ఓ వైపు దేశంలో తిరిగి కాంగ్రెస్‌కు పునర్వైభవం తెచ్చే దిశగా యువ నాయకత్వం పనిచేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు మాత్రం సొంత పార్టీపై విమర్శలు చేయడం మానడం లేదు. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ తప్పులను, అసమర్థతను బయట పెడుతూనే ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని గెలిపించే వ్యూహాలను సిద్ధం చేయాల్సింది పోయి.. పార్టీకి నష్టం కలిగేలా వాళ్లు …
Read More »‘జగనన్న ఉన్నాడు జాగ్రత్త..’ రోడ్లపై వెలుస్తున్న బ్యానర్లు…
ఏపీ సీఎం జగన్ అంటే ప్రజలకు ఎంతో అభిమానమని .. ఆ పార్టీ నేతలు తరచుగా చెబుతుంటారు. అంతే కాదు.. ప్రజలకు ఉన్న అభిమానమే ఎన్నికల్లో ఓట్ల రూపంలో రాలుతోందని కూడా వినిపిస్తుంటారు. అయితే.. ఇప్పుడు నిజంగానే ప్రజలు జగన్‌పై అభిమానం చూపిస్తున్నారు. జగనన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ.. రోడ్లపై బ్యానర్లు పెడుతున్నారు. దీనికి కారణం ఏంటి. ఎందుకు? అంటే.. చిత్రమైన సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి ప్రస్తుతం …
Read More »మోడీ మార్క్.. ఏడేళ్లలో 73 లక్షల కోట్ల అప్పు
దేశాన్ని మార్చే నాయకుడంటూ వరుసగా రెండు సార్లు మోడీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. అవును.. ఆయన దేశాన్ని మారుస్తున్నారు కానీ అభివృద్ధి భారతంగా కాదు అప్పుల దేశంగా అనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తారని ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. అప్పుల్లో దేశాన్ని పరుగులెత్తిస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా మండి పడుతున్నారు. మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర సర్కార్ దేశాన్ని ఎంత …
Read More »వైసీపీకి.. చంద్రబాబు సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం.. తమ ఎంపీలు.. రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. మరి వైసీపీ ఎంపీలు కూడా సిద్ధమేనా? అని సవాల్ రువ్వారు. ప్రత్యేక హోదాపై ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆనాడు ప్రజలకు ప్రత్యేక హోదా సాధిస్తామని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాజీనామా చేస్తామని చెప్పారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని …
Read More »YCP ఎమ్మెల్యే గ్రాఫ్ సూపర్.. కానీ లక్కే లేదు!
రాజకీయాల్లో ఉన్న నాయకులు దూకుడుగా ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు.. అనుకున్నది సాధించడం కష్టమే. ఇతర ఎమ్మెల్యేల కన్నా కూడా నేను చాలా దూకుడుగా పనిచేస్తున్నాను. అయినా.. నాకు గుర్తింపు లభించడం లేదు! అని ఓ కీలక నాయకుడు పదే పదే వాపోతున్నారు. ఇది అధిష్టానం వరకు కూడా చేరింది. అయినప్పటికీ.. ఏం చేస్తాం.. అవకాశం లేదు! అనే పెదవి విరుపు మాటలే వినిపిస్తున్నాయట! దీంతో సదరు ఎమ్మెల్యే అటు …
Read More »మనోళ్లను కాదని ఆంధ్రోళ్లు కాంట్రాక్టర్లా? రేవంత్ ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తన వ్యాఖ్యలతో టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి.. తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్కు సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్థూపంపై లేదని విమర్శించారు. స్తూపం నిర్మాణ పనులపై సమీక్షించే తీరిక కేసీఆర్కు లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రేవంత్.. కాంట్రాక్టర్‌ని పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ …
Read More »అఖండ సినిమా రివ్యూ బై చంద్రబాబు !!
టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమా సూపర్ హిట్ రేంజ్ సాధించిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. తాను కూడా ఈ సినిమా చూశానని తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ సినిమా చూస్తే చాలని హీటెక్కించే వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో “అఖండ” సినిమా చూస్తే అర్థమవుతుందని అన్నారు. ప్రస్తుతం …
Read More »అమ్మ ‘వేద నిలయం’.. ఇక నుంచి వారిది!
తమిళనాడు ‘అమ్మ’గా అందరి మనసుల్ని ఆక్రమించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయం హక్కుదారులు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. పోయెస్ గార్డెన్ లోని ఈ సువిశాల ఇంటి హక్కుదారులు ఎవరన్న విషయంపై తాజాగా మద్రాసు హైకోర్టు క్లియర్ చేసింది. జయలలితకు ఎంతో ఇష్టమైన ఈ ఇంటికి చట్టబద్ధమైన హక్కుదారుల్ని గుర్తించటమే కాదు.. తాజాగా ఆ ఆస్తికి సంబంధించిన తాళాల్ని జయలలిత మేనకోడలు దీపకు అప్పజెప్పారు. అనారోగ్యంతో …
Read More »టీడీపీలో కోవర్టుల కలకలం
ఇపుడు తెలుగుదేశం పార్టీలో కోవర్టుల ఆరోపణలు కలకలం రేపుతోంది. తాజాగా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని నేతలతో సమీక్షలో మాట్లాడుతు పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తానంటు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. నిజానికి పార్టీలో కోవర్టులున్నారని, వైసీపీ నేతలకు లోపాయికారీగా కొందరు తమ్ముళ్ళు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుండో వినిపిస్తున్నవే. అక్కడక్కడ కొందరు నేతలు కోవర్టుల గురించి చెప్పినపుడు చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే స్వయంగా పార్టీ అధినేతే కోవర్టులనే వ్యాఖ్యలు చేశారో …
Read More »ఎన్ని టెన్షన్లున్నా కుప్పం వదలని జగన్
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పెద్ద వ్యూహమే పన్నుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేమంటే మూడు సామాజిక వర్గాల సహకారంతోనే చంద్రబాబును ఓడించేందుకు జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఈ ప్లాన్ ఇచ్చింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అని అందుకనే ప్లాన్ ను అమల్లోకి తెచ్చే బాధ్యతను కూడా జగన్ మంత్రి మీదే పెట్టినట్లు సమాచారం. ఇంతకీ …
Read More »పునరాలోచనలో జగన్… చేయక తప్పదుగా !
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు తదితర విషయాలపై జగన్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి పీఆర్సీని అమలు చేయలేని పక్షంలో ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఇపుడు అమలు చేయాల్సిన పీఆర్సీ 2018, జూలై నుండి పెండింగ్ …
Read More »జగన్ మరో యూ టర్న్
పాలకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం తర్వాత నాలుక్కరుచుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం మంచిదికాదు. ఇపుడిదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా పోలీసుల నియామకాలపై వెనక్కు తగ్గింది కాబట్టే. గతంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా ప్రభుత్వం 15 వేల మందిని నియమించింది. తర్వాత వీళ్లందరినీ మహిళా పోలీసులుగా మార్చాలని డిసైడ్ చేసింది. జగన్ అనుకున్నదే ఆలస్యమని ఈ 15 వేల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates