రాజకీయాల్లో ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కోవాలంటే వాగ్ధాటి ఉండాలి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు అదెంతో అవసరం. ప్రతిపక్ష నాయకుడు ఒక్క మాట ఉంటే.. అధికారంలో ఉన్న నేతలంతా కలిసి మూకుమ్మడి దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఏడేళ్లులో ఎప్పుడూ లేనంతగా అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీలు బలం పుంజుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ …
Read More »పదవి లేకపోతే అంత ఛీపా?
అధికారంలో ఉన్న నాయకులు ఎక్కడికెళ్లినా తమ మాట నెగ్గించుకోవాలని చూస్తారు. తమ ఆధిపత్యమే చలాయించేందుకు ప్రయత్నిస్తారు. తమ పార్టీలో పదవుల్లో లేని నాయకులను తక్కువ చేసి చూసేందుకూ వెనకాడరు. పదవిలో లేని నాయకుండంటే ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనే తగిన ఆదరణ ఉండదనేది నిజం. ఇప్పుడు ఖమ్మంలోని టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఇలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. …
Read More »బీజేపీ.. తెగేదాకా లాగుతోందా?
ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికతో బీజేపీ జనసేన బంధానికి తెరపడనుందా? పవన్‌తో పొత్తు విషయంలో బీజేపీ తెగేదాకా లాగుతోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నిక ఏకగ్రీవం కావాలనే ఉద్దేశంతో రాజకీయ విలువలను పాటించి బద్వేలులో పోటీకి దూరంగా ఉంటున్నట్లు జనసేన ప్రకటించినప్పటికీ బీజేపీ ఈ ఎన్నికలో అభ్యర్థిని నిలబెడుతుందని పవన్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా వెల్లడించడం …
Read More »వైరల్ వీడియో: ‘లఖింపర్ ఖేరి’ ఆరాచకం
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీలోని ‘లఖింపర్ ఖేరి’ అరాచకాన్నిఇంతవరకు కేవలం విన్నాం. ఆ దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో.. నిరసన చేస్తున్న వారు.. తమ దారిన తాము ముందుకు నడుస్తున్న వేళ.. ఏ మాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి.. ముందుకు వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. అధికారంతో కన్నుమిన్ను కానకుండా ఉన్న వైనం చూస్తే.. …
Read More »వైసీపీ నేతలకు.. పనితగ్గించిన.. టీడీపీ..!
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలోని.. ఎస్సీ నియోజకవర్గం బద్వేల్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. దీనికి సంబంధించి.. వైసీపీ గత ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచి అనారోగ్యంతో మృతి చెందిన వెంకటసుబ్బయ్య సతీమణి సుధకే టికెట్ ఇచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తన ప్రచారానికి కూడా రెడీ అయింది. అంతేకాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు. ఎలా …
Read More »పేర్ని నాని ఈ క్లారిటీ ఎందుకిచ్చినట్లో?
ఈ మధ్య తెలుగు సినిమా వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల ధరలు, అదనపు షోలు లాంటి విషయాల్లో ప్రభుత్వం నియంత్రణ తీసుకురావడాన్ని ఇండస్ట్రీ జనాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కానీ తమ అసంతృప్తిని బయటికి వెళ్లగక్కే సాహసమే చేయలేకపోతున్నారు. ఈ విషయం ఇలా ఉంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కూడా రాజకీయ రంగు పులుముకోవడం చర్చనీయాంశంగా మారింది. మెగా …
Read More »తెలంగాణలో పద్మశ్రీకి అర్హులు లేరా?
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల దూకుడు తగ్గించారు. గత నెలలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత.. కేంద్రంపైనా.. బీజేపీపైనా.. జాతీయ స్థాయిలో విమర్వలకు దూరంగా ఉన్నారు. అయితే.. తాజాగా ఆయన తన పాత ధోరణిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందని నిప్పులు చెరిగారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. టూరిజంతో …
Read More »వైసీపీ టార్గెట్.. @ లక్ష.. వర్కవుట్ అయ్యేనా…?
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ వైసీపీ నాయకుడు మృతి చెందడంతో వచ్చిన ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే.. ఇక్కడ.. వైసీపీ పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల ని.. దేశం మొత్తం.. తిరుపతి వైపు చూడాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. …
Read More »జగన్ పట్ల మోహన్ బాబు అసంతృప్తి?
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాజకీయాలతో కూడా గొప్ప బంధమే ఉంది. ఆయన తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్.. ఇలా పలు పార్టీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేశారు. చివరగా ఆయన వైకాపాకు మద్దతు ఇవ్వడం తెలిసిందే. 2019 ఎన్నికల ముంగిట జగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అంతే కాక గత తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగా తన కాలేజీకి ఫీజ్ …
Read More »థియేటర్ లో తొలిసారి సినిమా చూసిన ఎమ్మెల్యే సీతక్క
సినిమా అన్నది తల్లి పొత్తిళ్లతోనే మొదలవుతుంది తెలుగువారికి. చంటి పిల్లల్ని భుజాన ఎత్తుకొచ్చి థియేటర్ లో సినిమాలు చూసే తల్లులు చాలామందే కనిపిస్తారు.అలా పరిచయమైన థియేటర్.. ఆ తర్వాత తన సమ్మోహన శక్తితో తరచూ లాగేస్తుంటుంది. సినిమా చూసే రెండున్నర గంటల పాటు తమను తాము మర్చిపోయేలా సరికొత్త అనుభూతిని ఇచ్చే మేజిక్ దాని సొంతం. అలాంటి మేజిక్ ను..కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇప్పటివరకు చూడలేకపోవటం నిజంగానే విచిత్రం. మన …
Read More »వ్యూహం మార్చిన బాబు – బద్వేల్ కు బై చెప్పేశారు
కొన్ని సందర్భాల్లో సంప్రదాయాన్ని.. మరికొన్ని సందర్భాల్లో అలాంటివాటిని పట్టించుకోని తత్త్వం కొందరు అధినేతల్లో ఈ మధ్యన కనిపిస్తోంది. అందుకు భిన్నంగా తాను వ్యవహరిస్తానన్న విషయాన్ని తన చేతలతో మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. విపక్షంగా ఉన్న తెలుగు దేశం త్వరలో జరిగే బద్వేల్ ఉప ఎన్నిక పోటీకి తమ పార్టీ దూరంగా ఉంటుందని ప్రకటించారు చంద్రబాబు. దీనికి కొట్టేయలేని కారణాన్ని చెప్పిన ఆయన.. తెలివిగా వ్యవహరించారని చెప్పాలి. నిజానికి ఉమ్మడి …
Read More »జగన్‌కు పరీక్ష పెడుతున్న యువ నేతలు.. ఇద్దరినీ పక్కన పెడతారా..?
ఆ ఇద్దరు యువ నాయకులు ఏపీ సీఎం జగన్‌కు తలనొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జగన్‌ను ఇబ్బంది పెడుతున్నాయా? కీలకమైన జిల్లాలో పార్టీ పట్టుకోల్పోవడానికి.. ఈ ఇద్దరు నేతలే కారణమని.. సీఎంకు సమాచారం అందిందా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ! తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. గత 2019 ఎన్నికల్లో జగన్ సునామీ వీచినా.. ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బలమైన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates