సీఎం సార్ గుడ్ మార్నింగ్.. అంటూ జనసేన కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో హోరెత్తిపోయింది. రోడ్లన్నీ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఏమాత్రం ప్యాచ్ వర్క్‌లు కూడా వేయలేక పోయారని ధ్వజమెత్తారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్, పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
గోతుల రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని జనసేన పశ్చిమ గోదావరి జిల్లా నాయకురాలు గవర లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై గోతిలో నీటి దగ్గర ఆమె నిరసన తెలిపారు. పట్టణ పరిధిలో గోతుల దగ్గర జనేసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఏపీ రోడ్ల దుస్థితిపై జనసేన నాయకులు చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్లో.. ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్ ‘ అనే నినాదంతో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో జనసేన కార్యకర్తలు, నాయకులకు పోస్టు చేస్తున్నారు.
రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాలకువెళ్లి.. ఆందోళనలు.. నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో లోతైన గోతులు ఉన్న రోడ్ల ఫొటోను పోస్టుచేస్తున్నారు.
‘గుడ్ మార్నింగ్ సీఎం సార్ ‘ అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు సూచించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు.
పది వేలు ఇచ్చి.. ఆటోవాలా అసహనం
ఇక, ఓ ఆటోవాలా.. ఏపీ సీఎం జగన్.. మంత్రులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రహదారులు నరకంగా ఉన్నాయంటూ.. ఆయన ధైర్యంగా సెల్పీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “పది వేలు వాహన మిత్ర ఇచ్చావు. ఇప్పుడు రోడ్లు ఇలా ఉండే సరికి పాతిక వేలు బండి బాగు చేయించడానికి ఖర్చయింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నీ కో నమస్కారం జగన్ అన్న.. ” అంటూ.. వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates