ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ ప్రయోజనాల కోసం.. జగన్తో చేసుకున్న లాలూచీ రాజకీయాల కోసం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆనాడు సంతకాలు చేశారని, దీనికి అప్పటి జలవనరుల మంత్రిగా హరీష్రావు కూడా సంతకాలు పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అందుకే.. ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం వచ్చినట్టు అయిందన్నారు. గోదావరి జిల్లాలకు సంబంధించి 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఆనాడు కేసీఆర్ రాజీ పడ్డారని …
Read More »రాజా సింగ్కు శివసేన పగ్గాలు?.. హాట్ డిబేట్!
తెలంగాణ బీజేపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తనకు తెలంగాణ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లోపోటీ చేసేందుకు అవకాశం కల్పించలేదన్న కారణంగా ఆయన అలిగి .. తక్షణమే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీపైనా తీవ్ర విమర్శలే చేశారు. అంతేకాదు.. కొన్నాళ్లుగా ఆయన పార్టీ నేతలపైనా విమర్శలు చేస్తూ.. వివాదాలకు కేంద్రంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం …
Read More »వైసీపీలో `ఓడిన` పూలు వికసిస్తాయా .. ?
గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున 175 మంది పోటీ చేస్తే.. 164 మంది పరాజయం పాలయ్యారు. వీరిలో ఉద్ధండులు.. మేదావులు.. అసలు గెలుపే తప్ప.. ఓటమి అన్న మాటే తెలియని నాయకులు ఉన్నారు. మరి ఎందుకు ఓడారంటే.. వైసీపీ వాదన ఒకవిధంగా ఉంది. కూటమి ప్రభావం, తమకంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీలతోనే తాము ఓడామని అంటున్నారు. కానీ, సర్వేపల్లి, గుడివాడ, ప్రొద్దుటూరు, …
Read More »సిగాచీ యాజమాన్యానికి ఎందుకింత నిర్లక్ష్యం..?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ కెమికల్ కంపెనీపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిగాచీలో సోమవారం ఉదయం భారీ రియాక్టర్ పేలగా.. ప్రమాదంలో ఇప్పటిదాకా 39 మంది చనిపోగా… 35 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇంకో 43 మంది కంపెనీ కార్మికుల జాడే తెలియడం లేదు. ప్రమాదం జరిగి బుధవారం ఉదయానికి 48 గంటలు పూర్తి కానుంది. …
Read More »బ్రేకింగ్!… వంశీకి అన్ని కేసుల్లో బెయిల్!
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు మంగళవారం భారీ ఊరట లభించింది. అయితే ఈ ఊరట పర్మనెంటా?, లేదంటే తాత్కాలికమేనా? అన్నది బుధవారం మధ్యాహ్నానికి గాని తెలియదు. ఏదైనా కొత్త కేసు నమోదు కాకపోతే వంశీ బెయిల్ పై బయటకు వచ్చినట్టే. లేదంటే అంతే సంగతులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా… ఇదివరకే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన …
Read More »చెవిరెడ్డి గారూ… ఈ గోలేమిటండీ?
వైసీపీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోల ఇప్పుడు మరీ ఎక్కవ అయిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న మద్యం కుంభకోణంలో చెవిరెడ్డికి పాత్ర ఉందో, లేదో తెలియదు గానీ… చెవిరెడ్డి మాత్రం తనను ఈ కేసులో అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని పలుమార్లు ఆరోపించారు. చెవిరెడ్డి కోరినట్లుగానే ఆయనను సిట్ అధికారులు …
Read More »జగన్ పాదయాత్ర 2.0, ఇప్పట్లో లేనట్టేనా…?
వైసీపీ శ్రేణులంతా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మునుపటి మాదిరిగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు కూడా జగనే కారణమని కూడా చెప్పాలి. ఎందుకంటే మొన్నామధ్య త్వరలోనే తన పాదయాత్ర ఉంటుందని, అది గత పాదయాత్ర కంటే కూడా సుదీర్ఘంగా ఉంటుందని స్వయంగా జగనే ప్రకటించారు. అయితే తన పాదయాత్ర ఇప్పుడప్పుడే ఉండదంటూ జగన్ మంగళవారం కుండబద్దలు కొట్టేశారు. దీంతో అప్పటిదాకా హుషారుగా ఉన్న …
Read More »`చెల్లి` మాటెత్తకుండా.. `అమ్మ`కు జగన్ క్రెడిట్!
వైసీపీ అధినేత జగన్.. తాజాగా వైసీపీ యువ జన విభాగం కార్యకర్తలు, నాయకులతో తాడేపల్లిలోని నివా సంలో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన విభాగం కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రస్తానం నుంచి గత ఏడాది ఎన్నికల వరకు జరిగిన అన్ని విషయాలను వారితో పంచుకున్నారు. అంతేకాదు.. యువజన విభాగంతో జగన్ భేటీ కావడం కూడా.. గత 7 సంవత్సరాల్లోఇదే తొలిసారి కావడం …
Read More »39కి చేరిన మృతులు.. మరో 43 మంది ఏమయ్యారో?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం జరిగిన ప్రమాదం భారీ ప్రమాదం ఎంతమాత్రం కాదు. అంతకు వంద రెట్లకు మించిన ప్రమాదం అది. సోమవారం ప్రమాదం జరిగిన సమయంలో 8 మంది చనిపోగా… మంగళవారం ఉదయానికంతా మృతుల సంఖ్య ఏకంగా 39కి చేరిపోయింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇదిలా ఉంటే… ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలోనే ఉన్న …
Read More »వైఫల్యం నుంచి వైఫల్యం దిశగా..
ఏపీలో ప్రతిపక్ష పార్టీగా 11 స్థానాలకు పరిమితైన వైసీపీలో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు నాయకులను అటు ఇటు మార్చి నియోజకవర్గంలో ప్రయోగాలు చేసిన వైసిపి అధినేత జగన్.. ఆ తర్వాత కూడా దానిని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి నియోజకవర్గం మార్పు అనేది వికటించిన ప్రయోగం. చాలామంది నాయకులు ఓడిపోవడానికి ఈ మార్పు కారణం అన్న చర్చ కూడా పార్టీలో ఉంది. అయితే దీనిపై ఏమాత్రం విశ్లేషణ చేయకుండా …
Read More »జూనియర్ చెవిరెడ్డికీ ఇక జైలే గతి!
ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య సోమవారం నాటికి 11కి చేరింది. ఈ సంఖ్య త్వరలోనే 12కు చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ 12 అరెస్టు మరెవరిదో కాదు…చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని తెలుస్తోంది. ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్న మోహిత్ తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అటు ట్రయల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టును కూడా కోరారు. ఈ …
Read More »ఆ విషయం తేల్చకుండా.. జగన్ తొందరపడ్డారు!
వైసీపీ నాయకుల్లో ఇప్పుడు ఈ చర్చే సాగుతోంది. ఆ విషయం తేల్చకుండా.. జగన్ తొందరపడ్డా రంటూ.. మెజారిటీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నాయకులు గడప దాటడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. జగన్ పెట్టిన డెడ్ లైన్ కూడా దాటిపోయింది. ఇంటింటికీ వెళ్లి.. సీఎం చంద్రబాబు గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని.. ప్రజలను ప్రభుత్వంపై ఉసి గొల్పాలని జగన్ తేల్చి చెప్పారు. దీనికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates