Political News

కేసీఆర్ ముంద‌స్తు వ్యూహాలు

KCR

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి కేసీఆర్ తొలిసారి సీఎం అయ్యారు. రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన పార్టీగా టీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్నారు. ఇక రెండోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే ఆలోచ‌న‌తో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే దెబ్బ ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లార‌నే అభిప్రాయాలున్నాయి. 2018లోనే …

Read More »

ఈ నష్టాన్ని బీజేపీ పూడ్చుకోవడం అసాధ్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి ఘటన వల్ల బీజేపీకి బాగా డ్యామేజి జరిగేట్లుంది. నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన జరిగిన డ్యామేజీని భర్తీ చేసుకోవటం సాధ్యమయ్యేది కాదు. నాలుగు రోజుల క్రితం లఖింపూర్ ఖేరిలో ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న రైతుల మీదకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కొడుకు వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించటంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో …

Read More »

ఏలూరు టీడీపీ పుంజుకోవాలి బ్ర‌ద‌ర్‌!

పశ్చిమ‌గోదావ‌రి జిల్లా. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో మిత్ర‌త్వం ఉన్న కార‌ణంగా.. ఇక్క‌డి తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గాన్ని.. ఆ పార్టీకి కేటాయించి.. మిగిలిన స్థానాల్లో టీడీపీ విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. అంతేకాదు.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బ‌ల‌మైన నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో.. వైసీపీ సునామీ.. జ‌గ‌న్ హ‌వా న‌డిచిన‌ప్ప‌టికీ.. పాల‌కొల్లు.. ఉండి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. జిల్లా ప్ర‌ధాన కేంద్రం.. ఏలూరులో …

Read More »

వైసీపీ కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే…!

ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు రెండు విష‌యాలు అంత‌ర్గ‌తంగా ఒక్క‌టే టెన్ష‌న్ రేపుతున్నాయి. ద‌స‌రా త‌ర్వాత జ‌గ‌న్ త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిలో అంద‌రిని త‌ప్పించేస్తారా ? లేదా ముగ్గురు, న‌లుగురు మిన‌హా అంద‌రిని ప‌క్క‌న పెడ‌తారా ? అన్న‌ది కాస్త స‌స్పెన్స్‌. వైసీపీ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్లు కేబినెట్‌లో మార్పులు, చేర్పులు టెన్ష‌న్‌తో ఉంటే.. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో త్యాగాలు చేసిన వారు, …

Read More »

మోత్కుప‌ల్లికి పెద్ద‌పీట‌

మాజీ మంత్రి మోత్కుప‌ల్లి నర్సింహులు ద‌శ తిర‌గ‌నుందా? ఆయ‌నకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీల‌క ప‌ద‌వి అప్ప‌గించనున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. మోత్కుప‌ల్లికి కేసీఆర్ అధిక ప్రాధాన్య‌త‌నిస్తుండ‌డ‌మే అందుకు కార‌ణం. తాజాగా ఆయ‌నను కేసీఆర్ అసెంబ్లీకి తీసుకుని వెళ్లారు. స‌భ అయిపోయేంత వ‌ర‌కూ మోత్కుప‌ల్లి సీఎం కార్యాల‌యంలోనే ఉన్నారు. ఆ త‌ర్వాత కేసీఆర్ వెంట ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళ్లారు. దీంతో ద‌ళిత బంధు ప‌థకాన్ని ప్ర‌తిష్ఠాత్మకంగా …

Read More »

అమరావతిపై మరో వివాదానికి తెర తీసిన ప్రభుత్వం

ఏపీ సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడంఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా జగన్ వదిలేశారని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నా… వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులంటూ చెబుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కొద్ది …

Read More »

జ‌న‌సేన‌లోకి ఆ నాయ‌కులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌లపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి నుంచే దృష్టి సారించారు. ఆ దిశ‌గా పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించిన ఆయ‌న‌.. మ‌రోవైపు వివిధ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో ఉండేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవ‌ల రిప‌బ్లిక్ ప్రి రిలీజ్ వేడుకులో ఏపీ సీఎం జ‌గ‌న్‌పై అధికార ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌.. శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవ‌ల ఏపీలో ప‌రిష‌త్ …

Read More »

ఏపీ.. యూపీ.. సేమ్ టు సేమ్‌.. యాత్ర స్పెష‌ల్ పాలిటిక్స్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో.. చెప్ప‌డం క‌ష్టం. వ‌రుస ప‌రాజ‌యాలు.. పార్టీ అధినేత‌కు పెద్ద ప‌రీక్ష‌గా మారిన ద‌రిమిలా.. దేశ‌వ్యాప్తంగా.. యాత్రా రాజ‌కీయాలు పుంజుకుంటు న్నాయి. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌లు పార్టీల ప్ర‌ధాన నాయ‌కులు.. యాత్రా స్పెష‌ల్స్‌కు సిద్ధ‌మవుతున్నారు. ఎన్నిక‌లకు ఏడాది, రెండేళ్ల ముందు.. పాద‌యాత్ర‌లు చేయ‌డం.. లేదా బ‌స్సు యాత్ర‌లు చేయడం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవల ఏపీ మాజీ …

Read More »

బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో మ‌రో ట్విస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తున్న బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో మ‌రో ట్విస్ట్. ఆ ఎన్నిక‌లో పోటీ చేసేందుకు మ‌రో పార్టీ సిద్ధ‌మైంది. త‌మ అభ్య‌ర్థిని పోటీకి నిల‌బెడ‌తామ‌ని తాజాగా కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే బీజేపీ కూడా అక్క‌డ పోటీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ స‌హా అక్క‌డ మూడు ప్ర‌ధాన పార్టీలు బ‌రిలో దిగుతుండ‌డంతో రాజ‌కీయ వేడి రాజుకుంటోంది. అయితే అక్క‌డ …

Read More »

ఆరు పోస్టులు.. కేసీఆర్‌కు.. అర‌వై స‌మ‌స్య‌లు!

రాజ‌కీయాల్లో నాయ‌కులు.. ప‌ద‌వులు ఆశించ‌డం సాధార‌ణ ప్ర‌క్రియే. రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారు.. అంటే..ప‌ద‌వుల కోస‌మేన‌ని నాయ‌కులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతుంటారు. సో.. ఏ పార్టీలో ఉన్న నాయ‌కుల ల‌క్ష్య‌మైనా ఇదే. అయితే.. ఈ ప‌రిస్థితే ఆయా నేత‌ల విష‌యంలో పార్టీ అధినేత‌ల‌కు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మిస్తోంది. ఇప్పుడు ఇదే విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా.. తీవ్ర ఇర‌కాటంలో ప‌డ్డారు. తాజాగా రాష్ట్ర శాస‌న మండ‌లికి సంబంధించి.. ఆరు స్థానాలు …

Read More »

10 వేల కోట్ల అవకాశం వైసీపీ సర్కారు పోగొట్టుకోనుందా?

10 వేల కోట్లు. అక్ష‌రాలా.. ప‌ది వేల కోట్ల‌రూపాయ‌లు. ఈ నిధుల‌ను తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కేంద్రం ఉచితంగా అందిస్తున్న భారీ నిధి! మ‌రి ఈ నిధులు మ‌న‌కు వ‌స్తాయా? అస‌లు కేంద్రం మ‌నల‌ను ప‌ట్టించుకుంటుందా? అంటే.. వైసీపీ స‌ర్కారు చేసిన నిర్వాకం కార‌ణంగా.. దీనిపై సందిగ్ధ ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక గొప్ప అవ‌కాశాన్ని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా .. కూల‌దోసుకుంద‌ని.. పెద‌వి విరుస్తున్నారు. …

Read More »

జ‌గ‌న్ మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

ఏపీలో త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌న్న వార్త‌లు అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రికి వారు త‌మ త‌మ రూట్ల‌లో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పైగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మొత్తం 100 శాతం మంత్రి వ‌ర్గాన్ని మార్చేస్తారని.. తాను కూడా మంత్రి వ‌ర్గంలో ఉండ‌న‌ని చెప్పారు. దీంతో చాలా మంది నేత‌ల్లో కొత్త ఆశ‌లు క‌లుగుతున్నాయి. ఇక …

Read More »