Political News

‘క్రిక్ ఇన్ఫో’పై కోహ్లి అభిమానుల ఫైర్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎవరంటే మరో మాట లేకుండా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పేస్తారు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతడికి భారీగా అభిమానులున్నారు. సోషల్ మీడియాలో ఈ తరం ఉత్తమ క్రికెటర్ ఎవరు అనే పోల్ పెడితే.. కోహ్లీకే ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. ఐతే క్రికెట్ అభిమానుల ఫేవరెట్ వెబ్ సైట్ ‘క్రిక్ ఇన్ఫో’ పెట్టిన ఓ పోల్‌లో …

Read More »

దూరం ఎంతైనా ట్రైన్ టికెట్ 50 రూపాయలే

లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో నానా అవస్థలు పడుతున్నారు వలస కార్మికులు. ఉండటానికి గూడు లేక.. తినడానికి తిండి లేక వాళ్లు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. పెట్టే బేడా సర్దుకుని.. సామానంతా నెత్తిన పెట్టుకుని.. చిన్న పిల్లల్ని ఎండలో రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఒక చిన్న పాప ఇలా మూడు రోజులు ఎండలో నడిచి స్వస్థలానికి …

Read More »

అర్థరాత్రి వేళ మోడీకి ఫోన్ చేసిన ఆ ముఖ్యమంత్రి

అర్థరాత్రి పన్నెండు గంటలు దాటి కాసేపైంది. అలాంటివేళ.. ప్రధానమంత్రిని కాంటాక్టు చేయటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యమా? అందునా.. బీజేపీయేతర పార్టీకి చెందిన సీఎం అయితే మరింత కష్టం కదా? ఇలాంటి సందేహాలకు చెక్ చెబుతూ.. సదరు సీఎం కాంటాక్టు చేసిన వెంటనే ప్రధాని లైన్లోకి వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ప్రధాని మోడీకి అర్థరాత్రి వేళ ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? ఆయన …

Read More »

టీడీపీ మాజీ మంత్రి సైలెంట్ వెనుక‌.. ఏం జ‌రిగింది..?

క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ భూమా అఖిల ప్రియ కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు. నిజానికి ఆమె రాజకీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు.. త‌ర్వాత రాజ‌కీయాలు చేసిన‌ప్పుడు కూడా ఎంతో సైలెంట్‌గా ఉండేవారు. త‌న తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డిచారు. అయితే, నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆమె ఒక్క సారిగా పుంజుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఈమెకు రాజ‌కీయాలు ఏం తెలుసు అనుకున్న‌వారు కూడా ముక్కున వేలేసుకునేలా వ్య‌వ‌హ‌రించి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర …

Read More »

డేంజ‌ర్ జోన్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు 35 వేల దాకా ఉంటే.. అందులో దాదాపు మూడో వంతు కేసులు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి. అక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 600 మంది దాకా మృతి చెందారు. దేశంలోనే అత్యంత జ‌న‌సాంద్ర‌త క‌లిగిన ప్రాంతం అయిన ధారావి మురికివాడ‌లో వంద‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప‌దుల సంఖ్య‌లో చ‌నిపోతున్నారు. అలాంటి రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ …

Read More »

లాక్ డౌన్ పొడిగింపున‌కు అస‌లు కార‌ణం?

మే 3 తర్వాత అయినా కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ విష‌యంలో ఊర‌టిస్తుందేమో అని ఆశ‌గా చూసిన జ‌నాల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. ఇంకో రెండు వారాలు లాక్ డౌన్‌ను కొన‌సాగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. శ‌నివారం ఉద‌యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఈసారి లాక్ డౌన్ అమ‌లులో ష‌ర‌తులు ఎలా ఉంటాయో.. మిన‌హాయింపులేమైనా …

Read More »

కుప్పంలో చంద్రబాబు పీఏ భారీ కుంభకోణం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు నమోదైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ల వ్యవహారంలో మనోహర్ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఆ డిపాజిట్లపై మనోహర్ రూ. 12 లక్షల లోన్ తీసుకొని…ఆ డబ్బును స్వాహా చేసినట్లు వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు….మనోహర్ పై కేసు …

Read More »

రేవంత్ వ‌ర్సెస్ కేటీఆర్ మ‌ధ్య‌లో బీజేపీ

గ‌త కొద్దికాలంగా మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డం అన్న‌ట్లుగా సాగుతున్న ఫైర్‌బ్రాండ్ నేత‌, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ బావ‌మ‌రిది పాకాల రాజేంద్ర ప్ర‌సాద్ డైరెక్టర్‌గా ఫార్మా కంపెనీకి రూ. 140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. ఆయ‌న డైరెక్టర్‌గా చేరిన ల‌క్సాయ్ …

Read More »

బిగ్ బ్రేకింగ్ : లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం

Lockdown

అందరూ ఊహించినట్టే జరిగింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీతో రెండో లాక్ డౌన్ గడువు ముగియనుండగా… తాజాగా దానిని మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే మరో 14 రోజులు లాక్ డౌన్ పొడిగించినట్లు అర్థమవుతోంది. కేంద్రం ఎన్ని పాజిటివ్ కౌంట్లు వేసినా దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. …

Read More »

లాక్ డౌన్ ఉల్లంఘన..ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై పిల్

కరోనాను కట్టడి చేసే ఏకైక ఉద్దేశంతోనే కఠినంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 1.0 సత్ఫలితాలనివ్వడంతో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిరోధించేందుకు లాక్ డౌన్ 2.0ని విధించక తప్పలేదు. లాక్ డౌన్ సమయంలో బయట తిరగకూడదని…సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం, పోలీసులు మొత్తుకుంటున్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజా ప్రతినిధులు కూడా కొంత …

Read More »

లాక్ డౌన్ … కరోనా కంటే పెద్ద వైరస్ – నిపుణులు

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నది… మన వద్ద పాపులర్ సామెత. కరోనా, లాక్ డౌన్ లకి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. మొదటి లాక్ డౌన్ మన దేశం చాలా తెలివిగా విధించింది. సరైన సమయంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఉద్యోగాలు పోయాయి. కోట్ల మందికి కూలీ పోయింది. అయినా పర్లేదు. ఎందుకంటే… ఆ లాక్ డౌన్ వల్ల కరోనా ఎంత పెద్ద ప్రమాదమో ప్రజలకు …

Read More »

ట్విట్ట‌ర్లో అన్‌ఫాలో… అస‌లు విష‌యం చెప్పిన అమెరికా

భారత ప్రధాని నరేంద్రమోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి వైట్ హౌస్‌‌ అన్‌ఫాలో చేయడం సంచలనమైంది. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్.. మోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి అన్‌ఫాలో చేశారు. దీనిపై పెద్ద దుమార‌మే రేగింది. అమెరికా, ఇండియా మధ్య రిలేషన్‌ దెబ్బతినిందని, అందుకే ఇలా జరిగిందని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌ వివరణ ఇచ్చింది. తాము కొద్దిరోజుల పాటే, ప్ర‌త్యేక …

Read More »