Political News

కేసీఆర్ అండ్ జగన్.. కేజ్రీవాల్‌ను చూడండయ్యా

కరోనా అందరినీ కష్టపెడుతోంది. ఆదాయం పడిపోయి.. ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారు జనం. ఇలాంటి సమయంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఏ రకంగా అయినా జనాల్ని దోపిడీ చేయడం అన్యాయం. జనాల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాన్ని నడపడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి జనాల్నే బాదేస్తున్నాయి. గత కొన్ని వారాల్లో పెట్రోలు రేట్లు ఎలా పెరుగుతూ పోయాయో తెలిసిందే. 75 రూపాయల్లోపు ఉన్న పెట్రోలు ధర 83 రూపాయలకు చేరువైంది. పెట్రోలుతో పోలిస్తే …

Read More »

ఒక సోనూ సూద్.. మూడు లక్షల ఉద్యోగాలు

లాక్ డౌన్ పెట్టిన మొదట్లో వలస కార్మికుల అవస్థలు చూసి అందరూ కన్నీళ్లు పెట్టిన వాళ్లే. కానీ అందరూ ఎక్కడికక్కడ లాక్ అయిపోయి ఉండటంతో వాళ్లకు మనం ఏం చేయలేం అని ఊరుకున్నారు. ఏం చేసినా ప్రభుత్వాలే చేయాలనుకున్నారు. కానీ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాత్రం అలా ఆలోచించలేదు. వలస కార్మికులను ఆదుకుంటా.. వాళ్లను గమ్య స్థానాలకు చేరుస్తా అంటూ ముందుకొచ్చాడు. అయితే ఒక నటుడు ఇలా ఎంతమందికి …

Read More »

పవన్ మాటకు కేంద్రం ఎంత విలువిచ్చిందంటే..

ఎంతసేపూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నేతల్ని, మోడీ సర్కారును పొగడ్డమేనా.. వాళ్లు ఈయనకు ఏమాత్రం విలువ ఇస్తున్నారు.. ఏం సాయం చేస్తున్నారు.. ఈయన మాటల్ని ఏం పట్టించుకుంటున్నారు అంటూ తరచుగా ప్రశ్నలు తలెత్తున్నాయి. పవన్.. కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎప్పుడు ట్వీట్ వేసినా.. కింద కామెంట్లలో ఇవే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఐతే దేశ విద్యా విధానంలో పెను …

Read More »

చంద్రబాబును ఆయన తప్పుబట్టడం కరెక్టేనా?

ఈ రోజు ఉదయం నుంచి తెలుగు మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జమ్మూ క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో విమర్శించారన్నదే ఆ వార్త. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తన సొంత ఎన్నికలు వదులుకొని మరీ ఏపీకి వెళ్లి …

Read More »

అమ్మ ఇంట్లో దొరికిన బంగారం.. వెండి లెక్కలు విన్నారా?

మరోసారి వేద నిలయం వార్తల్లోకి వచ్చింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని అమ్మ నివాసం ఇప్పుడు ఆమె స్మారక చిహ్నంగా మారటం తెలిసిందే. దశాబ్దాల తరబడి తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ భవనం.. అమ్మ కన్నుమూసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిందో తెలిసిందే. ఈ భవనం యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరిగింది. చివరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంతో.. ఈ భవనం ఎవరికి చెందాలన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. …

Read More »

బీజేపీని ఆడుకునేందుకు కేసీఆర్ టీంకు భ‌లే చాన్స్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో రెండు అంశాల‌పై ఈ విమ‌ర్శ‌లు-ప్ర‌తి విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తెలంగాణ‌లో క‌రోనా క‌ల‌క‌లం ఒక‌టి కాగా, ప్ర‌స్తుత స‌చివాల‌యం కూల్చివేసి కొత్తది నిర్మించ‌డం ఇంకో విష‌యం. అయితే, రెండో విష‌యంలో ఇన్నాళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డుతున్న బీజేపీ స‌రిగ్గా అలాంటి చాన్సే గులాబీ …

Read More »

బాబు చేసిన పొరపాటే జగన్ కూడా చేస్తున్నారా?

రాజకీయంగా ఒప్పులు చేయకున్నా ఫర్లేదు తప్పులు మాత్రం చేయకూడదు. బలంగా ఉన్నప్పుడు.. అందునా అధికారంలో చేతిలో ఉన్నప్పుడు చేసే తప్పులు కొట్టుకుపోతాయి. అయితే.. తర్వాతి రోజుల్లో మత్రం ఇవన్నీ కలిసి కట్టుగా దండయాత్ర చేసినట్లుగా మీద పడతాయి. అప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పవు. అందుకు నిలువెత్తు రూపంగా టీడీపీ అధినేత చంద్రబాబును చెప్పొచ్చు. తెలుగు రాజకీయాల్లో ప్రతి విషయంలోనూ బాబును వేలెత్తి చూపించినంతగా మరే నేతను ఎవరూ చూపించరు. దీనికి …

Read More »

తన బట్టలు తనే ఉతుక్కుంటున్న ముఖ్యమంత్రి

ఒకప్పటి భారత ప్రధాని లాబ్ బహదూర్ శాస్త్రిని కలుద్దామని ఓ నాయకుడు ముందు చెప్పకుండా ఆయన ఇంటికి వెళ్తే.. బట్టలు ఉతుక్కుంటూ కనిపించారట. దీని గురించి జనాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి మన నేతాశ్రీల నుంచి ఇలాంటి సింప్లిసిటీని ఊహించగలమా? కానీ చోటా నేతలు కూడా వందలు, వేల కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న ఈ రోజుల్లో కూడా ఓ ముఖ్యమంత్రి కొన్ని రోజులుగా తన …

Read More »

అత్యధిక కేసులున్న రాష్ట్రంలోకి ఎంట్రీ పాసులా?

7948.. ఒక రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇది. ఈ నంబర్ చూడగానే ఏ మహారాష్ట్రో.. తమిళనాడో.. లేదంటే ఢిల్లీ అయి ఉండొచ్చని అంతా అనుకుంటారు. కానీ ఒక రోజులో ఇన్ని కేసులు నమోదైంది మన ఆంధ్రప్రదేశ్‌లో అంటే షాకవ్వాల్సిందే. అక్కడ కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేస్తున్నాం.. త్వరగా పాజిటివ్ కేసుల్ని …

Read More »

జగన్ కు కేంద్రం ఝలక్… మాతృభాషలోనే ప్రాథమిక విద్య

ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కొత్త నిర్ణయాలను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో కోర్టులు, రాజకీయ పార్టీలు, సామాన్య జనం ఏమనుకుంటున్నా కూడా పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తున్న జగన్… తాను అనుకుంటున్న నిర్ణయాలను అమలు చేసి తీరేందుకే సిద్ధ పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే పలుమార్లు కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న జగన్… తాజాగా కేంద్రం నుంచి కూడా …

Read More »

మోడీ ప్రస్తావిస్తే చాలు సుడి తిరిగిపోతుందంతే

విమర్శలు ఎంతగా విరుచుకుపడని.. మేధావులు ఎంతగా తప్పులు ఎత్తు చూపని.. చివరకు దేవుడే దిగి వచ్చి.. బాబు.. మోడీ మంచోడు కాదన్నా నమ్మే పరిస్థితుల్లో దేశంలోని మెజార్టీ ప్రజలు లేనట్లుగా కనిపిస్తోంది. కరోనా దేశానికి అంతగా రాని వేళలో.. ఒక రోజు ఇంట్లో నుంచి మీరు బయటకు రావొద్దని మోడీ నోటి నుంచి మాట వచ్చిన తర్వాత.. ఏం జరిగిందో తెలిసిందే. అంతలో.. ఆయన పాలోయర్స్ చేసిన హడావుడి అంతా …

Read More »

పార్లమెంటు భవనాన్ని కూల్చేస్తాం.. తేల్చేసిన కేంద్రం

పురాతన భవనాలు.. చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాల్ని కాలానికి అనుగుణంగా కూల్చేయటం తప్పించి మరో మార్గం లేదా? చరిత్రకు సాక్ష్యాలుగా నిలవటానికి భిన్నంగా.. వాటిని నేలమట్టం చేసేసి.. దాని స్థానే కొంగొత్తగా భవనాల్ని కట్టుకుంటూ పోవటానికి మినహా మరో మార్గం లేదా? అన్న ప్రశ్న తలెత్తేలా వ్యవహరించింది కేంద్రంలోని మోడీ సర్కారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం చాలా పాతదైందని.. దాన్ని కూల్చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక అఫిడవిట్ …

Read More »