయన తొలగించారు. ప్రతిమీడియాకు స్వేచ్ఛ ఉండాలని.. మీడియా ప్రజల గొంతుకగా ఉండాలని అయ్యన్న ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు సహా.. అసెంబ్లీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను లైవ్‌లో ప్రసారం చేసుకునేందుకు …
Read More »ఇది కదా పవన్ కళ్యాణ్ మార్కు
వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలమంది మహిళల అదృశ్యం మీద గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో వైసీపీ వాళ్లు ఒకప్పటి జనసేనాని ఆరోపణలను గుర్తు చేసి చర్యలు చేపట్టాలంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఐతే అధికారంలోకి వచ్చాక ఇలాంటి విషయాలను నాయకులు మరిచిపోతుంటారు. కానీ పవన్ అలా …
Read More »జనంలోకి రండి సారు.. లేదంటే కారు పరారు
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మహామహులకే పరాజయాలు తప్పలేదు. ఓటమి కారణాలను విశ్లేషిస్తూ, ప్రజల్లో ఉంటూ తిరిగి పార్టీని ఎలా గెలిపించాలన్న దానిపై దృష్టి పెట్టాలి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ దాటి రానంటున్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా అధినేత ఫాం హౌజ్‌లోనే ఉంటానంటే ఎలా అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే ఆందోళన …
Read More »